Skip to main content

విజ్ఞానశాస్త్ర బోధన లక్ష్యాలు

సాధారణంగా ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యా లు అనే పదాలను పర్యాయపదాలుగా వాడతారు.

  • గమ్యాలు: విశాలమైన, దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాన్ని తెలిపేవి గమ్యాలు.
    ఉదా: విద్యకు పరమార్థం మోక్షం. - ఉపనిషత్తులు
  • ఉద్దేశాలు: గమ్యాల నుంచి ఏర్పడినవి ఉద్దేశాలు. ఇవి గమ్యాల కంటే నిర్దిష్టమైనవే కాకుండా విద్యా దిశలను కూడా సూచి స్తాయి.
    ఉదా: విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్ర జ్ఞానం కలిగించడం.
  • లక్ష్యాలు: స్వల్పకాలంలో చేరగలిగే గమ్యాలను లక్ష్యాలనవచ్చు.
    ఉదా: డీఈడీ పరీక్ష పాసవడం.
విజ్ఞానశాస్త్ర అధ్యయన విలువలు:
1. సామాజిక విలువలు
2. సాంస్కృతిక విలువలు
3. నైతిక విలువలు
4. వృత్తిపరమైన విలువలు
5. ఔపయోగిక విలువలు
సామాజిక విలువలు- రకాలు:
1. బౌద్ధిక విలువ
2. సృజనాత్మక విలువ
3. సౌందర్య విలువ.
విద్యా లక్ష్యాలను ఈ కింది విధంగా చూపొచ్చు
Images
గాగ్నే అనే విద్యావేత్త సూచించిన వర్గీకరణ: గాగ్నే అభ్యసనాన్ని వివిధ రకాలుగా విడమర్చి చెప్పారు. అవి..
సూచీ అభ్యసనం- ఉద్దీపన- ప్రతిస్పందన అభ్యసనం, భావనాభ్యసనం, సూత్రాల అభ్య సనం, సమస్యా పరిష్కారం. ఇవి సరళం నుంచి సంక్లిష్టం వరకు ఒక క్రమ పద్ధతిలో అమిరి ఉంటాయి.
బెంజిమన్ బ్లూమ్, క్రాత్‌హాల్, డేవిడ్ సూచించిన వర్గీకరణ: వీరు విద్యా లక్ష్యాలను మూడు వర్గాలుగా విభజించారు. అవి..
ఎ) జ్ఞానాత్మక రంగం
బి) భావావేశ రంగం
సి) మానసిక చలనాత్మక రంగం
జ్ఞానాత్మక రంగంపై బెంజిమన్ బ్లూమ్, భావావేశ రంగంపై డేవిడ్.ఆర్. క్రాత్‌హాల్, మానసిక చలనాత్మక రంగంపై ఎలిబత్ సింప్సన్, ఆర్.హెచ్. దవే కృషి చేశారు.
జ్ఞానాత్మక రంగం మెదడుకు, భావావేశ రంగం హృదయానికి, మానసిక చలనా త్మక రంగం మనసుకు, శరీరానికి సంబం ధించినవి.
ఏ అంశం గురించి అయినా ఈ మూడు రంగాల్లో విద్యార్థులను అభివృద్ధి చేయాలి.
విజ్ఞాన శాస్త్రంలో లక్ష్యాలు - స్పష్టీకరణలు -వివరణలు
ఎ. జ్ఞాన రంగంలో లక్ష్యాలు:
  • జ్ఞప్తికి తెచ్చుకోవడం
  • గుర్తించడం

లక్ష్యం -I
1. జ్ఞప్తికి తెచ్చుకోవడం :
విద్యార్థి విజ్ఞానశాస్త్ర సంబంధమైన పదాలు, సత్యాలు, భావన లు, సూత్రాలు, నిర్వచనాలు, నియమాలు పద్ధతులు జ్ఞప్తికి తెచ్చుకొంటాడు.
ఉదా: చంద్ర గ్రహణం అంటే ఏమిటి?
2. గుర్తించడం: విద్యార్థి విజ్ఞానశాస్త్ర సం బంధమైన సత్యాలు, భావనలు, సూత్రా లు, నియమాలు, పద్ధతులు గుర్తిస్తాడు.
ఉదా: కుంభాకార, పుటాకార దర్పణాల్లో భేదాలను గుర్తించడం.
లక్ష్యం -II అవగాహన:
విద్యార్థి విజ్ఞానశాస్త్ర సంబంధమైన పదా లు, సత్యాలు, భావనలు మొదలైన వాటిని అవగాహన చేసుకుంటాడు.
స్పష్టీకరణలు:

