Skip to main content

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

చిన్నతనంలో తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుల ఇంటికి ఓ యువకుడి పై వెళ్ళాడు. అప్పడు అతని స్నేహతుల తల్లిదండ్రులు అభం శుభం తెలియని ఆ యువకుడిపై కోపం చూపించారు.
Govind Jaiswal IAS Sucess Story
Govind Jaiswal IAS

తమ కుమారుడితో ఎప్పుడూ కనిపించవద్దని హెచ్చరించారు కూడా.. ఎందుకంటే ఆ బాలుడు పేదవాడు.. తండ్రి రిక్షావాలా.. దీంతో అతడిని స్నేహితుల తల్లిదండ్రులు చిన్నచూపు చుశారు. ఈ ఘటన ఆ చిన్నారి యువకుడి మదిలో బలంగా ముద్రించుకుంది. అప్పుడే అనుకున్నాడు తను పెద్దయ్యాక అందరి ముందు గౌరవంగా మంచి స్థాయి లో జీవించాలి అని. అలా నిర్ణయం తీసుకున్న అన్నాయి రాత్రనక పగలనక కష్టపడ్డాడు.. ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు. ఆ సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరో కాదు గోవింద్ జైస్వాల్. రిక్షావాలా కొడుకు అనే పేరు నుంచి జిల్లాకి కలెక్టర్ అనే పేరుకు చేరుకోవడానికి జై స్వాల్ పడిన కష్టం పదిమందికి స్ఫూర్తి వంతం. కలెక్టర్ కొడుకు కలెక్టర్ , డాక్టర్ తనయుడు డాక్టర్త యాక్టర్ కుమారుడు యాక్టర్ కావడం పెద్ద గొప్ప విషయం అనిపించదమో కానీ ఒక రిక్షా నడుపుకునే వ్యక్తి కుమారుడు ఐఏఎస్ అవ్వడం మాత్రం నిజంగా గొప్ప విషయం.. అలాంటి యువకుడు ఎవరికైనా ఆదర్శవంతమే క‌దా..

కుటుంబ నేప‌థ్యం : 

Govind Jaiswal IAS Family


గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేస్తుండేవాడు. అతని సంపాదన మొత్తం ఇంట్లో వారి గురించే ఖర్చు చేసేవాడు. అయితే ఆ రేషన్ షాప్ అనుకోకుండా మూసివేశారు. దీంతో నారాయణ జైస్వాల్ ఉపాధి కోల్పోయాడు. అయితే అప్పటికే తన దగ్గర ఉన్న డబ్బులతో కొన్ని రిక్షాలను కొన్నాడు. ఎవరైతే ఆ రిక్షాలను తీసుకుని అద్దె చెల్లిస్తారో వారికీ కిరాయికి ఇచ్చేవాడు. అలా వచ్చిన సొమ్ముని రూపాయి రూపాయి పోగుచేసి.. కొంత భూమిని కొన్నాడు.

ఒక వైపు త‌ల్లి మ‌ర‌ణం.. మ‌రోవైపు..

Success Story


అయితే నారాయణ జైస్వాల్ ను మళ్ళీ విధి వెక్కిరించింది. ఆయన భార్యకు తీవ్ర అనారోగ్యం చేసింది. వైద్య ఖర్చుల నిమిత్తం చేతిలో ఉన్న నగదును ఖర్చు చేశాడు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. నారాయణ్ జైస్వాల్ భార్య అనారోగ్యతో మరణించింది. దీంతో మళ్ళీ నారాయణ జై స్వాల్ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలు పెట్టాడు. రిక్షాలను , దాచుకున్న భూమిని అమ్మేసి గోవింద్ జైస్వాల్.. ఆడపిల్లలకు పెళ్లి చేసాడు నారాయణ. అయితే కొడుకుని చదివించాలని నారాయణ కు మంచి పట్టుదల. దీంతో తానే రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు నారాయణ్ జైస్వాల్. అలా గోవింద్ ను చదివించడం మొదలు పెట్టాడు. పై చదువులు పూర్తి అయ్యాక గోవింద్ తాను కలెక్టర్ చదువుతా అని తండ్రి తో చెప్పాడు. కొడుకు కోరిక తెలుసుకున్న నారాయణ సంతోషంతో అప్పటి వరకూ కొడుకు కోసం దాచిన 40000 రూపాయలను ఇచ్చి కోచింగ్ కి పంపించాడు.

నెలవారీ ఖర్చుల కోసం..

IAS


అలా కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లిన గోవింద్ జైస్వాల్ నెలవారీ ఖర్చుల కోసం అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ చదువుకునేవారు. అలా కష్టపడుతూ చదివి మొదటి సరిగా సివిల్స్ పరీక్ష లు రాసాడు. 2006 లో ఫలితాలు వెలువడిన తరువాత గోవింద్ జీవితంలో అది మరుపురాని రోజు గా మిగిలింది. గోవింద్ మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయి లో 48 వ ర్యాంక్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గోవాలో పనిచేస్తున్నారు.

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Published date : 09 Feb 2022 07:35PM

Photo Stories