Skip to main content

EPFO: పీఎఫ్‌(PF) వడ్డీరేటు పెంచిన కేంద్రం.. ఎంత శాతం పెంచిందంటే?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
epfo

పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2022-23 సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేటు వర్తించనుంది. గతంలో 8.10 శాతంగా ఉన్న పీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతానికి చేర్చింది. కాగా ఇది 2022-23 పీఎఫ్ డిపాజిట్లపై వర్తిస్తుంది. పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న నగదు నిల్వపై ఈ వడ్డీ జమ కానుంది. ఈ మేరకు మార్చి 27,28 తేదీల్లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 
2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు. అయితే ఇప్పుడు మరో 0.05 శాతం మేర పెంచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల రెండు రోజుల సమావేశం అనంత‌రం ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీలో 0.05% పెంచాలని సిఫార్సు చేయాలని నిర్ణయించారు. 

DA for Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన అనంత‌రం వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత వడ్డీ రేటు అధికారికంగా ప్రభుత్వ గెజిట్‌ విడుదల అవుతుంది. అనంతరం ఈపీఎఫ్‌ఓ ​​తన చందాదారుల ఖాతాల్లో వడ్డీ రేటును జమ చేస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే ఆదాయం మొత్తంలో వృద్ధి వరుసగా 16%, 15% కంటే ఎక్కువ అని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

 

Published date : 28 Mar 2023 04:54PM

Photo Stories