Skip to main content

Agniveer Jobs: జూన్‌ 20న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఈ వ‌య‌సు లోపు వారు మాత్రమే అర్హులు

సాక్షి, హైదరాబాద్‌: భారత సైన్యంలో హెడ్‌క్వార్టర్స్‌ యూనిట్‌ కోటా కింద సికింద్రాబాద్‌ 1 ఈఎంఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌) సెంటర్‌లో వివిధ పోస్టుల భర్తీకి జూన్‌ 20న రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్టు మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు.
June 20 Recruitment Rally for Indian Army Posts  Army Recruitment Rally  Secunderabad 1 EME Center Headquarters Unit Quota Recruitment Rally  Indian Army Recruitment Rally Announcement  Military Officials Announce Recruitment Rally

ఈ మేరకు మే 5న‌ ఓ ప్రకటన జారీ చేశారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ క్లరికల్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. యుద్ధంలో భర్తలను కోల్పోయిన వితంతువులు, వితంతువుల పిల్లలు, భారత సైన్యంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న వారి కుమారులతోపాటు సర్వీస్‌లో ఉన్న వారి సొంత సోదరులు ఈ ఉద్యోగాలకు అర్హులని అందులో పేర్కొన్నారు.

చదవండి: Agniveer Selections: అగ్నివీర్‌ ఎంపికపై విద్యార్థులకు అవగాహన

స్పోర్ట్స్‌ కోటా కింద స్విమ్మింగ్, వాలీబాల్‌ క్రీడాకారులను అర్హులుగా పరిగణిస్తామని తెలిపారు. ఈ పోస్టులకు పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్ల లోపు వారు మాత్రమే అర్హులని వెల్లడించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సికింద్రాబాద్, బొల్లారం, 1 ఈఎంఈ సెంటర్, హెడ్‌క్వార్టర్స్‌లో నేరుగా సంప్రదించవచ్చని లేదా ఈ మెయిల్‌–awwaleagle@gmail.com లో సంప్రదించవచ్చన్నారు. పూర్తి వివరాలకు  www.joinindianarmy@nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. 040–27863016 ఫోన్‌ నంబర్‌లోనూ వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

Published date : 06 May 2024 02:41PM

Photo Stories