Jagananna Vidyaa Deevena: 19,636 మందికి... రూ. 12,92,06,301కోట్లు జమ!
పార్వతీపురం: ఆర్థిక కష్టాలతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నది ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశం. అందుకే నాలుగేళ్లుగా విద్యార్థుల చదువులే రాష్ట్రానికి పెట్టుబడిగా విద్యారంగానికి అధిక నిధులు వెచ్చిస్తున్నారు. విద్యార్థుల చదువుల కు ఆర్థిక కష్టాలు దూరం చేస్తున్నారు. పేద కుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.
తాజాగా 100 శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌లో భాగంగా జగనన్న విద్యాదీవెన కింద ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి చిత్తూరు జిల్లా నగిరి వేదికగా నిధులను సోమవారం విడుదల చేశారు. పార్వతీపురంమన్యం జిల్లాలోని 19,636 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రూ. 12,92,06,301కోట్లు జమ చేశారు.
వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ నిషాంత్‌కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులు, వారి తల్లులకు రూ.12.92 కోట్ల నమూనా చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విద్యాదీవెన పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, కాపు, క్రిస్టియన్ విద్యార్థుల చదువుకు అయ్యే పూర్తిఫీజులను ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ప్రతి పేదవిద్యార్థికి చదువుకునే అవకాశం కల్పించాలని, ఫీజులు చెల్లించలేని కారణంగా చదువులు ఆగకూడదని రాష్ట్ర ప్రభుత్వం విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తోంద న్నారు.
Bengaluru: నెట్టింట వైరలవుతున్న ఆటోవాలా ఇన్ఫిరేషన్ జర్నీ... ఎందుకో మీరు ఓ లుక్కేయండి.!
విద్యార్థుల ఫీజులను నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నట్టు తెలిపారు. విద్యతోనే సమాజం అభివృద్ధిచెందుతోందని, ప్రతి ఒక్కరూచక్కగా చదువుకోవాలని కోరారు. కార్యక్రమంలో జి ల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎం.డి.గయాజుద్దీన్, జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి ఎస్.కృష్ణ, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కె.శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
AP EAPCET 2023 Category-B అడ్మిషన్స్: దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఇదే!