Skip to main content

Success Story : లక్ష జీతం వ‌దులుకున్నా.. జామకాయ‌లు అమ్ముతున్నా.. కార‌ణం ఇదే..

ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నెలకు రూ.లక్ష జీతం తీసుకుని.. వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం మానేశాడు. తన భూమిలో విభిన్న పంటలను సాగుచేస్తూ నలుగురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు.

ఆదిలాబాద్ జిల్లాకి చెందిన కోదే అన్వేశ్‌ ఎంటెక్‌ వరకు చదివాడు. 2016 నుంచి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాడు. వెబ్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. నెలకు రూ.లక్ష జీతం వస్తున్నా సంతృప్తి చెందలేదు. ఉద్యోగం వదులుకొని తనకు నచ్చిన వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

Success Story: నాడు పశువులకు కాప‌ల ఉన్నా.. నేడు దేశానికి కాప‌ల కాసే ఉద్యోగం చేస్తున్నా.. ఇందుకే..

నాలుగేళ్లుగా తాంసి మండలం సావర్గాం గ్రామశివారులోని ఎనిమిదెకరాల సొంత భూమిలో వివిధ పంటలను సాగు చేస్తూ లాభాలను గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మొద‌టి ప్ర‌య‌త్నంలోనే..
హైదరాబాద్‌ నుంచి వచ్చిన అన్వేశ్‌ మొదటి సంవత్సరం పత్తి, జొన్న సాగు చేశాడు. పత్తి, జొన్న సాగుతో కూలీల కొరత, కష్టం ఎక్కువగా ఉండడంతో నష్టాలను చవిచూశాడు. ఏ మాత్రం కుంగిపోకుండా ఇతర పంటలను సాగుచేసి లాభాలను పొందాలని నిర్ణయించుకున్నాడు. ఏ పంటలను సాగుచేస్తే మేలని వ్యవసాయశాఖ అధికారుల సూచనలు తీసుకున్నాడు. స్నేహితుల సలహాలు తీసుకొని పంటలను సాగుచేస్తున్నాడు.

Inspirational Story : నాడు పుస్తెలతాడు కూడా తాకట్టు పెట్టా..నేడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నానిలా..

రూ.2.50 లక్షల వరకు ఖర్చుచేసి..

farmer success story

2019లో హార్టికల్చర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సలహాతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి నుంచి థైవాన్‌ జామ మొక్కలను తెప్పించాడు. రూ.2.50 లక్షల వరకు ఖర్చుచేసి నాలుగెకరాల్లో ఎకరాకు వెయ్యి చొప్పున నాటించాడు. మొక్కలను హైడెన్సిటీ విధానంతో ఆరు అడుగులకు ఒక్కటి చొప్పున ఉండేలా చూశాడు. రసాయన మందులు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేశాడు. దీంతో మొక్కలను నాటిన 18 నెలలకే కాత ప్రారంభమైంది. సేంద్రియంగా పెంచిన జామపండ్లను పంటచేను పక్కనే ఉన్న రోడ్డు పక్కన షెడ్డు వేసి రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నాడు. పెద్దఎత్తున దిగుబడి వచ్చినప్పుడు బయటి మార్కెట్‌కు కూడా తరలిస్తున్నాడు. జామ ద్వారా మొదటి సంవత్సరం రూ.రూ.2.50 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కాత ఎక్కువగా ఉండగా రూ.3 లక్షల వరకు వస్తుందని అన్వేశ్‌ చెబుతున్నాడు.

Inspirational Story : ఇరవై ఒక్కవేల పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. నా స‌క్సెస్ సిక్రెట్ ఇదే..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కన్నా.. ఇదే

farmer success story in telugu

జామతోటతో అంతరసాగు విధానంలో వివిధ పంటలు వేశాడు. దీనికి తోడు పంటచేనులో ప్రత్యేక షెడ్లు వేసి రెండేళ్లుగా నాటు, కడక్‌నాథ్, గిరిరాజా కోళ్లు, బాతులను పెంచుతున్నాడు. వాటిని విక్రయిస్తూ అదనపు లాభాలను గడిస్తున్నాడు. వచ్చే సంవత్సరం నుంచి బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం చేపట్టనున్నట్లు అన్వేశ్‌ తెలిపాడు. ఇప్పటి నుంచే షెడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కన్నా ఇక్కడే తృప్తిగా, ప్రశాంతంగా ఉన్నట్లు చెబుతున్నాడు.

Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

నా సంతృప్తి ఇదే..
నేను ఎంటెక్‌ పూర్తిచేశాను. మూడేళ్లపాటు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. జీతం సరిపడా వచ్చినా ఉద్యోగంపై ఆసక్తి లేక మానేశాను. మాకున్న భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న. నాన్న శ్రీనివాస్‌ సాయంతో మూడేళ్ల క్రితం వ్యవసాయం ప్రారంభించాను. ప్రస్తుతం వివిధ పంటలతోపాటు జామ సాగు చేపట్టాను. అలాగే వివిధ రకాల కోళ్ల పెంపకం చేపట్టి అదనపు ఆదాయాన్ని పొందుతున్న. రోజూ పంటచేనులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాతోపాటు నిత్యం నలుగురు కూలీలకు పని కల్పించడం సంతృప్తినిస్తోంది.
                                                      – కోదే అన్వేశ్, యువరైతు

Success Story: ఏ ఒక్క‌ కంపెనీ పెట్ట‌కుండానే.. వేల కోట్లు సంపాదించాడిలా..

Published date : 30 Nov 2022 06:06PM

Photo Stories