యువతకు ఆతిథ్యరంగంలో శిక్షణ
ఇందులో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో తొలిసారిగా స్థానిక ప్రజలకు ప్రత్యామ్నయ జీవనోపాధి కల్పన దిశగా అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ హాస్పటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్)లో ఏటీఆర్ పరిధిలోని 19 మందికి మొదటి బ్యాచ్ కింద 10 రోజుల క్రాష్ కోర్సులో కుకింగ్, హాస్పటాలిటీ, రిసెప్షన్, వెయిటర్స్ వంటి కేటగిరీల్లో ప్రాథమిక శిక్షణను ఇస్తున్నారు. చెంచులతో పాటు స్థానిక నిరుద్యోగ యువతను కలుపుకుని మొదటి బ్యాచ్‌లో భాగంగా ఈ 19 మందిని ఎంపిక చేశారు. ఈ క్రాష్‌కోర్సుల ద్వారా ఇచ్చే సరి్టఫికెట్‌తో వారు స్థానిక రెస్టారెంట్లు, రిసార్టుల్లో ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 2న నిథమ్‌లో జరిగిన శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియల్ మాట్లాడుతూ ఎకో టూరిజంలో భాగంగా ఆతిథ్య రంగంలో శిక్షణ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చన్నారు. ఈ కోర్సులో నేరి్పంచే మెళకువల గురించి, అవి వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఏ విధంగా ఉపయోగపడతాయన్న అంశాలను నిథమ్ డైరెక్టర్ చిన్నపరెడ్డి వివరించారు.
చదవండి: NITM: ‘నిథమ్’కు ప్రతిష్టాత్మక ‘ఐఎస్‌ఓ సర్టిఫికేషన్స్’
మెరుగైన ఉపాధికోసం..
ఆదివాసీ, చెంచు యువత ఆతిథ్యరంగంలో నైపుణ్యాలు మెరుగుపరుచుకుని మంచి ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా చేయాలనేదే తమ లక్ష్యం అని నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్ గొప్పిడి సాక్షికి తెలిపారు. 3 నుంచి 6 నెలల కాలవ్యవధి ఉన్న వివిధ కోర్సుల ద్వారా వందశాతం ఉపాధికి అవకాశాలున్నాయని చెప్పారు.