Skip to main content

Skill Test for Candidates: పోటీ పరీక్షల అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌..

గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏకేఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఈ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్‌ రాహుల్‌..
Skill test for candidates preparing for competitive exam Competitive exam preparation in district libraries  AKS Institute conducting awareness and skill test  Manchiryala Additional Collector B. Rahul

మంచిర్యాల: జిల్లాలోని మూడు గ్రంథాలయాల్లో గ్రూప్స్‌, డీఎస్సీ తదితర ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంగళవారం కలెక్టరేట్‌లో ఏకేఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో అవగాహన, స్కిల్‌టెస్ట్‌ నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాహుల్‌ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Self Employment for Women: మహిళలకు స్వయం ఉపాధి సంస్థ అందిస్తున్న ఉచిత శిక్షణ.. వివరాలు..

చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల గ్రంథాలయాల్లో 400 మంది వరకు అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న వివిధ పరీక్షలకు పుస్తకాలు, వైఫై, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. స్కిల్‌టెస్ట్‌, పరీక్షపై నిపుణులతో అవగాహన కల్పిస్తామని తెలిపారు.

Summer Sports Training: వేసవి క్రీడా శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం

Published date : 17 Apr 2024 10:26AM

Photo Stories