Skip to main content

Medical Seats: సింగ‌రేణి కార్మికుల‌కు గుడ్ న్యూస్‌... వారి పిల్ల‌ల‌కు రిజ‌ర్వేష‌న్ల‌నిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు..!

సింగ‌రేణి ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇదివ‌ర‌కు హామీ ఇచ్చిన మేర‌కు మెడిక‌ల్ క‌ళాశాల‌లో మెడిక‌ల్ సీట్ల‌ను రిజ‌ర్వ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
Ramagundam Medical College
సింగ‌రేణి కార్మికుల‌కు గుడ్ న్యూస్‌... వారి పిల్ల‌ల‌కు రిజ‌ర్వేష‌న్ల‌నిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు..!

రామగుండం మెడికల్‌ కాలేజీలో ఆడ్మిషన్లలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాల‌ని ఉద్యోగులు, కార్మికుల నుంచి డిమాండ్లు వినిపించాయి. సింగరేణి సౌజన్యంతో రామగుండంలో మెడికల్‌ కాలేజీ కడుతున్నారు కాబట్టి సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డులు పెట్టాలని.. వాళ్ల పిల్లలకు ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని.. సింగరేణి మెడికల్‌ కాలేజీగా పేరు పెట్టాలని ఆ ప్రాంత వాసులు ప్ర‌భుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వ‌స్తున్నారు. 

MBBS: ఎంబీబీఎస్‌కు తొమ్మిదేళ్లే చాన్స్‌... ఒక్క ప‌రీక్ష ఫెయిలైనా మ‌ళ్లీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో కూర్చోవాల్సిందే..!

NEET

తాజాగా సింగ‌రేణి కార్మికుల డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగులు, కార్మికుల‌ పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 23 సీట్లు ఆల్ ఇండియా కోటా కి వెళ్తాయి. మిగతా 127 ఎంబీబీఎస్ సీట్లలో 5% వీరికి రిజర్వేషన్ కింద కేటాయించింది ప్ర‌భుత్వం. అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్ల‌ల‌కు ద‌క్క‌నున్నాయి. 

చ‌ద‌వండి: టాప్ టెన్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే... ఇక్క‌డ సీటు వ‌స్తే సెటిలైన‌ట్లే..!

NEET

నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్, ఈమేరకు వారి పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో రిజర్వేషన్ కల్పించారు.

Published date : 06 Jul 2023 04:03PM

Photo Stories