Skip to main content

Highest Percentage in Tenth Exams: ఈసారి పరీక్షల్లో బాలికలదే పైచేయి.. ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించిన బడులు ఇవే!

సోమవారం విడుదలైన పదో తరగతి బోర్డు పరీక్షల ఫలితాల్లో పైచేయి ఈసారి కూడా బాలికలదేనని విద్యా శాఖ కమిషనర్‌ తెలిపారు. ఈసారి ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల వివరాలను వెల్లడించారు..
Girls celebrating success in class 10 board exams  Schools with highest percentage in Tenth Board Exams 2024  Education department releases class 10 board exam results

అనంతపురం: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు భళా అనిపించారు. సోమవారం విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 30,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 25,0003 మంది ఉత్తీర్ణత (80.93) శాతం సాధించారు. వీరిలో 15,017 మంది బాలికలకు 12,766 మందికి గాను 85.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 15,876 మందికి గాను 12,237 మంది 77.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో గతేడది 16 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి ఏకంగా 76 స్కూళ్లు ఈ వందశాతం ఫలితాలు సాధించడం విశేషం. ఉత్తీర్ణులైన వారిలో 18,432 మంది ప్రథమశ్రేణి, 4,100 మంది ద్వితీయ శ్రేణి, 2,471 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

NASA Awards: నాసా అవార్డులు గెలుచుకున్న భారత విద్యార్థులు వీరే..

టాప్‌లో బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు

బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు టాప్‌లో నిలిచాయి. 273 మంది విద్యార్థులకు గాను 269 మంది 98.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలల్లో 660 మందికి గాను 638 మంది 96.67 శాతం, ప్రైవేట్‌ స్కూళ్లలో 11,175 మందికి గాను 10,719 మంది 95.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. మైనార్టీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 237 మందికి గాను 226 మంది 95.36 శాతం, ఏపీ మోడల్‌ స్కూళ్లల్లో 1,137 మందికి గాను 1027 మంది 90.33 శాతం, కేజీబీవీల్లో 1,252 మందికి గాను 1,053 మంది 84.11 శాతం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 190 మందికి గాను 145 మంది 76.32 శాతం, ఎయిడెడ్‌ స్కూళ్లల్లో 426 మందికి గాను 324 మంది 76.06 శాతం, మునిసిపల్‌ స్కూళ్లల్లో 2,155 మందికి గాను 1,522 మంది 70.63 శాతం, జిల్లా పరిషత్‌ స్కూళ్లల్లో 11,453 మందకి గాను 7,800 మంది 68.10 శాతం, ప్రభుత్వ స్కూళ్లల్లో 1,935 మందికి గాను1,280 మంది 66.15 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Education at Govt School: ఏపీ విద్యా రంగంలో మార్పులు.. పథకాలతో తల్లిదండ్రలకు భారం తగ్గింపు!

24వ స్థానంలో జిల్లా

జిల్లాలో గతేడాదికంటే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చినా రాష్ట్రంలో నాలుగు స్థానాలకు కిందకు పడిపోయిది. గతేడాది 66.25 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మన జిల్లా 20వ స్థానంలో నిలవగా ఈసారి 80.93 శాతం అంటే 14.68 శాతం పెరిగింది. 24వ స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

30లోగా ఫీజు చెల్లింపు

ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఈ పరీక్ష మరో అవకాశం. ఫెయిల్‌ అయిన విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈనెల 30లోగా ఫీజు చెల్లించాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టుల పైన రూ.125, మూడు లోపు సబ్జెక్టులకు రూ.110, ఒకేషనల్‌ విద్యార్థులు రెగ్యులర్‌ ఫీజుతో పాటు అదనంగా రూ. 60 చెల్లించాలని సూచించారు. రీకౌంటింగ్‌కు రూ.500, రీ-వెరిఫికేషన్‌ ద్వారా జవాబుపత్రం నకలు కావాల్సిన వారు రూ. 1000 ఈనెల 30లోగా సంబంధిత పాఠశాల హెచ్‌ఎం లాగిన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

10th Class Results: ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు

Published date : 23 Apr 2024 01:25PM

Photo Stories