Skip to main content

PG Courses

పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) స్థాయిలో మెటీయోరాలజీ కోర్సును అందిస్తున్న యూనివర్సిటీలేవి?
+
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
  • కోర్సు: ఎంఎస్సీ (మెటీయోరాలజీ)
  • అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)
    ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
  • కోర్సు: ఎంటెక్ (అట్మాస్ఫియరిక్ సైన్స్)
  • అర్హత: మెటియోరాలజీ/ఫిజికల్ ఓషనోగ్రఫీ/ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ.
వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in

సావిత్రీబాయి ఫూలే పుణె యూనివర్సిటీ
  • కోర్సు: ఎంటెక్ (అట్మాస్ఫియరిక్ సైన్స్)
  • అర్హత: బీఈ/బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్/కంప్యూటర్/సివిల్/అగ్రికల్చరల్/ఎన్విరాన్‌మెంటల్/కెమికల్/ ఏరోస్పేస్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/బయోమెడికల్/ ఇంజనీరింగ్ ఫిజిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్.
    వెబ్‌సైట్: www.unipune.ac.in
  • కోర్సు: ఎంఎస్సీ (అట్మాస్ఫియరిక్ సైన్స్)
  • అర్హత: బీఎస్సీ/బీఈ/బీటెక్. గ్రాడ్యుయేషన్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి.
కెరీర్ అవకాశాలు: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇండియన్ మెటీయోరాలజీ డిపార్ట్‌మెంట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇస్రో, డీఆర్‌డీఓ తదితర ప్రభుత్వ సంస్థలు మెటీయోరాలజీ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మేనేజర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ భారీగా పెరుగుతున్నాయి. ప్రైవేటులోనే కాకుండా ప్రభుత్వరంగంలో, లాభాపేక్షలేకుండా హాస్పిటల్స్ నిర్వహిస్తున్న వారు కూడా ఆసుపత్రులను అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ వనరుల డిమాండ్ బాగా పెరిగింది. అందువల్ల మెడిసిన్, తత్సంబంధ కోర్సుల్లో ప్రవేశం ఉన్నవారికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ ఉన్నత కెరీర్‌ను అందిస్తుంది.

ఈ కోర్సును మెడికల్‌తోపాటు నాన్ మెడికల్ విద్యార్థులు కూడా చేయవచ్చు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి భారతదేశంతోపాటు విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా స్టాఫ్‌ను మానేజ్ చేయటం, హెల్త్ సర్వీసెస్‌ను చూసుకోవటం, ఖర్చుల వివరాలు తెలుసుకోవటం వంటి వాటిపై అవగాహన ఏర్పడుతుంది.

  • దక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్.. హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్(ఎంహెచ్‌ఎం)ను అందిస్తోంది.
  • కాలపరిమితి: రెండేళ్లు.
  • అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ
  • ప్రవేశం: ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  • వెబ్‌సైట్:  www.osmania.ac.in
  • గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో దూరవిద్య విధానంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏను అందిస్తోంది.
  • అర్హత: డిగ్రీ
  • వెబ్‌సైట్:  www.nagarjunauniversity.ac.in
ఎంఎస్సీ సెరీకల్చర్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. సెరీకల్చర్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా బయాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ఎస్‌కేయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.skuniversity.org
  • తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.. సెరీ- బయోటెక్నాలజీలో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    సెరీకల్చర్/అగ్రికల్చర్/హార్టీకల్చర్/ఫారెస్ట్రీ/జువాలజీ/బోటనీ/ కెమిస్ట్రీ/ క్లినికల్ పాథాలజీ/మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్/ మాలిక్యులార్ బయాలజీ/ బయోటెక్నాలజీ/ ఎంటమాలజీ/ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీల్లో ఏదైనా రెండు సబ్జెక్టులతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.spmvv.ac.in
  • వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం.. సెరీకల్చర్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    సంబంధిత సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    ఇదే విశ్వవిద్యాలయం సెరీకల్చర్‌లో డిప్లొమా కోర్సు కూడా అందిస్తోంది.
    వెబ్‌సైట్: www.kakatiya.ac.in
  • బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్‌లో సెరీకల్చర్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    అగ్రికల్చర్/హార్ట్టికల్చర్/అగ్రి బయోటెక్/ ఫారెస్ట్రీ/ సెరీకల్చర్‌లో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.uasbangalore.edu.in
స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో పీజీ అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
     అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ.
     ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
     వెబ్‌సైట్: www.osmania.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
     అర్హత: స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ
     ప్రవేశం: ఏయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
     వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లలో పీజీ అందిస్తోంది.
    అర్హత:
    స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ.
    ప్రవేశం: ఎస్వీయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.svuniversity.ac.in
  • వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్‌లో పీజీ అందిస్తోంది. 
    అర్హత:
    స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
    ప్రవేశం: కేయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.kakatiya.ac.in
  •  కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) స్టాటిస్టిక్స్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో పీజీ, డిప్లొమా కోర్సులు అందిస్తోంది.
    అర్హత:
    మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.isical.ac.in
  • నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.telanganauniversity.ac.in
ఫిజిక్స్‌లో పీజీ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిజిక్స్‌లో పీజీని అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 40 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ.
    ప్రవేశం: ఓయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.osmania.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం
    అర్హత:
    మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ.
    ప్రవేశం: ఏయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం
    అర్హత:
    ఫిజిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: కేయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.kakatiya.ac.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం
    అర్హత:
    ఫిజిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.svuniversity.ac.in
  • తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
    అర్హత:
    కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.spmvv.ac.in
  • కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం
    అర్హత:
    ఫిజిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.yogivemanauniversity.ac.in
  • కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం
    అర్హత:
    ఫిజిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.satavahana.ac.in
  • నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం
    అర్హత:
    ఫిజిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.telanganauniversity.ac.in
  • అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
    అర్హత:
    ఫిజిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.skuniversity.org
  • గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
    అర్హత:
    మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.nagarjunauniversity.ac.inwww.anupgcet.in
ఆంత్రోపాలజీలో పీజీ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఆంత్రోపాలజీలో పీజీని అందిస్తోంది.
    అర్హత:
    బీఎస్సీ/ జువాలజీ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. ఆంత్రోపాలజీలో పీజీని అందిస్తోంది.
    అర్హత:
    జువాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • ఇదే యూనివర్సిటీ బయలాజికల్ ఆంత్రోపాలజీలో పీజీ అందిస్తోంది.
    అర్హత:
    సోషల్ ఆంత్రోపాలజీలో బీఏ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • సోషల్ ఆంత్రోపాలజీలో పీజీ అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.svuniversity.ac.in
ఫొరెన్సిక్ సైన్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. ఫొరెన్సిక్ సైన్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    కెమిస్ట్రీ సబ్జెక్టుతో బీఎస్సీ
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.osmania.ac.in
  • బుందేల్‌ఖండ్‌లోని బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ.. ఫొరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీలో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.bujhansi.org
  • గుజరాత్‌లో గాంధీనగర్‌లోని గుజరాత్ ఫొరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ.. ఫొరెన్సిక్ ఫార్మసీలో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 55 శాతం మార్కులతో బీఫార్మసీ. జీప్యాట్/ గేట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంది.
    • ఇదే యూనివర్సిటీ.. ఫొరెన్సిక్ నానో టెక్నాలజీలో ఎంఎస్సీ అందిస్తోంది.
      అర్హత:
      కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
    • ఇదే యూనివర్సిటీ.. ఫొరెన్సిక్ ఫార్మసీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ అండ్ పీహెచ్‌డీ (డ్యూయెల్ డిగ్రీ) అందిస్తోంది.
      అర్హత:
      కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ. జీప్యాట్/గేట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంది.
    • ఇదే యూనివర్సిటీ.. ఫొరెన్సిక్ నానోటెక్నాలజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ అండ్ పీహెచ్‌డీ (డ్యూయెల్ డిగ్రీ) అందిస్తోంది.
      అర్హత:
      ఏదైనా డిగ్రీ.
      వెబ్‌సైట్:  www.gfsu.edu.in
  • ధార్వాడ్‌లోని కర్ణాటక్ యూనివర్సిటీ.. క్రిమినాలజీ అండ్ ఫొరెన్సిక్ సైన్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ/లా.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. డిగ్రీలో ఫొరెన్సిక్ సైన్స్ చదివిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
    వెబ్‌సైట్:  www.kud.ac.in
అప్లైడ్ కెమిస్ట్రీ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత: కెమిస్ట్రీ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • ఇదే విశ్వవిద్యాలయం.. అప్లైడ్ కెమిస్ట్రీలో 5 ఏళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/10+2.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం.. అప్లైడ్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత: కెమిస్ట్రీ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.kakatiya.ac.in
  • కోయంబత్తూర్‌లోని అమృతా విశ్వవిద్యాపీఠం.. అప్లైడ్ కెమిస్ట్రీలో 5 ఏళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్ కోర్సు అందిస్తోంది.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.amrita.edu
  • చెన్నైలోని అన్నా యూనివర్సిటీ.. అప్లైడ్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత: కెమిస్ట్రీతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.annauniv.edu
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పీజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
  • ఎన్విరాన్‌మెంటల్ సైన్స్.. ఇందులో వాతావరణ సంరక్షణ గురించి బోధిస్తారు. కాలుష్య నివారణ, వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్, వాటర్ క్వాలిటీ, బయోటెక్నాలజీ వంటి అంశాలు ఉంటాయి.
  • వాతావరణ, పర్యావరణ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన వస్తుంది.
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.osmania.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత: లైఫ్‌సైన్స్‌స్ సబ్జెక్టులు, కెమిస్ట్రీతో బీఎస్సీ/ అగ్రికల్చర్‌లో బీఎస్సీ లేదా ఫుడ్ సెన్సైస్ అండ్ క్వాలిటీ కంట్రోల్‌తో బీఎస్సీ వొకేషనల్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత: కెమిస్ట్రీ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.svuniversity.ac.in
  • దూరవిద్య ద్వారా కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత: సైన్స్‌తో డిగ్రీ.
    వెబ్‌సైట్: www.braou.ac.in
  • ఉద్యోగావకాశాలు: ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, ఫర్టిలైజర్లు, మైనింగ్, టెక్స్‌టైల్, ఫార్మాస్యూటికల్,కెమికల్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
  • అడవులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పట్టణ ప్రణాళిక, నీటి క్రమ వినియోగం వంటి అంశాల గురించి ప్రభుత్వ లేదా ఎన్జీవోల ద్వారా పనిచేయవచ్చు.
  • ఈ రంగంలో పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. వీటిపై దృష్టిసారించవచ్చు.
న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • ఈ కోర్సు మనుషుల ఆరోగ్య విషయాలను అధ్యయనం చేయటంలో ఉపయోగపడుతుంది. ఇందులో నైపుణ్యం సాధించిన అభ్యర్థులు, రోగుల వయసు, జెండర్, వృత్తుల ఆధారంగా ఆహారపు అలవాట్లను గురించి సలహాలు ఇస్తారు.
  • హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డెయిరీ), బీవీఎస్సీ/బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) లేదా హోంసైన్స్‌లో బీఎస్సీ, అగ్రికల్చర్/హార్టీకల్చర్/సెరీకల్చర్/ ఫారెస్ట్రీతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.angrau.ac.in
  • ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డెయిరీ), బీవీఎస్సీ/బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) లేదా హోంసైన్స్‌లో బీఎస్సీ, అగ్రికల్చర్/హార్టీకల్చర్/సెరీకల్చర్/ ఫారెస్ట్రీతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.pjtsau.ac.in
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ కోర్సును (బీఎస్సీ) అందిస్తున్నాయి.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    వెబ్‌సైట్: www.osmania.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: ఏదైనా ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లతో హోంసైన్స్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.sssihl.edu.in
ఉద్యోగావకాశాలు: ఈ కోర్సు పూర్తయ్యాక ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ, ప్యాకేజింగ్, ఫిషరీస్, బేబీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ పరిశ్రమల్లో, హాస్పిటళ్లలో ఉద్యోగాలు పొందవచ్చు. ఆర్ అండ్ డీ విభాగాల్లో పనిచేసే వారికి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఆంత్రోపాలజీలో పీజీని అందిస్తున్న కాలేజీల వివరాలు తెలపండి?
+
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఆంత్రోపాలజీలో పీజీని అందిస్తోంది.
    అర్హత: బీఎస్సీ/జువాలజీ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం.. ఆంత్రోపాలజీలో పీజీని అందిస్తోంది.
    అర్హత: జువాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ఇదే యూనివర్సిటీ బయలాజికల్ ఆంత్రోపాలజీలో పీజీ అందిస్తోంది.
    అర్హత: సోషల్ ఆంత్రోపాలజీలో బీఏ.
  • సోషల్ ఆంత్రోపాలజీలో పీజీ అందిస్తోంది.
    అర్హత: ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.svuniversity.ac.in
  • చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్.. ఆంత్రోపాలజీలో పీజీ అందిస్తోంది.
    అర్హత: ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.unom.ac.in  
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్‌ను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. ఒకేడాది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
    అర్హత: కనీసం 40 శాతం మార్కులతో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో డిగ్రీ లేదా లైబ్రరీ సైన్స్‌లో పీజీ డిప్లొమా.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.osmania.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
    అర్హత: బీఏ/బీకాం/బీఎస్సీ/బీఏఎల్/బీబీఎం/బీసీఏ/ బీఏ(ఓఎల్).
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
    అర్హత: డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.svuniversity.ac.in
  • వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం.. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
    అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.kakatiya.ac.in

    ఈ కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్న యూనివర్సిటీలు:
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో ఉన్న డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
    అర్హత: డిగ్రీ.
    వెబ్‌సైట్:  www.svudde.in
  • గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
    అర్హత: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో డిగ్రీ.
    వెబ్‌సైట్:  www.anucde.info
అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలపండి?
+
  • రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: జామ్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.iitr.ac.in
  • ఇదే కోర్సును గువాహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా అందిస్తోంది.
    అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: జామ్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.iitg.ac.in
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.osmania.ac.in
  • హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.uohyd.ac.in
ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్ వివరాలు తెలపండి?
+
Which Institutes offers Family Resource Management in India
ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌ను ఒక కోర్సుగా అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు.. ఈ కోర్సును హోం సైన్స్‌లో భాగంగా బోధిస్తున్నాయి.

కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. వివిధ స్పెషలైజేషన్లతో హోంసైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
స్పెషలైజేషన్లు: న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్, అపెరల్ అండ్ టెక్స్‌టైల్స్,చైల్డ్ గెడైన్స్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్.
అర్హత: బీహెచ్‌ఎస్సీ/హోంసైన్స్‌లో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.pjtsau.ac.in

హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. వివిధ స్పెషలైజేషన్లతో హోంసైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
స్పెషలైజేషన్లు: న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్, అపెరల్ అండ్ టెక్స్‌టైల్స్,చైల్డ్ గెడైన్స్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్.
అర్హత: బీహెచ్‌ఎస్సీ/హోం సైన్స్‌లో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.angrau.ac.in

ముంబైలోని శ్రీమతి నతిబాయ్ దామోదర్ థాకర్సే యూనివర్సిటీ.. ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్సీని అందిస్తోంది. ఇందులో ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్ ఉంది.
అర్హత: ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో బీఎస్సీ లేదా ఎఫ్‌ఆర్‌ఎంలో హోంసైన్స్ డిగ్రీ. ఇతర స్పెషలైజేషన్లకు చెందిన అభ్యర్థులూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.sndt.digitaluniversity.ac

అలహాబాద్‌లోని శామ్ హిగ్గిన్‌బాటమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్.. ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
అర్హత: బీఎస్సీ హోం ఎకనామిక్స్/బీఎస్సీ హోం సైన్స్ లేదా తత్సమానం.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.shiats.edu.in
ఆర్కియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి.
+
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీల్లో ఎంఏను అందిస్తోంది.
    అర్హత: హిస్టరీతో బీఏ లేదా హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్టుగా బీఏ/బీఎఫ్‌ఏ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. ఏన్షియంట్ హిస్టరీ, కల్చర్, ఆర్కియాలజీ స్పెషలైజేషన్‌తో ఎంఏ హిస్టరీని అందిస్తోంది.
    అర్హత: హిస్టరీ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.svuniversity.ac.in
  • గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీలో ఎంఏను అందిస్తోంది.
    అర్హత: హిస్టరీ సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
  • ఉద్యోగావకాశాలు: ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత మ్యూజియంలు,ఆర్ట్ గ్యాలరీల్లో పనిచేయవచ్చు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి భారతీయ సంస్థల్లో పనిచేయవచ్చు. టూరిజం, హాస్పిటాలిటీ వంటి విభాగాల్లో ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
ఫొరెన్సిక్ సైన్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • ఫొరెన్సిక్ సైన్స్.. నేర పరిశోధనలకు ఈ కోర్సు చాలా కీలకమైంది.
  • ఈ కోర్సును అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా స్థాయిల్లో వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి.
  • ఇందులో నిపుణత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ లేబొరేటరీలు, సంస్థలు, ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫొరెన్సిక్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.osmania.ac.in
  • గుజరాత్ గాంధీనగర్‌లోని గుజరాత్ ఫొరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ.. ఫొరెన్సిక్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సైన్స్/మెడిసిన్/ ఇంజనీరింగ్/ ఫార్మసీలలో బ్యాచిలర్ డిగ్రీ.
  • ఫొరెన్సిక్ ఫార్మసీ, ఫొరెన్సిక్ నానోటెక్నాలజీలలో ఎంఎస్‌ను అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ.
    వెబ్‌సైట్: www.gfsu.edu.in
ఎంకాం కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. మార్కెటింగ్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ స్పెషలైజేషన్లతో ఎంకాం డిగ్రీని అందిస్తోంది.
    అర్హత:
    బీకాం.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.osmania.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఎంకాంను అందిస్తోంది.
    అర్హత:
    బీకాం
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. ఎంకాంను అందిస్తోంది.
    అర్హత:
    బీకాం
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.nagarjunauniversity.ac.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. ఎంకాంను అందిస్తోంది.
    అర్హత:
    బీకాం
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.svuniversity.ac.in
  • అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. ఎంకాం డిగ్రీని అందిస్తోంది.
    అర్హత:
    బీకాం
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.skuniversity.org
ఎంఏ ఎకనామిక్స్‌ను అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
  • ఆర్థిక విషయాల అధ్యయనమే ఎకనామిక్స్. ఇందులో మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్, పబ్లిక్ ఫైనాన్స్, ఎకనామిక్ పాలసీ మేకింగ్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఎకనామిక్ అనలిస్ట్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ఆర్థిక రంగంలో పరిశోధనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులకు, ప్రభుత్వ, ప్రైవేటు, మల్టీ నేషనల్ సంస్థల్లో పనిచేసేందుకు అవకాశాలు మెరుగయ్యాయి.
  • ఎంఏ ఎకనామిక్స్ కోర్సు పూర్తిచేశాక ఫైనాన్షియల్ రీసెర్చ్, ఎకనామిక్ జర్నలిజం, సేల్స్ అండ్ మార్కెటింగ్, బిజినెస్ అనాలిసిస్, ఇన్సూరెన్స్ అండ్ యాక్చూరియల్ సైన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, మార్కెట్ రీసెర్చ్, గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్ వంటి వాటిలో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
  • ఈ రంగంలో విజయం సాధించాలంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్‌గా, విశ్లేషణాత్మకంగా ఆలోచించే నేర్పు ఉండాలి. ఆశావహ దృక్పథం ఉండాలి.

కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎంఏ ఎకనామిక్స్‌తోపాటు అప్లైడ్ ఎకనామిక్స్‌లో ఎంఏను అందిస్తోంది.
    అర్హత:
    ఎకనామిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం ఎంఏ ఎకనామిక్స్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఎకనామిక్స్‌లో బీఏ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.svuniversity.ac.in
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.osmania.ac.in
  • వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఎంఏ ఎకనామిక్స్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఎకనామిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.kakatiya.ac.in
  • అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎంఏ ఎకనామిక్స్ కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.skuniversity.org
  • కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ఎంఏ ఎకనామిక్స్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఎకనామిక్స్‌తో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.yogivemanauniversity.ac.in
పీజీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
  • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఈసీఈ/ఈఈఈ/ఈఐఈ/ఐసీఈలలో బీఈ/ బీటెక్ లేదా ఏఎంఐఈ/ఏఎంఐఈటీఈ
    ప్రవేశం: గేట్‌లో ర్యాంకు ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.jntuh.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం..ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంఎస్సీ(టెక్)ను అందిస్తోంది.
    అర్హత:
    ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీ.. ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఈఈఈ/ఈసీఈ/ఈఐఈ/ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ /ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్/ బయోమెడికల్ ఇంజనీరింగ్‌లలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ లేదా ఏఎంఐఈటీఈ
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.svuniversity.ac.in

ఉద్యోగావకాశాలు:
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలీకమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. భారతీయ రైల్వే, ఇస్రో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, డిఫెన్స్ సర్వీసు వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు మంచి కెరీర్ ఉంటుంది.
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ.. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: ఏదైనా డిగ్రీ
    ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా
    వెబ్‌సైట్: www.osmania.ac.in

  • విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ.. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా రెండు లైఫ్ సెన్సైస్ రెండు సబ్జెక్టులతో బీఎస్సీ/బీఈఎం, బీఎస్సీ(అగ్రికల్చర్) లేదా ఫుడ్ సెన్సైస్ అండ్ క్వాలిటీ కంట్రోల్‌తో బీఎస్సీ (వొకేషనల్)
    ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

  • తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరా యూనివర్సిటీ.. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ
    ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా
    వెబ్‌సైట్: www.svuniversity.ac.in

  • హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య విధానంలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: ఏదైనా సైన్స్‌లో డిగ్రీ.
    వెబ్‌సైట్: www.braou.ac.in   
ఫారెస్ట్రీలో ఎంఎస్సీని అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. ఫారెస్ట్రీలో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీల్లో ఏదైనా ఒక సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.icfre.org

  • తమిళనాడులో తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. ఫారెస్ట్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, ట్రీ బ్రీడింగ్ అండ్ బయోటెక్నాలజీ, సిల్వీకల్చర్ అండ్ ఆగ్రో ఫారెస్ట్రీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ వంటి వినూత్న స్పెషలైజేషన్లతో ఫారెస్ట్రీలో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: ఫారెస్ట్రీలో బీఎస్సీ లేదా తత్సమానం
    ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.tnau.ac.in

  • భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్.. ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాను అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ.
    ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ పరీక్షలో ర్యాంకు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
    వెబ్‌సైట్: www.iifm.ac.in

  • నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ.. నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ర్యాంకు, పర్సనల్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.amity.edu

ఉద్యోగావకాశాలు:
ట్రైనింగ్ ఆర్గనైజర్లు, అసోసియేట్‌లు, అసిస్టెంట్‌లుగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. అనేక రాష్ట్ర సర్వీసు కమిషన్‌లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సాధించవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత ద్వారా ఐఎఫ్‌ఎస్‌కు అర్హత లభిస్తుంది. ఆర్ అండ్ డీ విభాగాల్లో సైంటిస్ట్‌గా కెరీర్‌ను మలచుకోవచ్చు.
ఫొరెన్సిక్ సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
ఈ కోర్సు అధ్యయనం ద్వారా నేర పరిశోధనలు నిర్వహించే అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ కోర్సును డిగ్రీ, పీజీ, డిప్లొమా స్థాయిల్లో పలు ఇన్‌స్టిట్యూట్‌లు/ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఇందులో నిపుణత సాధిస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పరిశోధనాత్మక ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ.. ఫొరెన్సిక్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఏదైనా బీఎస్సీ.
    ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా.
    వెబ్‌సైట్: www.osmania.ac.in

  • ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ..ఫొరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీలో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.bujhansi.org

  • గుజరాత్‌లో గాంధీనగర్‌లోని గుజరాత్ ఫొరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ.. ఫొరెన్సిక్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది. ఈ యూనివర్సిటీ ఫొరెన్సిక్ విభాగంలో ఎంఎస్సీ, డిప్లొమా స్థాయి ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది.
    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ
    ప్రవేశం: అకడమిక్‌లో ప్రతిభ ఆధారంగా.
    వెబ్‌సైట్: www.gfsu.edu.in

  • కర్ణాటకలోని కర్ణాటక యూనివర్సిటీ.. క్రిమినాలజీ అండ్ ఫొరెన్సిక్ సైన్స్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
    అర్హత: కనీసం 45 శాతం మార్కులతో సోషియాలజీ, లాలో డిగ్రీ. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో క్రిమినాలజీ అండ్ ఫొరెన్సిక్ సైన్స్ చదివినవారికి ప్రాధాన్యత ఉంటుంది.
    ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.kud.ac.in
పీజీ స్థాయిలో జియాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. జియాలజీ,అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

  • తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత: జియాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.svuniversity.ac.in

  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత: కనీసం 40 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. జియాలజీలో పీహెచ్‌డీని అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో జియాలజీలో ఎంఎస్సీ
    ప్రవేశం: పీహెచ్‌డీ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.osmania.ac.in

ఉద్యోగావకాశాలు:
ఈ కోర్సు పూర్తిచేశాక యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ జియోసైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్‌ల పరీక్షలో ఉత్తీర్ణులవడం ద్వారా కేంద్రప్రభుత్వ కొలువును పొందవచ్చు. మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఎక్స్‌ట్రాక్షన్ చేసేటువంటి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
మ్యాథమెటిక్స్‌లో ఒక బ్రాంచ్ స్టాటిస్టిక్స్. ఈ సబ్జెక్టుఅధ్యయనం ద్వారా న్యూమరికల్ డేటాను సేకరించడం, దాన్ని క్రమపద్ధతిలో విశ్లేషించడం వంటి అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. సాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్‌ల్లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.osmania.ac.in

  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీని ఆఫర్ చేస్తోంది.
    అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

  • తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం.. స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లలో ఎంఎస్సీని ఆఫర్ చేస్తోంది.
    అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.svuniversity.ac.in

  • కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్.. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ ప్రోగ్రాం అందిస్తోంది. ఇందులో అడ్వాన్స్‌డ్ ప్రాబబిలిటి, యాక్చూరియల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటి, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ లాంటి స్పెషలైజేషన్లు ఉంటాయి.
    అర్హత: స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా ఐఎస్‌ఐ నుంచి బీమ్యాథ్ డిగ్రీ లేదా ఐఎస్‌ఐ నుంచి స్టాటిస్టికల్ మెథడ్స్ విత్ అప్లికేషన్స్/స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా.
    ప్రవేశం: అకడమిక్ రికార్డు, రాతపరీక్ష, ఓరల్ అడ్మిషన్ టెస్ట్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.isical.ac.in  

ఉద్యోగావకాశాలు:
స్టాటిస్టిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ అనలిస్ట్, స్టాటిస్టికల్ ఇన్‌స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ లాంటివి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటాయి. ప్రైవేటు రంగంలో మార్కెటింగ్ సంస్థలు, ఆర్ అండ్ డీ డిపార్ట్‌మెంట్‌లో, విద్యాసంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
ఎంఏ తెలుగు కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్న యూనివర్సిటీల వివరాలు తెలపండి?
+
  • విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు కోర్సును అందిస్తోంది.
    అర్హత: తెలుగు ఒక సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీ
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు కోర్సును అందిస్తోంది.
    అర్హత: తెలుగు సబ్జెక్టుతో డిగ్రీ.
    వెబ్‌సైట్: www.svudde.in
  • హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు కోర్సును అందిస్తోంది.
    అర్హత: బ్యాచలర్ డిగ్రీ కోర్సులో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
    వెబ్‌సైట్: www.oucde.ac.in  
న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ నిపుణులు మనుషుల వయసు, జెండర్, వారు చేసే వృత్తి ఆధారంగా ఎటువంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తారు.

ఈ కోర్సును అందించే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు:
  • అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్.. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లతో మాస్టర్స్ డిగ్రీని అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.sssihl.edu.in

  • హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం.. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ డెయిరీలో కనీసం 50 శాతం మార్కులతో బీటెక్/బీవీఎస్సీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్/ హోంసైన్స్‌లో బీఎస్సీ లేదా అగ్రికల్చర్/సెరీకల్చర్/హార్టీకల్చర్/ ఫారెస్ట్రీలలో బీఎస్సీ/బీఎఫ్‌ఎస్సీ
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.angrau.ac.in

  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా గుర్తింపు పొందిన కళాశాలలు న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్‌లో బీఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2

  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    డిగ్రీ
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.osmania.ac.in

  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in

ఉద్యోగావకాశాలు: ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ, ప్యాకేజింగ్, ఫిషరీస్, బేబీ ఫుడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆసుపత్రులు, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ లాంటి వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
యాక్చూరియల్ సైన్స్‌లో ఉద్యోగావకాశాల గురించి వివరించండి?
+
  • హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్.. లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, జనరల్ ఇన్సూరెన్స్‌లో ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా,రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, యాక్చూరియల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలను అందిస్తోంది.
    అర్హతలు: డిగ్రీ/ఎంబీఏ/సీఏ/సీఎస్/ఐసీడబ్ల్యూఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారు అర్హులు.
    వెబ్‌సైట్: www.iirmworld.org.in

  • చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ యాక్చూరియల్ సైన్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత: మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ.
    వెబ్‌సైట్: www.unom.ac.in

  • హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్‌డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.ipeindia.org

  • నోయిడాలోని అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్చూరియల్ సైన్స్.. ఇన్సూరెన్స్‌లో ఎంబీఏను అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ
    ప్రవేశం: మ్యాట్/ క్యాట్/ జీమ్యాట్/ అమిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌లో, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
    వెబ్‌సైట్: www.amity.edu

ఉద్యోగావకాశాలు: ఇన్సూరెన్స్ కంపెనీల్లో, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో, బ్యాంకులు, బిజినెస్ కన్సల్టెన్సీల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.
మెడికల్ బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ కోర్సు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
మెడికల్ బయోకెమిస్ట్రీ.. పెరుగుదల, జీర్ణక్రియ, వంశపారంపర్యం, ప్రత్యుత్పత్తి వంటి అంశాల వెనకున్న రసాయన చర్యలను హేతుబద్ధంగా వివరిస్తుంది. మెడిసిన్, డయగ్నోసిస్, పంటల దిగుబడి పెంచేందుకు, కాస్మెటిక్స్, ఫొరెన్సిక్ సైన్స్‌లలో మెడికల్ బయోకెమిస్ట్రీ ఉపయోగపడుతుంది. ఈ కోర్సు చదివిన వారికి హాస్పిటల్స్, డయగ్నోస్టిక్, బయోటెక్నాలజీ సెంటర్స్‌లలో అవకాశాలు ఉంటాయి.

ఈ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు:
  • పుదుచ్చేరిలోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. మెడికల్ బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత: బయోకెమిస్ట్రీ/ కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా బోటనీ, జువాలజీలతో బీఎస్సీ లేదా 55 శాతం మా ర్కులతో మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీలో బీఎస్సీ.
    వెబ్‌సైట్:  www.mgmcri.ac.in
  • పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. మెడికల్ బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.jipmer.edu
పీజీ (రోబోటిక్స్) కోర్సు వివరాలను తెలపండి?
+
రోబోటిక్స్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సాఫ్ట్‌వేర్ బ్రాంచ్‌లకు సంబంధించిన ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్. రోబోటిక్స్‌లో ఎంఈ/ఎంటెక్ చేయాలనుకునే వారు బీటెక్ (మెకానికల్)/అనుబంధ బ్రాంచ్‌లతో పూర్తి చేయాల్సి ఉంటుంది. రోబోటిక్స్ పూర్తిచేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మైనింగ్, టూల్ డిజైన్, ఏవియేషన్, ఆటోమొబైల్ వంటి రంగాలు కెరీర్ అవెన్యూస్‌గా ఉంటాయి.

ఎంఈ/ఎంటెక్ (రోబోటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
    కోర్సు:
    ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీఅండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
    అడ్మిషన్: గేట్ స్కోర్ ఆధారంగా.
    వివరాలకు:  www.uohyd.ac.in
  • యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్- ఉస్మానియా యూనివర్సిటీ
    కోర్సు:
    ఎంఈ(ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్)
    అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా
    వివరాలకు:  www.uceou.edu
  • ఆంధ్రా యూనివ ర్సిటీ-విశాఖపట్నం
    కోర్సు:
    కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ స్పెషలైజేషన్‌గా
    అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా
    వివరాలకు:  www.andhrauniversity.edu.in
అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఏయే కోర్సులను అందిస్తోంది. వాటి ప్రవేశ వివరాలు తెలియజేయండి?
+
కర్ణాటకలో మొదటి స్వయం ప్రతిపత్తి యూనివర్సిటీ అజీం ప్రేమ్ యూనివర్సిటీ. ఈ సంస్థ అందిస్తోన్న కోర్సుల వివరాలు.
  • మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్: కరిక్యులమ్ అండ్ పెడగాజీ, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, స్కూల్ లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజేషన్ చేయవచ్చు. ఇది రెండేళ్ల కోర్సు.
    అర్హత: ఏదైనా డిగ్రీ.
  • మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ డెవలప్‌మెంట్: ఇది రెండేళ్ల ఫుల్‌టైమ్ కోర్సు.
    అర్హత: ఏదైనా డిగ్రీ.
    ఈ రెంటికీ ప్రవేశ పరీక్షతో పాటు ఇంటర్వ్యూలో కనబరిచిన ఆధారంగా సీటు లభిస్తుంది. కోర్సు పూర్తి చేసినవారికి విద్యాసంస్థల్లో, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లో, ఎన్‌జీఓ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.
వెబ్‌సైట్: azimpremjiuniversity.edu.in
పెట్రోలియం ఇంజనీరింగ్ అనుబంధ పీజీ కోర్సుల వివరాలు తెలపండి?
+
పెట్రోలియం ఇంజనీరింగ్‌లో ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది. ఈ కోర్సును పూర్తిచేస్తే చమురు, సహజ వాయువు పరిశ్రమలో ఉజ్వల కెరీర్ ఉంటుంది.
  • యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
    అర్హతలు:
    టెన్త్, ఇంటర్, బీటెక్/బీఈ-పెట్రోలియం/జియోసైన్స్/జియో ఇన్ఫర్మేటిక్స్/ మెకానికల్/కెమికల్/ ఎమ్మెస్సీ- జియాలజీ/ఎమ్మెస్సీ-జియో ఫిజిక్స్‌లో 60 శాతం ఉత్తీర్ణత.
    ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
    వెబ్‌సైట్:  www.upes.ac.in
  • పండింట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ- గుజరాత్ పెట్రోలియం ఇంజనీరింగ్‌లో ఎంటెక్ ప్రోగ్రామ్‌ని అందిస్తోంది.
    అర్హతలు:
    పెట్రోలియం/ మెకానికల్/కెమికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్‌లో బీటెక్.
    అభ్యర్థులకు ఆయా కోర్సుల అనుబంధ వృత్తుల్లో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
    వెబ్‌సైట్:  www.pdpu.ac.in
బయోటెక్నాలజీకి సంబంధించి అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్స్ ఏవి?
+
బయోటెక్నాలజీకి సంబంధించి పలు రకాల స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి..
  • ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ: దీన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. పెయింట్లు, కెమికల్, డిటర్జెంట్‌లు, టెక్స్‌టైల్స్ వంటి ఉత్పత్తుల్లో ఇది తోడ్పడుతుంది.
  • మెడికల్ బయోటెక్నాలజీ: ఫార్మాస్యూటికల్, డయోగ్నోసిస్ ప్రొడక్ట్‌ల తయారీకి సంబంధించిన పరిశోధనల్లో మెడికల్ బయోటెక్నాలజీని ఉపయోగిస్తారు.
  • ఫుడ్ బయోటెక్నాలజీ: ఆహార ఉత్పత్తుల పెంపు, నాణ్యతను మెరుగుపరిచే సాంకేతికతలోఫుడ్ బయోటెక్నాలజీ తోడ్పడుతుంది.
  • బయోఇన్ఫర్మాటిక్స్: వివిధ పరిశోధనల ద్వారా లభించిన సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా నిక్షిప్తం చేయడానికి బయోఇన్ఫర్మాటిక్స్ ఉపయోగపడుతుంది.
  • ఎంబీఏ (బయోటెక్నాలజీ): బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రూపొందించిన స్పెషలైజేషన్ ఎంబీఏ (బయోటెక్నాలజీ).

