EPFO deadline: పింఛన్‌దారులకు గుడ్ న్యూస్... మళ్లీ గడువు పెంపు... ఇలా దరఖాస్తు చేసుకోండి
గతంలో మే 3వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియగా.. జూన్ 26 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అర్హులైన పింఛనుదారులు/సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకే చివరి అవకాశంగా మరో 15 రోజలు పాటు అవకాశం ఇస్తున్నట్లు ఈపీఎఫ్‌వో వెల్లడించింది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు యజమాని(ఎంప్లాయర్)కు 3 నెలలు; ఉద్యోగి (సభ్యుడు)కి 15 రోజుల పాటు గడువును పొడిగించినట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి.
పదో తరగతి అర్హతతో ఐటీబీపీలో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
ఆన్‌లైన్ దరఖాస్తుకు సాంకేతిక అడ్డంకులు, కచ్చితంగా జత చేయాల్సిన ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌కు సర్వర్ మొరాయించడం తదితర కారణాలతో అర్హులైన పింఛనుదారులు, కార్మికులు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో గడువు పొడిగించాలంటూ విజ్ఞప్తులు వెళ్లువెత్తాయి. దీంతో మరోసారి గడువు పొడిగించారు.
ఎవరు అర్హులు?
2014 సెప్టెంబరు 1 కంటే ముందు నుంచే ఈపీఎఫ్, ఈపీఎస్‌లలో సభ్యులుగా కొనసాగుతున్నవారు అధిక పింఛన్ పొందేందుకు అర్హులు. అలాగే 2014 సెప్టెంబరు 1 కంటే ముందు రిటైరైన ఉద్యోగులు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని, వాటిని ఈపీఎఫ్‌వో అధికారులు తిరస్కరించి ఉంటే వారు కూడా అర్హులే.
వరుసగా మూడు సార్లు ఫెయిల్.. తర్వాత ఐఆర్ఎస్.. దాని తర్వాత ఐఎఫ్ఎస్.. ఆ తర్వాత ఐఏఎస్ సాధించిన సూర్యభాన్ సక్సెస్ స్టోరీ
అవసరమైన పత్రాలు
అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), పెన్షనర్‌లకు సంబంధించి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పీపీవో), వేతన పరిమితి కంటే ఎక్కువగా ఈపీఎఫ్ ఖాతాకు చెల్లించినట్లుగా రుజువు పత్రాలు అవసరమవుతాయి.
అధిక పెన్షన్‌ను ఎలా లెక్కిస్తారు?
2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి అధిక పెన్షన్, సభ్యత్వం నుంచి నిష్క్రమించే తేదీకి ముందు 12 నెలలలో కాంట్రిబ్యూటరీ సర్వీస్ వ్యవధిలో తీసుకున్న సగటు నెలవారీ వేతనం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 2014 సెప్టెంబర్ 1న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన, విరమణ చేయబోయే ఉద్యోగులకు, సభ్యత్వం నుంచి నిష్క్రమించే తేదీకి ముందు 60 నెలలలో పొందిన సగటు నెలవారీ వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కకడతారు.