Hemachandra Reddy: ‘పిల్లలు అద్భుతంగా ఎదిగే అవకాశం కల్పించాలి’
Sakshi Education
పెదకాకాని: విద్యార్థుల్లో సృజన, నైపుణ్యం, భాషా పరిజ్ఞానం పెంపొందించేందుకు బాలోత్సవ్ పోటీలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వీవీఐటీలో నిర్వహిస్తున్న బాలోత్సవ్–2022కు రెండో రోజు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలు గొప్పగా, అద్భుతంగా ఎదిగే అవకాశం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కల్పించాలన్నారు.
చదవండి: Good News: కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు
పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకుని వారిని ప్రోత్సహించాలన్నారు. అనంతరం రెండో రోజు విజేతలకు సరిఫికెట్లు, షీల్ట్ అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, వీవీఐటీ చైర్మన్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 14 Nov 2022 01:22PM