ఆయా స్పెలైజేషన్స్‌ను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఐఐఐటీ-హైదరాబాద్ (వెబ్‌సైట్: https://biotech.iith.ac.in), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ-ముంబై (వెబ్‌సైట్: www.ictmumbai.edu.in ), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.uohyd.ernet.in), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్ (వెబ్‌సైట్:
బీఎస్సీ పూర్తి చేశాను. ఎంఎస్సీ(బయోటెక్నాలజీ), ఎంబీఏల్లో దేన్ని ఎంచుకోవాలి? అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
ఎంబీఏ, ఎంఎస్సీ (బయోటెక్నాలజీ)ల్లో.. మీ సామర్థ్యం, అభిరుచి, స్వభావం దేనికి దగ్గరగా ఉంటే ఆ కోర్సును ఎంపిక చేసుకోవడం మంచిది. సైన్స్‌పై ఆసక్తి ఉండి, ప్రాథమిక విషయాల పట్ల అవగాహన, పరిశోధనాలపై అభిరుచి ఉంటే ఎంఎస్సీని ఎంపిక చేసుకోవచ్చు. వ్యాపారం నిర్వహించగల సామర్థ్యం, సంబంధిత విషయాల పట్ల అవగాహన ఉంటే ఎంబీఏను ఎంచుకోవచ్చు. చాలా కంపెనీలు సీనియర్‌ లెవల్‌ మేనేజీరియల్‌ పోస్ట్‌కు ఎంబీఏ చేసిన అభ్యర్థులను నియమిస్తు న్నాయి. ఎంఎస్సీ తర్వాత చేరిన ఉద్యోగానికి సంబంధించి అవసరమనుకుంటే అప్పుడు ఎంబీఏ చేయవచ్చు. ఉద్యోగానికి ఎటువంటి అటంకం కలగకుండా దూర విద్యావిధానంలో ఎంబీఏను పూర్తి చేయవచ్చు. బయోటెక్నాలజీ స్పెషలైజేషన్‌తో కొన్ని సంస్థలు ఎంబీఏను ఆఫర్‌ చేస్తున్నాయి.
ఎంఎస్సీ బయోటెక్నాలజీ: కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ. రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తారు. మరిన్ని వివరాలకు www.osmania.ac.in చూడొచ్చు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆఫర్‌ చేసే బయోకెమిస్ట్రీ కోసం 60 శాతం మార్కులతో బీఎస్సీ (కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీలు ఒక సబ్జెక్టుగా చదవాలి). రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. బయోటెక్నాలజీలో మాత్రం జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (ఢిల్లీ) నిర్వహించే కంబైన్డ్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్‌: www.uohyd.ernet.in
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, డెరైక్టర్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకే షన్‌ (తిరుపతి) ఎంఎస్సీ (బయోటెక్నాలజీ)ని దూర్య విద్యా విధానంలో అందిస్త్తోంది. వెబ్‌సైట్‌: www.svudde.org
మన రాష్ట్రంలో ఎంబీఏ చేయాలంటే ఐసెట్‌ రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అన్ని ప్రధాన వర్సిటీలు దూరవిద్యా విధానంలో ఎంబీఏను ఆఫర్‌ చేస్తున్నాయి.
అమిటీ ఇన్‌స్టిట్యూట్‌ బయోటెక్నాలజీ (ఢిల్లీ) ఎంబీఏ (బయోటెక్నాలజీ)ని అందిస్తుంది. అర్హత: 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ (బయోలాజికల్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌) లేదా తత్సమానం. ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే రాత పరీక్ష లేదా క్యాట్‌/మ్యాట్‌/జీమ్యాట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. మరి న్ని వివరాలకు www.amity.edu చూడొచ్చు.
జియో ఇన్ఫర్మాటిక్స్‌ రంగంలో ఉండే ఉపాధి అవకాశాలను తెలుపగలరు? పీజీ డిప్లొమా ఇన్‌ జియోఇన్ఫర్మేటిక్స్‌ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
+
సి-డాక్‌ (పుణే): పీజీ డిప్లొమా ఇన్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌. అర్హత: పీజీ ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత రెండేళ్ల పని అనుభం. ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా అడ్మి షన్‌ లభిస్తుంది. వివరాలకు వెబ్‌సైట్‌: www.cdac.in
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (డెహ్రా డూన్‌): వెబ్‌సైట్‌: www.iirsnrsc.gov.in
వెస్ట్‌ బెంగాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (కోల్‌కత). వివరాలకు వెబ్‌సైట్‌: www.wbut.ac.in
వీటితోపాటు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌, ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇస్రో (బెంగళూరు)లలో కూడా జియో ఇన్ఫర్మాటిక్స్‌లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఉపాధి పరంగా.. ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌ సైంటిస్ట్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌, రీసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ కోఆర్డి నేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, రీసెర్చ్‌ స్కాలర్‌ వంటి అవకా శాలు లభిస్తాయి. బోధన విభాగంలో రీడర్స్‌, ప్రొఫెసర్స్‌ గానూ స్థిరపడవచ్చు. ప్రై వేట్‌ రంగంలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ఇమేజ్‌ అనలిస్ట్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌, జీఐఎస్‌ ప్రోగ్రామర్‌,  ఇంజనీర్‌ హోదాలు లభిస్తాయి. స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఆశించిన విధంగానే ఉంటాయి.
బీఎస్సీ (బయోటెక్నాలజీ) తర్వాత ఉన్నత విద్య అవకాశాలను వివరించండి?
+
బీఎస్సీ బయోటెక్నాలజీ తర్వాత ఎంఎస్సీ- బయోటెక్నా లజీ కోర్సును ఎంచుకోవచ్చు. మాస్టర్‌ డిగ్రీ తర్వాత కూడా చాలా అవకాశాలున్నాయి. టెక్నికల్‌ పరంగా సంబంధిత అం శంలో ఎంటెక్‌ చేయవచ్చు. ఆసక్తి ఉంటే పరిశోధనల వైపు కూడా దష్టి సారించవచ్చు. అంతేకాకుండా ఇటీవల ప్రాచు ర్యం పొందుతున్న మరో విభాగం ఎంబీఏ- బయోటెక్నా లజీ.
మన రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ(www.osmania.ac.in), ఆంధ్రా వర్సిటీ (www.andhrauniversity.info), శ్రీ వేంకటేశ్వర వర్సిటీ (www.svuniversity.in) ఎంఎస్సీ- బయోటెక్నాలజీని ఆఫర్‌ చేస్తున్నాయి. ఎంటెక్‌ (బయోటెక్నా లజీ/బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌)ను ఆంధ్రా వర్సిటీ, హైద రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఐఐ టీలు ఆఫర్‌ చేసే బయోటెక్నాలజీలో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌) స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. దేశంలోని కేంద్రీయ విశ్వ విద్యాలయూలు, ఇతర ప్రముఖ యూనివర్సిటీల్లో జారుుంట్‌ అడ్మిషన్‌ టు ఎంఎస్సీ (జామ్‌) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిర్వహించే ఆల్‌ ఇండి  యూ బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా దేశంలోని దాదాపు 32 యూనివర్సిటీలు ఎంఎస్సీలో ప్రవేశం కల్పిస్తు న్నారుు. బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేయాలంటే గేట్‌ స్కోరు లేదా యూజీసీ-జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ లేదా సీఎస్‌ఐఆర్‌ ఫెలోషిప్‌పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. బయోటెక్‌ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం కావా ల్సిన కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు, మార్కెటింగ్‌ మేనేజర్ల అవ సరం పెరుగుతోంది. దీనిని గుర్తించిన కొన్ని విద్యా సంస్థలు ఎంబీఏ(బయోటెక్నాలజీ) కోర్సుకు రూపకల్పన చేశారుు. ప్రస్తుతం ఎన్‌ఎంఐఎంఎస్‌ యూనివర్సిటీ, పుణే యూని వర్సిటీలు మాత్రమే ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి.
మైక్రోబయాలజీ, కెమిస్ట్రీలలో ఏ కోర్సుకు అవకాశాలుంటాయి?
+
మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ రెండిటిలోను మంచి అవకాశా లుంటాయి. అయితే మైక్రోబయాలజీ అనేది స్పెషలైజ్డ్‌ కోర్సు కావడంతో కెమిస్ట్రీతో పోల్చితే ఈ కోర్సు చేసిన వారికి ఉద్యో గావకాశాలు ఎక్కువేనని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తం గా ప్రాచుర్యం పొందుతున్న రంగాల్లో మైక్రోబయాలజీ ఒకటి. సూక్ష్మజీవులకు సంబంధించిన అధ్యయనమే మైక్రోబయా లజీ. మైక్రోబయాలజిస్ట్‌లు వ్యాధులు, వాటి కారణాలు, నివారణకు ఉపయోగించే ఔషధాలు వంటి అంశాలపై తమ పరిశోధనలు సాగిస్తుంటారు. మైక్రోబయాలజీ.. సబ్జెక్ట్‌కు సం బంధించిన అంశాల్లో చక్కటి అవగాహనను పెంచుకోవడానికి దోహదం చేస్తోంది. దీనిలో పీజీ చేసిన తర్వాత మీకిష్టమైన అంశంలో షార్ట్‌టర్మ్‌ కోర్సు చేయవచ్చు లేదా అందుకు సంబం ధించిన శిక్షణను తీసుకోవచ్చు. పరిశోధన రంగంలోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ కోర్సు చేసిన వారికి వివిధ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, రీసెర్చ్‌ లేబొరేటరీల్లో అవకాశాలుంటాయి. కెమిస్ట్రీ విషయానికొస్తే.. ఇది ఒక సాంప్రదాయ కోర్సు. ఇందులో అవ కాశాలు కొంత పరిమితం అని చెప్పొచ్చు. అయితే ఈ అంశం లో మాస్టర్‌/ పీహెచ్‌డీ చేసిన వారికి ఫార్మసీ కంపెనీలు, లేబొ రేటరీల్లో విరివిగా అవకాశాలుంటాయి. అంతేకాకుండా విద్యా సంస్థల్లో లెక్చరర్‌గా పని చేసే అవకాశం కూడా ఉంటుంది. మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు మాస్టర్‌/ పీహెచ్‌డీ స్థాయిల్లో కెమిస్ట్రీని అందిస్తున్నాయి. ఆయా వర్సిటీ లు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ ఉంటుంది.
పీజీ స్థాయిలో అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌ను అందిస్తోన్న యూనివర్సిటీలను తెలపండి?
+
ఐఐటీ-రూర్కీ ఎంఎస్సీ (అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌)ను అందిస్తోంది. ఐఐటీ జామ్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.iitr.ac.in
బిట్స్‌-మెస్రా క్యాంపస్‌ ఎంఎస్సీ(అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌)ను ఆఫర్‌ చేస్తోంది. అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ)లేదా తత్సమానం. పదో తరగతి,ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మార్కులాధా రంగా అడ్మిషన్‌ ఉంటుంది.
వెబ్‌సైట్‌: https://bitmesra.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ. బీఎస్సీ (మ్యాథ్స్‌) ఉత్తీర్ణులు అర్హులు.
వెబ్‌సైట్‌: www.osmania.ac.in
ఆంధ్రాయూనివర్సిటీ, బీఎస్సీ(మ్యాథ్స్‌) చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్‌: www.andhrauniversity.info
దూర విద్యావిధానంలో ఆఫర్‌చేస్తోన్న వర్సి టీలు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. వెబ్‌సైట్‌: www.anucde.com
బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ. 40 శాతం మార్కులతో బీఎస్సీ (మ్యాథ్స్‌)
వెబ్‌సైట్‌: www.braou.ac.in
పీజీ స్థాయిలో నానో టెక్నాలజీ కోర్సును ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీలేవి?
+

