Skip to main content

Job Fair: నిరుద్యోగులకు శుభవార్త.. మైక్రో ఫైనాన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా

అనంతపురం: ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌, ఫ్యూషన్‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో డిసెంబ‌ర్ 20న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మల్లారెడ్డి తెలిపారు.
AF Ecology Center and Fusion Micro Finance Job Fair Details Anantapur Employment Opportunity  Job fair under the auspices of micro finance organization   Anantapur Job Fair on December 20

 ఇంటర్మీడియెట్‌, డిగ్రీ ఉత్తీర్ణత/ ఫెయిల్‌ అయిన 32 సంవత్సరాల్లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టూ వీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇందులో ఎంపికై న వారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం, తాడిపత్రి, పెనుకొండ, కదిరి, గోరంట్ల, హిందూపురం, కళ్యాణదుర్గం, ఉరవకొండలోని ఫ్యూషన్‌ మైక్రోఫైనాన్స్‌ –ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ బ్రాంచుల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు.

చదవండి: 1,207 Jobs in SSC: ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి,డి ఎగ్జామినేషన్‌–2023 వివరాలు.. రాత పరీక్ష.. 200 మార్కులు

ఎంపికై న వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు జీతభత్యాలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 63053 00106, 95506 76098, 83285 28338 నంబర్లలో సంప్రదించాలన్నారు.

sakshi education whatsapp channel image link

Published date : 19 Dec 2023 03:07PM

Photo Stories