Skip to main content

Indian Economic Statistics Report 2021–22: రూ.1, 2, 5 నోట్లు అవగాహన లోపంతో ఇచ్చేదీ లేదు.. పుచ్చుకునేదీ లేదు

సాక్షి, హైదరాబాద్‌: రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లు చూసి చాలా కాలమైంది కదూ..అవసలు చలామణిలో ఉన్నాయా? అనే అనుమానం కూడా కలుగుతోంది కదూ..కానీ ఉన్నాయి.
Indian Economic Statistics Report 2021–22
Indian Economic Statistics Report 2021–22

అధికారికంగా చలామణీలో ఉన్నాయి. కానీ ఆ నోట్లు ఇవ్వడం కానీ, పుచ్చుకో వడం కానీ దాదాపుగా జరగటం లేదు. చెల్లుబాటు జరగ డం లేదనే ప్రచారం, నిబంధనలు తెలియకపోవడం, రిజ ర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆ దిశగా అవగాహన కల్పించక పోవడం వల్ల..విలువైన నోట్లు ఎందుకూ కొరగానివన్నట్టుగా మారుతున్నాయి. కానీ ఒకప్పుడు అవే రా జ్యమేలాయంటే అతిశయోక్తి కాదు. 1983–84 సంవత్స రంలో 100 రూపాయల నోట్ల కన్నా 1, 2, 5 రూపాయల నోట్లే ఎక్కువ సంఖ్యలో చలామణి అయ్యాయి. క్రమంగా ఇవి తగ్గుతూ వచ్చినా ఇప్పటికీ.. అంటే 2021– 22 నాటికి కూడా రూ.వందల కోట్ల విలువైన ఈ నోట్లు ఇంకా అధికారికంగా చలామణిలోనే ఉండడం విశేషం. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన భారత ఆర్థిక గణాంకాల నివేదిక (ఇండియన్‌ ఎకానమీ స్టాటిస్టిక్స్‌) 2021–22 ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

Also read: ఆర్థిక వృద్ధి.. అసమానతలు.. మానవాభివృద్ధి

నాణేలు కూడా..
ప్రస్తుతం 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. ఇందులో 1, 2, 5 రూపాయల నాణేలకు ఇప్పటికీ విలువ ఉంది. వీటిని ప్రజలు పరస్పరం మార్పిడి చేసుకుంటున్నారు. కానీ, 10, 20 రూపాయల నాణేలను మాత్రం ప్రజలు అంగీకరించడం లేదు. అక్కడక్కడా రూ.20 నాణేల పరస్పర మార్పిడి జరుగుతున్నా, రూ.10 కాయిన్‌ ఇస్తే మాత్రం చెల్లదని తిరిగి ఇచ్చేస్తున్నారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ మార్కెట్‌లో రూ.5,404 కోట్ల విలువైన 10 రూపాయల నాణేలు, రూ.674 కోట్ల విలువైన 20 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నాయి.  

Also read: రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-పరిశీలన

నాటి నుంచి నేటి వరకు నోట్లు, నాణేల చలామణి ఇలా.. 

  • ∙1983–84లో రూ.198 కోట్ల రూపాయి నోట్లు చలామణిలో ఉంటే ప్రస్తుతం రూ.382 కోట్లు మార్కెట్‌లో ఉన్నాయి.  
  • ∙1983–84లో రూ.450 కోట్ల రెండు రూపాయల నోట్లుంటే ఇప్పుడు అవి రూ.853 కోట్లకు చేరాయి. 
  • ∙రూపాయి నాణేలు 1983–84లో రూ.303 కోట్లు ముద్రించగా, ఇప్పుడు మార్కెట్‌లో రూ.4,777 కోట్లు ఉన్నాయి.  
  • ∙2021–22లో రూ.6,816 కోట్ల విలువైన రెండు రూపాయల నాణేలు, రూ.9,217 కోట్ల విలువైన ఐదు రూపాయల నాణేలు, రూ.5,404 కోట్ల విలువైన 10 రూపాయల నాణేలు, రూ.674 కోట్ల విలువైన 20 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి.  
  • ∙ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో రూ.3,431 కోట్ల విలువైన ఐదు రూపాయల నోట్లు, రూ.27,805 కోట్ల పది రూపాయల నోట్లు, రూ.22,026 కోట్ల 20 రూపాయల నోట్లు, రూ.43,571 కోట్ల విలువైన 50 రూపాయల నోట్లు ఉన్నాయి. 
  • ∙1987–88 నుంచి అమల్లోకి వచ్చినప్పుడు బహిరంగ మార్కెట్‌లో రూ.180 కోట్ల విలువైన రూ.500 నోట్లుంటే 2021–22 నాటికి రూ.22,77,340 కోట్ల విలువైన నోట్లను ముద్రించాల్సి వచ్చింది.  
  • ∙రూ.100 నోట్ల విషయానికి వస్తే 1983–84లో రూ.11,690 కోట్ల విలువైన నోట్లు ఉంటే ఇప్పుడు రూ.1,81,421 కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. లక్ష కోట్లకు పైగా రూ.200 నోట్లు ఉన్నాయి. 
  • ∙వెయ్యి రూపాయల నోట్లను 2000–01 సంవత్సరంలో వాడుకలోకి తెచ్చినప్పుడు 3,719 కోట్ల నోట్లను ముద్రిస్తే పెద్ద నోట్ల రద్దు సమయానికి (2018–19) వాటి విలువ 6,610 కోట్లకు చేరింది. 
  • ∙ఇక, రెండు వేల రూపాయల నోట్ల విషయానికి వస్తే వాడుకలోకి వచ్చిన 2016–17లో 6.57 లక్షల కోట్ల విలువైన నోట్లను ముద్రించారు.  

నాణేలు.. నగరం
నాణేల ముద్రణతో భాగ్యనగరానికి అవినాభావ సంబంధముంది. నిజాం కాలంలో సైఫాబాద్‌లో మింట్‌ కాంపౌండ్‌ను ప్రారంభించారు. ఈ మింట్‌ 1997 వరకు ఇక్కడ కొనసాగినా.. ఆ తర్వాత దీన్ని చర్లపల్లికి తరలించారు. ప్రస్తుతం చర్లపల్లిలో నాణేల ముద్రణ సాగుతోంది.   

Also read: What happened in the National Herald scandal case: నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం కేసులో జరిగిందిదీ..

నోట్ల చలామణి గణాంకాలివే..
సంవత్సరం నోట్లు (విలువ రూ. కోట్లలో)    నాణేలు (విలువ రూ.కోట్లలో) 

2 2 5 50 100
198384 450 560 3626 11690
199394 624 1860 24991 37784
200304 472 2276 33027 121442
2001314 851 3714 17242 147646
202122 853 3431 43571 181421

నాణేలు (విలువ రూ.కోట్లలో)

1 2 5
303    
705 85 58
1757 1255 2535
3842 4965 5789
4777 6816 9217
Published date : 14 Oct 2022 06:48PM

Photo Stories