Skip to main content

EPFO : ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్

EPFO
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్

ఈపీఎఫ్‌వో (epfo) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (etf)లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం ఆర్ధిక శాఖ అనుమతి కోరుతుంది. కేంద్రం అనుమతితో ఈటీఎఫ్‌లో మదుపు చేయనుంది. తద్వారా ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది.  పలు నివేదికల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలో ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టాలన్న ఈపీఎఫ్‌వో నిర్ణయాన్ని అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ, సెంట్రల్ బోర్డ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదం తెలిపింది.

ఇవీ చ‌ద‌వండి: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హ‌త‌తో ఇండియ‌న్ ఆయిల్‌లో ఉద్యోగాలు....!

epfo

ఇవీ చ‌ద‌వండి: పండుగ‌ల ఎఫెక్ట్‌... సెప్టెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు సెల‌వులే సెల‌వులు..!

ఈటీఎఫ్‌లో పెట్టుబడిలో పెట్టుబడి పెట్టి.. ఆ పెట్టుబడితో వచ్చిన లాభాల్ని తిరిగి చెల్లించేలా రిటైర్మెంట్‌ ఫండ్‌ బాడీ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో ఈపీఎఫ్‌వో తన మొత్తం నిర్వహణ ఆస్తుల్లో 5శాతం నుంచి 15 శాతం వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. పరిస్థితులకు అనుగుణంగా రోజువారీ ఈటీఎఫ్ పెట్టుబడులను వెనక్కి తీసుకునే ప్రతిపాదన కూడా ఉంది. అయితే,ఈపీఎఫ్‌వో తన పెట్టుబడిపై రాబడిని పెంచడానికి మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Published date : 26 Aug 2023 06:05PM

Photo Stories