Summer Courses: సెలవుల సమయంలో విద్యార్థులు వివిధ రంగాల్లో..
సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఇటీవలె బోర్డు పరీక్షలు పూర్తయ్యాయి. వారికి వేసవి సెలవులు కూడా ప్రారంభమైనట్లు ప్రకటించింది విద్యశాఖ. ప్రస్తుతం, వారి పరీక్ష పత్రాల మూల్యాంకన పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 10 లోగా మూల్యాంకనం పూర్తి అవుతుంది. అనంతరం, వారంతా వారి తదుపరి విద్య జీవితాన్ని ప్రారంభించవచ్చు. అయితే, ఈ వేసవి సెలవులు విద్యార్థలకు రెండు నెలలకు ప్రకటించారు. ఈ మధ్యలో విద్యార్థులు వారి సెలవులను ఆశ్వాదిస్తూనే వారంతా వివిధ కోర్సుల్లో వారి ప్రతిభను కనబరుచుకోవచ్చు.
Aakash Education: విద్యార్థుల కల సాకారానికి ఆకాష్ ఎడ్యుకేషన్ కృషి..
ఇంటర్, డిగ్రీ, బీటెక్ వంటి విద్యే కాకుండా.. ఇతర కోర్సుల్లో కూడా అభ్యసించవచ్చు. విద్యార్థులు ప్రస్తుతం, కంప్యూటర్, ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, డ్యాన్స్ వంటి వివిధ కోర్సుల్లో చేరి వారి ప్రతిభను కనబరుచుకోవచ్చు. అంతే కాకుండా డిజిటల్ విద్యను కూడా అందుకునే అవకాశం ఉంది. ఇలా వివిధ కోర్సులు ఇంటి నుంచే నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీరంతా తమ సెల్‌ఫోన్‌లలో చూసి.., లేదా ఆన్‌లైన్ కోర్సుల్లో చేరి వారి ప్రతిభను మెరుగుపురుచుకోవచ్చు.
Tags
- summer vacation
- school holidays
- College Students
- various courses
- students talent
- computer courses
- Career Options
- students education
- Education News
- Sakshi Education News
- SkillsDevelopment
- InterdisciplinaryEducation
- SkillEnhancement
- PersonalGrowth
- CareerAdvancement
- EducationOpportunities
- AcademicCompletion
- sakshieducation updates