పరిశోధనల పరంగా విస్తత పరిధి ఉన్న రంగం నానో టెక్నా లజీ. అణువు, పరమాణువుల సమ్మేళనమే నానో టెక్నాలజీ. దీని అనువర్తనాలను మెడిసిన్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫార్మాస్యుటికల్‌ ఇండస్ట్రీలు, టెక్స్‌టైల్‌ పరిశ్రమల్లో వినియోగిస్తారు. ఇందులో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్‌ అంశాలు ఉంటాయి.
నానోటెక్నాలజీకి సంబంధించి దశాబ్ద కాలంగా విస్తత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భారత ప్రభుత్వం పరిశోధనలకు పెద్ద పీట వేస్తుండడంతో పాటు భారీగా నిధులను కేటాయిస్తోంది. దీంతో ఈ కోర్సు చేసిన వారికి అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు.

పీజీ స్థాయిలో నానో టెక్నాలజీ ఆఫర్‌ చేస్తున్న వ ర్సిటీలు:
 జేఎన్‌టీయూ-హైదరాబాద్‌.
 కోర్సు-ఎంటెక్‌ (నానోటెక్నాలజీ)
 ఎంపిక: గేట్‌/వర్సిటీ నిర్వహించే ఎంట్రెన్స్‌ ఆధారంగా
 వివరాలకు: https://jntu.ac.ac.in
 శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ (డీమ్డ్‌ యూనివర్సిటీ) -పుట్టపర్తి
 కోర్సు: ఎంఎస్సీ(నానోసైన్స్‌)
 ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
 వివరాలకు: www.ssu.edu.in
 వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -తమిళనాడు
 కోర్సు-ఎంటెక్‌(నానోటెక్నాలజీ)
 ఎంపిక: వర్సిటీ నిర్వహించే ఎంట్రెన్స్‌ ఆధారంగా. గేట్‌ అభ్యర్థులకు ప్రాధాన్యం
 వివరాలకు: www.vit.edu
 అమిటీ యూనివర్సిటీ-నోయిడా
 కోర్సులు: ఎంఎస్సీ, ఎంటెక్‌ (నానోటెక్నాలజీ)
 వివరాలకు: www.amity.edu

ఉడ్‌, పేపర్‌కు సంబంధించిన కోర్సులను అందిస్తున్న సంస్థలేవి?
+
ఐఐటీ-రూర్కీ, ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి ప్రఖ్యాత సంస్థలు ఉడ్‌, పేపర్‌కు సంబంధించిన కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-రూర్కీ, బీటెక్‌ (పేపర్‌ అండ్‌ పల్ప్‌ ఇంజనీరింగ్‌) కోర్సును అందిస్తోంది. ఐఐటీ-జేఈఈ ర్యాంక్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వివరాలకు: www.rurkiu.ernet.in
ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌-డెహ్రాడూన్‌, పోస్ట్‌గ్రాడ్యుయే ట్‌ డిప్లొమా ఇన్‌ పేపర్‌ అండ్‌ పల్ప్‌ టెక్నాలజీ, ఎంఎస్సీ(ఉడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. అర్హత: కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌గా 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌.
వివరాలకు: https://fri.icfre.gov.in
అమిటీ స్కూల్‌ ఆఫ్‌ నేచురల్‌ రీసోర్సెస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌-నోయిడా, డిప్లొమా ఇన్‌ ఉడ్‌ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. సైన్స్‌తో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు.
వివరాలకు: www.amity.edu
ఎంఎస్సీ(ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌)కోర్సు ను డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలేవి?
+
ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ పూర్తి చేసిన వారికి వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ ఆర్గనై జేషన్స్‌లో అవకాశాలు ఎక్కువ. వీరికి ప్రధానంగా ఆటోమొబైల్స్‌, ఫుడ్‌ ప్రాసెసిం గ్‌, అగ్రికల్చర్‌, ఫెర్టిలైజర్స్‌, టెక్స్‌టైల్స్‌, మైనింగ్‌, ఫార్మాస్యుటికల్‌, కెమికల్‌ పరిశ్ర మల్లో ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటా యి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, పర్యావర ణ సంస్థలు, అర్బన్‌ ప్లానింగ్‌, వాటర్‌ కన్జ ర్వేషన్‌ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు వివిధ ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్‌, వివిధ పరిశో ధన సంస్థల్లో అవకాశాలుంటాయి.

ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సును డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు
బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ
-హైదరాబాద్‌.
వివరాలకు: www.braou.ac.in
భారతీయార్‌ యూనివర్సిటీ
-కోయంబత్తూరు
వివరాలకు: www.b-u.ac.in
కువెంపు యూనివర్సిటీ- షిమోగా.
వివరాలకు: www.kuvempuuniversitydde.org
బీఎస్సీ బయలాజికల్‌ సైన్స్‌ చదువుతున్నాను. మాస్టర్‌ స్థాయిలో ఎటువంటి కోర్సు లను ఎంచుకోవచ్చు?
+
బీఎస్సీలో చదివిన అన్ని ఆప్షనల్‌ సబ్జెక్టులతోపాటు సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ చేసే అవకాశం ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్‌ ఆఫర్‌ చేసే బయోటెక్నాలజీ/ జెనెటి క్స్‌/ మైక్రోబయాలజీ/ ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ విభాగాల్లో ఎంఎస్సీ చేయవచ్చు. యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ -విశాఖపట్నం అందిస్తున్న బయోటెక్నాలజీ/ బోటనీ/ జువాలజీ/హార్టికల్చర్‌/బయోఇన్ఫర్మాటిక్స్‌/ హ్యూమన్‌ జెనెటిక్స్‌ విభాగాల్లో ఎంఎస్సీ చేసే అవకాశం ఉంది.
వివరాలకు: www.andhrauniversity.info
రాష్ట్రంలోని మిగతా యూనివర్సిటీలు కూడా ఇటువంటి కోర్సులను ఆఫర్‌ చేస్తు న్నాయి. వివరాల కోసం ఆయా వర్సిటీల వెబ్‌ సైట్‌లను చూడొచ్చు.
ఐఐటీ-జామ్‌(జేఏఎం) పరీక్షకు సంబంధించిన వివరాలను తెలపండి?
+
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)లు ఆఫర్‌ చేసే వివిధ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎంఎస్సీ(జామ్‌). గుర్తింపు పొం దిన యూనివర్సిటీ నుంచి 55శాతం మార్కులతో సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అభ్యర్థులు జామ్‌కు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటీ-జామ్‌ కేవలం క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌ మాత్రమే. ఈ స్కోర్‌ ఆధారంగా తమకు నచ్చిన ఐఐటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

ఐఐటీ జామ్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ కలయికగా జరుగు తుంది. మొత్తం ఎనిమిది సబ్జెక్టుల్లో జరిగే పరీక్షల్లో బయో టెక్నా లజీ, మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సు పరీక్షలు పూర్తి గా ఆబ్జెక్టివ్‌ విధానంలో.. మిగతా పరీక్షలు ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ల కలయికగా ఉంటున్నాయి. ఈ క్రమంలో సగటున ఆబ్జెక్టివ్‌ ప్రశ్న లకు 30 శాతం, డిస్క్రిప్టివ్‌ (సబ్జెక్టివ్‌) ప్రశ్నలకు 70 శాతం వెయి టేజీ ఉంటోంది. అయితే డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలకు బుక్‌లెట్‌లోని నిర్దేశిత ప్రదేశంలో సమాధానాలు ఇవ్వాలనే నిబంధన ఉండ టాన్ని విద్యార్థులు గమనించాలి. దీనికి అనుగుణంగా తమ ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవాలి. తక్కువ దశల్లో ఒక సమస్య ను పరిష్కరించే పరిజ్ఞానం సొంతం చేసుకోవాలి. నెగిటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది.

ఆఫర్‌ చేసే కోర్సులు:
ఐటీ -బాంబే: అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ అప్ల యిడ్‌ జియాలజీ అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్‌ ఫిజిక్స్‌
ఐఐటీ-ఢిల్లీ: కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్‌ ఫిజిక్స్‌
ఐఐటీ-గౌహతి: కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ ఫిజిక్స్‌
ఐఐటీ-కాన్పూర్‌: కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్‌ ఫిజిక్స్‌ స్టాటిస్టిక్స్‌
ఐఐటీ-మద్రాస్‌: కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్‌ ఫిజిక్స్‌
ఐఐటీ-రూర్కీ: అప్లయిడ్‌ జియాలజీ అప్లయిడ్‌ మ్యాథమెటి క్స్‌ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఇండస్ట్రియల్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ ఫిజిక్స్‌
ఎంఎస్సీ(ఆంత్రోపాలజీ) కోర్సును ఆఫ ర్‌ చేస్తున్న యుూనివర్సిటీలను తెలపండి?
+
శ్రీ వేంకటేశ్వర యుూనివర్సిటీ-తిరుపతి
ఆంత్రోపాలజీ, బయూలాజికల్‌ ఆంత్రోపా లజీ, సోషల్‌ ఆంత్రోపాలజీ విభాగాలతో ఎంఎస్సీ కోర్సును అందిస్తుంది. వర్సిటీ నిర్వహించే రాతపరీక్ష ఆధారంగా ప్రవేశం
వెబ్‌సైట్‌: www.svuniversity.in
ఆంధ్రా యుూనివర్సిటీ-విశాఖపట్నం, ఎంఎస్సీ (ఆంత్రోపాలజీ) కోర్సును అంది స్తుంది. జువాలజీతో బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం. వెబ్‌సైట్‌: www.andhrauniversity.info
యుూనివర్సిటీ ఆఫ్‌ వుద్రాస్‌-చెన్నై కూడా ఎంఎస్సీ (ఆంత్రోపాలజీ) కోర్సు ను ఆఫర్‌ చేస్తుంది.
వెబ్‌సైట్‌: www.unom.ac.in
బీఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ) పూర్తి చేశాను. పీజీలో ఏ కోర్సు ఎంచు కోవాలి?
+
రీసెర్చ్‌, టీచింగ్‌ రంగాల్లో స్థిరపడాలను కుంటే మాత్రం డిగ్రీలో మీరు చదివిన సబ్జె క్టుల్లో ఏదో ఒక దాంట్లో పీజీ చేస్తే సరిపో తుంది. కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగం సాధించాలనుకుంటే మాత్రం... బయోటె క్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనిటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ వంటి స్పెషలైజే షన్‌ కోర్సులను ఎంచుకోవడం మంచిది. మన రాష్ట్రంలోని ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీలు ఈ కోర్సులను అందిస్తు న్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికే వెలువడింది. వివరాల కోసం ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్లను చూడొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ- www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ- www.andhrauniversity.info
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) నుంచి ఎంఎస్సీ(వైరాలజీ) కోర్సులో ప్రవేశం ఎలా?
+
దేశంలోని ప్రముఖ వైరస్‌ రీసెర్చ్‌ లేబొరేటరీలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ కీలకమైంది. ఇది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) పరిధిలో పని చేస్తుంది.
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ యూనివర్సిటీ ఆఫ్‌ పూణే అనుబంధ సంస్థ. ఈ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫర్‌ చేసే ఎంఎస్సీ (వైరాలజీ) సిలబస్‌ను..అకడెమిక్‌, ఇండస్ట్రీ, హెల్త్‌ సెక్టార్‌ అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దారు.బీఎస్సీ(మైక్రో బయాలజీ/జువాలజీ/బోటనీ/కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/లైఫ్‌సెన్సైస్‌) లేదా ఎంబీబీఎస్‌/బీవీఎస్సీ పూర్తిచే సిన వారు ఈ కోర్సుకు అర్హులు. జాతీయ స్థాయిలో నిర్వ హించే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా దీనిలో ప్రవేశం కల్పిస్తారు. ఇందు కోసం ప్రతి ఏటా ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ విడుదలవు తుంది. మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష రెండు విభాగాల్లో (పేపర్‌-1, పేపర్‌-2) జరుగుతోంది.
పేపర్‌-1-ఇది 100 మార్కులకు ఉంటుంది. జనరల్‌ నాలెడ్జ్‌, క్వాంటిటేవ్‌ స్కిల్స్‌,అప్టిట్యూడ్‌, ఇంటెలిజెన్స్‌ అంశాల నుంచి 50 ప్రశ్నలను ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.6 మార్కును తగ్గిస్తారు.
పేపర్‌-2లో సెక్షన్‌-ఎ, సెక్షన్‌-బి రెండు విభాగాలుం టాయి.
సెక్షన్‌-ఎ 50 మార్కులకు ఉంటుంది.ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ(10+2 స్థాయి) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.3 మార్కును తగ్గిస్తారు.
సెక్షన్‌-బి కూడా 50 మార్కులకు ఉంటుంది. బయోటె క్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, లైఫ్‌ సెన్సైస్‌, మెడికల్‌ సెన్సైస్‌, మైక్రోబయాలజీ, వెటర్నరీ సైన్స్‌, జువాలజీ (గ్రాడ్యుయేషన్‌ స్థాయి)నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.3 మార్కును తగ్గిస్తారు.
వెబ్‌సైట్‌:  www.icmr.nic.in
పీజీ స్థాయిలో బయోఇన్ఫర్మాటిక్స్‌ను ఆఫర్‌ చేస్తోన్న ఇన్‌స్టి ట్యూట్‌లేవి?
+
పీజీ స్థాయిలో బయోఇన్ఫర్మాటిక్స్‌ ఎంఎస్సీ, ఎంటెక్‌ రెండు విధాలుగా అందుబాటులో ఉంది.
ఎంటెక్‌ (బయోఇన్ఫర్మాటిక్స్‌)ను అందిస్తోన్న ఇన్‌స్టిట్యూట్‌లు:
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఎంటెక్‌ (బయోఇన్ఫ ర్మాటిక్స్‌)ను అఫర్‌ చేస్తోంది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్‌: www.uohyd.ernet.in
కారుణ్య యూనివర్సిటీ, చెన్నై ఎంటెక్‌ (బయోఇన్ఫర్మా టిక్స్‌)ను అందిస్తోంది. 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌సైన్స్‌/సాఫ్ట్‌వేర్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌)లేదా ఎంఎస్సీ(బయోఇన్ఫర్మాటిక్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/లైఫ్‌ సెన్సైస్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌) చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. వెబ్‌సైట్‌:  www.karunya.edu
ఎంఎస్సీ(బయోఇన్ఫర్మాటిక్స్‌)ను అందిస్తోన్న ఇన్‌స్టిట్యూట్‌లు:
యూనివర్సిటీ ఆఫ్‌ పుణే, బయోఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ ఎంఎస్సీ (బయోఇన్ఫర్మాటిక్స్‌)ను ఆఫర్‌ చేస్తోంది. 60 శాతం మార్కు లతో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌/లైఫ్‌ సెన్సైస్‌/అగ్రికల్చర్‌/ ఇంజనీరింగ్‌/మెడిసిన్‌/ఫార్మసీ/వెటర్నరీ సైన్స్‌తో బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు.
వెబ్‌సైట్‌: https://bioinfo.ernet.in
భారతీయార్‌ యూనివర్సిటీ, కోయంబత్తూర్‌ ఎంఎస్సీ (బయోఇన్ఫర్మాటిక్స్‌)ను అందిస్తోంది. బ్యాచిలర్‌ డిగ్రీ(బయో టెక్నాలజీ/అగ్రికల్చర్‌/అప్లయిడ్‌ సైన్స్‌/యానిమల్‌సైన్స్‌/ బయో కెమిస్ట్రీ/బయాలజీ/బోటనీ/కెమిస్ట్రీ/కంప్యూటర్‌ సైన్స్‌ /ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/మ్యాథమె టిక్స్‌/మైక్రోబయాలజీ/ ఫార్మ సీ/ఫిజిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌/వెటర్నరీ సైన్స్‌/జువాలజీలతో) చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. వెబ్‌సైట్‌:  www.bu.ac.in
ఎంఎస్సీలో మైక్రోబయాలజీ/ మెడికల్‌ మైక్రోబయాలజీల్లో దేన్ని ఎంచుకోవాలి?
+
మెడికల్‌ మైక్రోబయాలజీ/మైక్రోబ యాలజీ రెండిటికి మంచి అవకాశలుం టాయి. అయితే మెడికల్‌ మైక్రోబయాలజీ అనేది స్పెషలైజ్‌డ్‌ కోర్సు కావటం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగు. మైక్రోబయా లజీ.. సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాల్లో చక్కటి అవగాహనకు దోహదం చేస్తుంది. దీనిలో పీజీ చేసిన తర్వాత మీకిష్టమైన అంశంలో షార్ట్‌టర్మ్‌ కోర్సు చేయవచ్చు లేదా అందుకు సంబంధించిన శిక్షణను తీసుకోవచ్చు. పరిశోధన రంగంలోకి కూడా ప్రవేశించవచ్చు.
డిగ్రీ 58 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. మన రాష్ట్రంలోని ఏ విద్యాసంస్థ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు అందజేస్తోంది.? ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కావాలని ఆసక్తి ఉంది. ఇందుకోసం ఏ కోర్సు చదవాలి?
+
ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభుత్వ విభాగంలో ఓ హోదా. బహుశా... మీరు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ గురించి చెబుతున్నారేమో! వీరు మునిసిపల్‌ పరిధిలో పని చేసే ఉద్యోగులు. ఇంటర్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో సైన్స్‌ సబ్జెక్టుతో చదివిన అభ్యర్థులు ఆయా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నిర్వహించే పరీక్షలు రాసి ఈ ఉద్యోగాలు పొందవచ్చు.
ప్రస్తుతం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్స్‌కు నిర్వచనం మారింది. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్‌ ఇండస్ట్రీ బిలియన్‌ డాలర్‌ మార్కెట్‌ కలిగి ఉంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పొందేందుకు ప్రత్యేక డిగ్రీలు అందుబాటులోకి వచ్చాయి. మీరు ఆధునిక ఆలోచనలకు అనుగుణంగా ఫుడ్‌ ఇండస్ట్రీ రంగంలో ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఫుడ్‌ టెక్నాలజీ ప్రత్యేకాంశంగా చదివిన అభ్యర్థులకు నేడు ప్రసిద్ధ కంపెనీలు మంచి వేతనాలతో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రాసెసింగ్‌, ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ప్యాకేజింగ్‌, ఆహార పదార్థాల్లో ఉపయోగించే రంగులు వంటి అంశాల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఫుడ్‌ టెక్నాలజీలో ప్రవేశించాలనుకుంటే అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌ నుంచే ఈ రంగానికి సంబంధించిన సబ్జెక్టులను చదవడం అవసరం. ఇంటర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ చదివితే బిఎస్‌సి (ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ న్యూట్రిషన్‌), బిటెక్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌ వంటి కోర్సులుంటారుు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఎంఎస్‌సీ (ఫుడ్‌ సైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ అండ్‌ ఫెర్మెంటీషన్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌) కోర్సులను చేయవచ్చు. మన రాష్ట్రంలో కాకతీయ, ఆంధ్ర, ఎన్‌.జి. రంగా  వ్యవసాయ విశ్వ విద్యాలయూలు, హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌లు ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌కు సంబంధించి బ్యాచిలర్‌, మాస్టర్స్‌ స్థారుులో పలు కోర్సులు బోధిస్తున్నారుు.
బయో ఇన్ఫర్మేటిక్స్‌ రంగంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ కోర్సుని ఏ సంస్థలు అందజేస్తున్నారుు?
+
సబ్జెక్ట్‌ కంటే క్షేత్రస్థారుు అధ్యయనం అధికంగా ఉండే రంగం బయోఇన్ఫర్మేటిక్స్‌. ఈ రంగంలో విస్తతంగా... విభిన్న విధానాలుగల ఎన్నో ఉప విభాగాలుంటారుు. ఇందులో స్థిరపడాలనుకుంటే బయలాజికల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ఒక అంశానికి సంబంధించి విస్తత సమాచారాన్ని పొందడానికి బయోటెక్‌ పరిశోధనలు ఎంతో ఉపయోగపడతారుు. సీక్వెన్స్‌ అసెంబ్లీ, జీనోమ్‌ సీక్వెన్స్‌ అసెంబ్లీ, ఫంక్షనల్‌ జీనోమిక్స్‌, ప్రొటియోమిక్స్‌, ఫార్మాకొజీనోమిక్స్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు అపారం. డిగ్రీ స్థారుులో బయూలజీ ఐచ్ఛికాంశంగా ఉత్తీర్ణులైనవారికి ఎమ్మెస్సీ బయోఇన్ఫర్మేటిక్స్‌ కోర్సులను పలు యూనివర్సిటీలు అందజేస్తున్నారుు. యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, భారతీయూర్‌ యూనివర్సిటీలు ఎమ్మెస్సీ కోర్సును బోధిస్తున్నారుు. కారుణ్య యూనివర్సిటీ (చెన్నై), ఎమిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (నోరుుడా)లు ఎం.టెక్‌. కోర్సును, పాండిచ్చేరి యూనివర్సిటీ పి.హెచ్‌డి కోర్సును అందిస్తున్నారుు. ఎమిటీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందాలంటే గేట్‌ స్కోరు ప్రామాణికం.
ఇంటర్మీడియెట్‌లో 52.5 శాతంతో ఉత్తీర్ణత సాధించాను. సైకాలజీలో డిగ్రీ చేయాలనుంది. సలహా ఇవ్వగలరు?
+
శ్రద్ధాసక్తులు కనబర్చితే సైకాలజీ చక్కని అంశం. అనేక రంగాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేముందు వారి మానసిక స్థితిని విశ్లేషిస్తున్నారు. అభ్యర్థుల శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం, వ్యక్తిత్వానికి సంబంధించి కూడా కొన్ని సంస్థలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. సైకాలజీ పట్టా అందుకున్న అభ్యర్థులకు విశ్లేషకులు, కౌన్సెలర్లు, ప్రొఫెసర్లు, సలహాదారులుగా ఉద్యోగాలు లభిస్తాయి. బోధన రంగంలోనూ ఎన్నెన్నో అవకాశాలు. అయితే ఈ అంశంలో కేవలం బ్యాచిలర్‌ డిగ్రీ మాత్రమే సరిపోదు. ఉన్నత చదువులు చదవాల్సిందే. బ్యాచిలర్‌ డిగ్రీతోనే ఉద్యోగం కావాలనుకుంటే సైకాలజీతోపాటు మరికొన్ని అనుబంధ అంశాలను కూడా ఎంచుకోవాలి. బెంగళూరులోని క్రీస్ట్‌ కళాశాల, ఎమిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకాలజీ అండ్‌ అలై ్లడ్‌ సెన్సైస్‌ (నోయిడా, లక్నో)లు బ్యాచిలర్‌ స్థాయిలో సైకాలజీ కోర్సు అందిస్తున్న ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు. దూర విద్య విధానంలో అన్నామలై యూనివర్సిటీ బీఎస్సీ సైకాలజీ కోర్సు అందిస్తోంది. ఈ వర్సిటీ పీజీ కోర్సునూ బోధిస్తోంది. వివరాలకు ఆయా వర్సిటీల వెబ్‌సైట్లు చూడండి.