Skip to main content

Word Power Championship: జాతీయ వర్డ్‌ పవర్‌ ఛాంపియన్‌ షిప్‌లో విద్యార్థులు సత్తా.. ఈ రెండు స్థానాల్లో..

ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యం పెంచేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో గెలుపొందివారిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. అక్కడ తమ ప్రతిభను చాటి ఈ స్థానాల్లో నిలిచారు విద్యార్థులు..
Students talent at national level english skills competition  Top performers recognized in Amaravati English Skills Contest

అమరావతి: మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ వర్డ్‌ పవర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో సత్తా చాటారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా విభా, లీప్‌ ఫార్వార్డ్‌ సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ వర్డ్‌ పవర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో రాష్ట్రానికి రెండు బహుమతులు సాధించారు. గత నెల 14వ తేదీన విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులు ఈ నెల 12న ముంబైలో జరిగిన గ్రాండ్‌ ఫినాలే పోటీల్లో పాల్గొన్నారు.

AP Model Schools Exam 2024: ఏప్రిల్ 21న ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

ఫైనల్స్‌లో ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి బి.రేవంత్‌కుమార్‌ రెండో స్థానం, ఐదో తరగతి విద్యార్థి అనిల్‌కుమార్‌ బాణావత్‌ మూడో స్థానంలో నిలిచారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను అంచనా వేసేందుకు జాతీయ వర్డ్‌ పవర్‌ చాంపియన్‌షిప్‌ దేశంలోనే అతిపెద్ద పోటీ కార్యక్రమం. ఈ పోటీలో ఏపీ నుంచి ఐదుగురు విద్యార్థులు పాల్గొనగా, ఇద్దరు విద్యార్థులు రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి అభినందించారు.

Education: చదువుతోనే బడుగులకు గుర్తింపు: ఆర్‌.కృష్ణయ్య

ఈఎల్పీ ద్వారా శిక్షణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు 2021లో ప్రభుత్వం ఇంగ్లిష్‌ లిటరసీ ప్రోగ్రామ్‌(ఈఎల్పి)ను ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీతో విభా, లీప్‌ ఫార్వర్డ్‌ సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. ఈ ప్రొగ్రామ్‌ ద్వారా 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్‌ పదాలను సులభంగా పలకడం, చదవడం నేర్పిస్తున్నారు. కనిమెర్ల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడంతో ప్రభుత్వం చేపట్టిన ఈఎల్పీ సత్ఫలితాలు ఇస్తోందని స్పష్టమవుతోంది.

AP Inter Supplementary Fees and Date: ఇంటర్‌ సప్లిమెంటరీ, రీ వెరిఫికేషన్‌లకు ఫీజు చెల్లింపు.. తేదీ..?

Published date : 15 Apr 2024 12:47PM

Photo Stories