Skip to main content

Governor: వర్సిటీల్లో విద్యార్థుల హెల్త్‌రికార్డ్‌

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఆరోగ్య రికార్డులను తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధికారులకు సూచించారు.
Governor
గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

గవర్నర్‌ అధ్యక్షతన ఫిబ్రవరి 9న రాజ్‌భవన్‌లో ‘యూనియన్‌ బడ్జెట్‌ 2023–24లో ప్రతిపాదించిన ఆరోగ్యరంగ కార్యక్రమాలు, కేటా యింపులు’అనే అంశంపై వివిధ కేంద్ర వైద్యసంస్థలు, ఇతర సంస్థల అధిపతులు, ప్రతినిధులు, పలువురు డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. గవర్నర్‌ మాట్లాడుతూ కేంద్రబడ్జెట్‌–2023లో ఆరోగ్యరంగానికి భారీ కేటాయింపులతో సుస్థిర ఆరోగ్య సంరక్షణ రంగాన్ని రూపొందించడానికి మార్గం ఏర్పడిందన్నారు.

చదవండి: Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2023–24

కేంద్రబడ్జెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు రూ.89,155 కోట్లు కేటాయించడంవల్ల ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను అద్భుతంగా మార్చడా నికి వీలు కలుగుతుందన్నారు. వైద్య విద్య, పారా మెడికల్‌ రంగం, ఆయుష్మాన్‌ భారత్‌ కోసం బడ్జెట్లో కేటాయింపులు భారీగా పెరిగాయని, దీనివల్ల ఈ పథకం కింద మరో 40 కోట్ల మందిని ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకు రావాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య పరిశోధనలకు కేటాయింపులు పెరగ డం ఆ రంగంలో నూతన ఆవిష్కరణలు పెరుగుతా యని, నాణ్యమైన పరిశోధనలకు దోహదపడుతుందని గవర్నర్‌ అన్నారు. 

చదవండి:

Andhra Pradesh Budget 2022 Highlights: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2022–23

Telangana Budget 2023‌-24 Highlights: తెలంగాణ బడ్జెట్ 2023‌-24

Published date : 10 Feb 2023 01:51PM

Photo Stories