  • భావనలు, నియమాలు, సూత్రాలకు ఉదాహరణలిస్తాడు.
    ఉదా: సజీవులకు ఉదాహరణనిస్తాడు.
  • వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను వివరిస్తాడు.
  • ఇచ్చిన వాక్యంలోని దోషాన్ని సవరించి సరిచేస్తాడు.
  • వివిధ భావనలు, సూత్రాలు నియమా లను సరి చేస్తాడు.
  • చిత్రపటాలకు, రేఖా పటాలకు, దత్తాంశాలకు వ్యాఖ్యానం రాస్తాడు.
  • విజ్ఞాన సూత్ర సత్యాలను, భావాలను వర్గీకరిస్తాడు.
  • సమస్యలను సాధిస్తాడు.
  • విజ్ఞానశాస్త్ర పరికరాలను, రసాయనాలను ఎంపిక చేసుకుంటాడు.
  • భౌతిక రాశులకు సరైన ప్రమాణాలు తెలుపుతాడు.
  • శాస్త్ర సత్యాలు, భావనలను, ప్రక్రియలను సరిపోల్చుతాడు.
లక్ష్యం - III వినియోగం:
విద్యార్థి తాను నేర్చుకున్న విజ్ఞానశాస్త్ర విజ్ఞానాన్ని పరిస్థితులకనుగుణంగా వినియోగిస్తాడు.
స్పష్టీకరణలు:
  • భావనలు, సూత్రాలు, నియమాలు మొదలైన వాటిని విశ్లేషిస్తాడు.
  • విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానాన్ని నేరుగా వినియోగిస్తారు.
  • శాస్త్ర ప్రక్రియలకు, దృగ్విషయాలకు కారణాలను తెలుపుతాడు.
  • కారణానికి, ఫలితానికి మధ్య సంబం ధాన్ని ఏర్పరుస్తాడు.
  • శాస్త్ర పరిశీలనలను వ్యాఖ్యానిస్తాడు.
  • సామాన్యీకరణలను ప్రతిపాదిస్తాడు.
  • సరైన ప్రయోగ విధానాలు, పరికరాలను సూచిస్తాడు.
  • ప్రాగుక్తీకరించగలడు.
  • దత్తాంశం ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు.

భావావేశ రంగం లక్ష్యాలు:
లక్ష్యం I:
శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి
లక్ష్యం II: అభిరుచి
లక్ష్యం III: అభినందన
మానసిక చలనాత్మక రంగ లక్ష్యాలు
లక్ష్యం I:
చిత్రలేఖన నైపుణ్యం
లక్ష్యం II: హస్త నైపుణ్యాలు
లక్ష్యం III: పరిశీలన నైపుణ్యాలు
లక్ష్యం IV: అభివ్యంజన నైపుణ్యాలు
లక్ష్యం V: నివేదన నైపుణ్యాలు

విజ్ఞాన శాస్త్రం- సహ సంబంధం
సహ సంబంధం ఆవశ్యకత:

  • జ్ఞానాన్ని సంయుక్తపరచడం
  • సమర్థవంతమైన అభ్యసనం
  • శ్రమ ఆదా
  • అభ్యసన బదలాయింపు
సహ సంబంధం- రకాలు:
  • సహజసిద్ధం
  • కృత్రిమ సహ సంబంధం
  • వ్యవస్థీకృత సహ సంబంధం
  • విజ్ఞానశాస్త్రానికి విద్యా ప్రణాళికలోని ఇతర పాఠ్యవిషయాలకు సంబంధం
  • విజ్ఞానశాస్త్రం- భాష
  • విజ్ఞానశాస్త్రం - చరిత్ర
  • విజ్ఞానశాస్త్రం - భౌగోళిక శాస్త్రం
  • విజ్ఞానశాస్త్రం- గణితం
  • విజ్ఞానశాస్త్రం - చిత్రలేఖనం
  • విజ్ఞాన శాస్త్రం - చేతిపని
  • విజ్ఞాన శాస్త్రం - దైనందిన జీవితానికి సంబంధం.
Images

