Skip to main content

France Prime Minister: ఎలిజబెత్‌ బోర్న్‌ రాజీనామాతో ప్రస్తుత ఫ్రాన్స్‌ ప్రధాని ఇతనేనా..?

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టగా ఎలిజబెత్‌ బోర్న్‌ తన పదవి నుంచి రాజీనామాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఇతను నియమితుడయ్యాడు..
New Prime Minister of France is now Gabriel Attal

ఫ్రాన్స్‌ ప్రధానమంత్రిగా అత్యంత పిన్న వయస్కుడైన 34 ఏళ్ల గాబ్రియెల్‌ అట్టల్‌ నియమితులయ్యారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర రాజకీయ ఒతిళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రధాని ఎలిజబెత్‌ బోర్న్‌ సోమవారం రాజీనామా చేశారు. ఆమె స్థానంలో అట్టల్‌ను నియమిస్తున్నట్లు మంగళవారం మాక్రాన్‌ ప్రకటించారు.

India-Maldives Row: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు..

మంత్రి వర్గంలో కొందరు కీలక మంత్రులు మాత్రం యథాతథంగా కొనసాగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రతినిధిగా, విద్యాశాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ గాబ్రియెల్‌ అట్టల్‌ ప్రధాని పదవి చేపట్టడం ఆసక్తికరంగా మారింది. గే అని ప్రకటించుకున్న ఫ్రాన్స్‌ మొట్టమొదటి ప్రధాని అట్టల్‌ కావడం గమనార్హం. బోర్న్‌ మంత్రి వర్గంలో అట్టల్‌ అత్యధిక ప్రజాదరణ కలిగిన మంత్రిగా ఓపీనియన్‌ పోల్స్‌లో వెల్లడైంది. 

Published date : 11 Jan 2024 03:26PM

Photo Stories