Rayalaseema Thermal Plant: రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌కు డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పేరు
కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి(ఎంవీఆర్) సేవలకు గుర్తింపుగా, రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Rare spider found in Horsleyhills: హార్సిలీహిల్స్‌పై అరుదైన సాలీడు
వారి ఆమోదంతో వైఎస్సార్ జిల్లా కలమళ్లలోని 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకొస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మూడు థర్మల్ ప్లాంట్లకు ముగ్గురు ప్రముఖుల పేర్లు
రాష్ట్రంలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లుండగా, వేర్వేరు రంగాలకు చెందిన వారి పేర్లు వాటికి సార్థక నామధేయాలుగా మారాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్లాంట్‌కు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రమని పేరు పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని పవర్ ప్లాంటుకు విద్యుత్ రంగ పితామహుడుగా పేరు పొందిన డాక్టర్ నార్ల తాతారావు పేరు పెట్టారు. తాజాగా ఆర్టీపీపీని కార్మిక నేత ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా ప్రభుత్వం మార్చింది.
ఎంవీఆర్ కృషితో సీమలో థర్మల్ ప్లాంట్
వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం థర్మల్ విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయాలని మొట్టమొదట డిమాండ్ చేసిన నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి. 1985లో ‘రాయలసీమ కన్నీటి గాథ’ అనే పుస్తకం ద్వారా ఆయన రాయలసీమ సమస్యలను, గణాంకాలు, సహేతుకమైన ఆధారాలతో రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు.