Skip to main content

Good News : వీరికి ఉచితంగా 2 లక్షలు అందిస్తున్న కేంద్రం.. ఎలా అంటే..?

కేంద్రం అదిరిపోయే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ పథకం ఏంటి? ఎవరు అర్హులు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నేటి రోజుల్లో చదువు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
Good News For Students

డబ్బులేని కారణంగా చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల బంగారం లాంటి భవిష్యత్ కేవలం డబ్బువల్ల నీరుగారిపోతోంది.

ఈ స్కీమ్ ద్వారా విద్యార్థినులకు..
అయితే ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వాలు విద్యార్థులను ఆదుకునేందుకు.. చదువు నిరాటంకంగా సాగేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థినులకు కేంద్రం అదిరిపోయే స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థినులకు ఉచితంగా 2 లక్షలను అందిస్తోంది. 

స్కీమ్ ఏంటంటే..
ఇది కేవలం విద్యార్థినులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ స్కాలర్ షిప్ స్కీమ్ ద్వారా విద్యార్థినులు రూ.2 లక్షలు ఫ్రీగా పొందొచ్చు. ఆ స్కాలర్ షిప్ స్కీమ్ ఏంటంటే.. ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్. దీని ద్వారా డిప్లొమా విద్యాను అందిస్తున్న విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దీన్ని అమలు చేస్తోంది. 

☛ TCS Offers Free 15 Days Digital Certification Program: ఐటీ జాబ్‌ చేయాలనుకునేవారికి టీసీఎస్‌ ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సు

అర్హతలు ఇవే..
ఏఐసీటీఈ ఆమోదం పొందిన విద్యాసంస్థల్లో టెక్నికల్ డిగ్రీ కోర్సు చేసేందుకు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం జాయిన్ అవుతారో వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఫస్ట్ ఇయర్‌లో చేరిన వారికి 4 ఏళ్లు, సెకండ్ ఇయర్ ఇయర్‌లో చేరిన వారికి 3 ఏళ్ల పాటూ స్కాలర్ షిప్ లభిస్తుంది. ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థినులు ఉండి వారు ఏఐసీటీఈ ఆమోదం పొందిన ఎడ్యుకేషన్ ఇన్సిట్యూషన్స్ లో విద్యనభ్యసిస్తే వారిద్దరికి ఈ పథకం వర్తిస్తుంది.

☛ Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్ కింద సంవత్సరానికి రూ.50,000 చొప్పున 4 సంవత్సరాలు స్కాలర్ షిప్ అందిస్తారు. అంటే విద్యార్థినికి ఉచితంగా 2 లక్షలు అందిస్తుంది. ఏటా రూ.50 వేలు ఒకేసారి అందిస్తారు. ఈ డబ్బును విద్యార్థినులు వారి చదువుకు అయ్యే ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. అదే విధంగా విద్యార్థిని ఫెయిల్ అయినా, చదువు మధ్యలో ఆపేసినా స్కాలర్ షిప్ రాదు. ఈ స్కాలర్ షిప్ పొందేందుకు విద్యార్థినుల కుటుబం వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.

 HCL To Train Employees In Generative AI: జనరేటివ్‌ఏఐ విభాగంలో 75వేల మంది ఐటీ ఉద్యోగులకు ట్రైనింగ్‌

Published date : 30 Apr 2024 07:22PM

Photo Stories