Skip to main content

పోటీ పరీక్షల్లో జాగ్రఫీ; సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?

- ఎం.మధులత, రాజాం.
Question
పోటీ పరీక్షల్లో జాగ్రఫీ; సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
 1.  జాగ్రఫీకి సంబంధించి ప్రశ్నలు కోర్ అంశాలతో పాటు వాటితో సంబంధమున్న సమకాలీన అంశాల (Contemporary issues) నుంచి కూడా వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఇటీవల  భౌగోళికంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై దృష్టిసారించాలి.
 2.  రుతుపవనాలు-ముందస్తు అంచనాలు, పులుల అభయారణ్యాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 3.  2015-టైగర్ సెన్సస్ అంశాలను అధ్యయనం చేయాలి. గతంతో పోల్చితే పులుల సంఖ్యలో వచ్చిన మార్పులు, పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలను గుర్తుంచుకోవాలి.
 4.  ఇటీవల కాలంలో నదుల అనుసంధానం (River Linking) పై బాగా చర్చ జరుగుతోంది. నీరు, ఆహార భద్రతకు నదుల అనుసంధానం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అభ్యర్థులు నదుల అనుసంధానం స్థితిగతులు, రాష్ట్రాల మధ్య జలవివాదాలు తదితరాలపై దృష్టిసారించాలి.
 5.  ప్రస్తుతం స్మార్ట్‌సిటీలపైనా పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వీటికి అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ అంశం నుంచి కూడా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
 6.  ప్రపంచ వ్యాప్తంగా (భారత్‌కు ప్రాధాన్యమిస్తూ...) ఐలాండ్ గ్యాస్ నిల్వలపై దృష్టిసారించాలి. యురేనియం నిక్షేపాలపైనా అవగాహన తప్పనిసరి.
 7.  సహజ వనరులు, రవాణా వ్యవస్థ, భూస్వరూపాలు, నదులు, వాతావరణం తదితర అంశాలపై దృష్టిసారించాలి. అట్లాస్ సహాయంతో ప్రిపరేషన్ కొనసాగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
 
ఎస్ అండ్ టీ:
 1.  సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి అంశాలపై దృష్టిసారించాలి.
 2.  అంతరిక్ష రంగం; రక్షణ రంగం; సమాచార-సాంకేతిక రంగాలపై దృష్టిసారించాలి. భారత అంతరిక్ష కార్యక్రమంలో భాగమైన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు, ప్రయోగించిన దేశీయ, విదేశీ ఉపగ్రహాలు, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ నిర్వహించిన ప్రయోగాలపై దృష్టిసారించాలి.
 3.  శక్తి రంగం (Energy Sector) నుంచి కూడా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
 4.  పర్యావరణం, జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ), వాతావరణ మార్పులు అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి వీటికి సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 5.  ఆవరణ వ్యవస్థలు (Eco Systems), అనుకూలనాలు (Adaptations), ఎకలాజికల్ ఇంటరాక్షన్స్, ఇంటర్ గవర్న్‌మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) అసెస్‌మెంట్ రిపోర్ట్, జీవవైవిధ్యం ఎదుర్కొంటున్న ప్రమాదాలు తదితర అంశాలను రివిజన్ చేయాలి. దేశంలోని ప్రధానమైన Endemic Species, వాటి విస్తరణ, ప్రత్యేక లక్షణాలు ముఖ్యమైనవి.

Photo Stories