Skip to main content

UPSC Civils Free Coaching: సివిల్‌ సర్వీస్‌ లాంగ్‌ టర్మ్‌ ఉచిత శిక్షణ... దరఖాస్తుకు చివరి తేదీ ఇదే !

విద్యానగర్‌(కరీంనగర్‌): బీసీ సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పరిధి జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన, డిగ్రీ పాసైన అభ్యర్థులకు సివిల్‌ సర్వీస్‌ లాంగ్‌ టర్మ్‌ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగ ర్‌ బీసీ స్టడీ సర్కిల్‌ డైరక్టర్‌ డాక్టర్‌ రవికుమార్‌ తెలి పారు.
UPSC Civils Free Coaching

శిక్షణ పొందగోరేవారు జూలై 10 వరకు https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జూలై 16న ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుందని వివరించారు.

IAS Success Story: వ‌రుస‌గా మూడు సార్లు ఫెయిల్‌.. త‌ర్వాత ఐఆర్ఎస్‌.. దాని త‌ర్వాత ఐఎఫ్ఎస్‌.. ఆ త‌ర్వాత‌ ఐఏఎస్ సాధించిన ఐఐటీ కుర్రాడు సూర్య‌భాన్ స‌క్సెస్ స్టోరీ

శిక్షణ తరగతులు జూలై 30 నుంచి ఏప్రిల్‌ 30, 2024 వరకు హైదరాబాద్‌ తార్నాకలోని స్టడీ సర్కిల్‌, ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్‌ క్యాంపస్‌లో జరుగుతాయని పేర్కొన్నారు. లాడ్జింగ్‌, బోర్డింగ్‌ రవాణా ప్రయోజనం కోసం నెలకు రూ.5,000 అందించడం జరుగుతుందని, ప్రవేశం పొందిన అభ్యర్థులకు రూ.5వేల విలువైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ అందిస్తారని తెలిపారు.

వివరాలకు 040– 27077929, 77803 59322 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

IPS Officer Umesh Ganpat Success Story : నాడు ఫెయిల్​ స్టూడెంట్.. నేడు స‌క్సెస్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యాడిలా.. విజయానికి తొలి మెట్టు ఇదే..

Published date : 27 Jun 2023 05:10PM

Photo Stories