Skip to main content

CUET UG 2024 Application Date Extended : సీయూఈటీ-యూజీ 2024 ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సీయూఈటీ-యూజీ (CUET UG) 2024 పరీక్షకు దరఖాస్తుకు గ‌డువు మార్చి 27వ తేదీ(బుధ‌వారం)తో ముగియ‌నున్న విష‌యం తెల్సిందే. అయితే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అభ్య‌ర్థుల విన్న‌పం మేరకు ఈ ద‌ర‌ఖాస్తు గడువును మార్చి 31వ తేదీ (ఆదివారం) వ‌ర‌కు పెంచారు.
National Testing Agency  Announcement    New CUET-UG 2024 Application Deadline  CUET UG 2024 Application Date Extended    CUET-UG 2024 Examination Application Deadline Extended
CUET 2024

దేశవ్యాప్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీలతో పాటు.. ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ (CUET UG)2024. ఈ పరీక్షను హైబ్రిడ్‌ పద్ధతి (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), మరికొన్నింటిలో పేపర్‌, పెన్ను విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈ సారి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పించారు.

☛ CUET UG 2024: సీయూఈటీ-యూజీతో ప్రయోజనాలు, పరీక్ష విధానం, మెరుగైన స్కోర్‌కు మార్గాలు..

తెలుగుతో సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://exams.nta.ac.in/CUET-UG/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

సీయూఈటీ-యూజీ 2024 ద‌ర‌ఖాస్తు పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 27 Mar 2024 05:30PM
PDF

Photo Stories