గతంలో అడిగిన ప్రశ్నలు

  1. విద్యార్థులు చేసే ప్రయోగాలకు కావాల్సిన పరికరాలను, వస్తు సామగ్రిని వారే తయారుచేసుకోవడాన్ని సూచించే విలువ? (డీఎస్సీ2008)
    ఎ) క్రమశిక్షణ విలువ
    బి) ఉపయోగిత విలువ
    సి) సృజనాత్మక విలువ
    డి) వృత్తిపరమైన విలువ
  2. అవగాహనలో ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణం ఎక్స్‌ట్రాపొలేషన్‌కు ఉదాహరణ? (డీఎస్సీ2008)
    ఎ) కార్యనిర్వాహక సంబంధం తెలపడం
    బి) అన్వయం చేయడం, వర్ణించడం
    సి) పోల్చడం, తేడాలు చెప్పడం
    డి) ఒక పరిష్కారం నుంచి మరొక పరిష్కారానికి
  3. సామర్థ్యాలను స్పష్టీకరించడంలో ఒక మౌలికాంశం? (డీఎస్సీ2006)
    ఎ) అభ్యసన ఔచిత్యం
    బి) పరిస్థితులు
    సి) పరిసరాల అనుగుణ్యత
    డి) పాఠ్యాంశాలు
  4. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం? (డీఎస్సీ2006)
    ఎ) అనుకరణ, నిర్వహణ, సునిశితత్వం, సమన్వయం, స్వాభావీకరణం
    బి) అనుకరణ, ప్రతిస్పందన, విలువ, సమన్వయం, శీలస్థాపనం
    సి) గ్ర‌హించడం, నిర్వహణ, సునిశితత్వం, సమన్వయం, శంకుస్థాపన
    డి) గ్రహించడం, ప్రతిస్పందన, విలువ, సమన్వయం, స్వాభావీకరణం
  5. ఇందులో ఒకటి మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యం? (డీఎస్సీ2001)
    ఎ) పరిసరాల్లో ఉన్న వాటిపై ఆసక్తి ప్రదర్శించడం
    బి) శాస్త్ర సంబంధమైన భావనలు గుర్తించడం
    సి) పటాలు గీయడంలో నైపుణ్యం
    డి) శాస్త్ర జ్ఞానాన్ని వినియోగించడం
  6. మన ప్రకృతి సంపదను, వనరులను సద్వినియోగం చేసుకోవడం అనేది శాస్త్రపరంగా ఏ విలువను పెంపొందిస్తుంది? (డీఎస్సీ2001)
    ఎ) బౌద్ధిక విలువ
    బి) సౌందర్య విలువ
    సి) ఉపయోగిత విలువ
    డి) వృత్తి విలువ
  7. విద్యార్థి గడించిన సామర్ధ్యాలను సూచించేవి? (డీఎస్సీ2001)
    ఎ) ఉద్దేశాలు
    బి) లక్ష్యాలు
    సి) నైతిక విలువలు
    డి) స్పష్టీకరణలు
  8. విజ్ఞానశాస్త్రాన్ని ఇతర సబ్జెక్టులతో సహసంబంధం కలిగించడం? (డీఎస్సీ2000)
    ఎ) కష్టం
    బి) సులువు
    సి) ఇవేవీ కావు
    డి) మౌలికమైంది
  9. ప్రయోగాలు/ కృత్యాలు చేయడం దేనికి సంబంధించింది? (డీఎస్సీ2000)
    ఎ) అవగాహన
    బి) జ్ఞానం
    సి) నైపుణ్యం
    డి) అభినందన
  10. క్షేత్ర పర్యటన ఏ రంగంలోనిది? (డీఎస్సీ1998)
    ఎ) జ్ఞానాత్మక రంగం
    బి) మానసిక చలనాత్మక రంగం
    సి) భావావేశ రంగం
    డి) పైవేవీ కావు
  11. ‘విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనలను నమోదు చేయడం’ ఏ ముఖ్య లక్షణాన్ని సూచిస్తుంది? (డీఎస్సీ1994)
    ఎ) అవగాహన
    బి) వైఖరి
    సి) నైపుణ్యం
    డి) జ్ఞానం

సమాధానాలు

1) సి
2) ఎ 3) ఎ 4) ఎ 5) సి 6) సి 7) డి 8) డి 9) సి 10) సి 11) సి

మాదిరి ప్రశ్నలు

  1. విద్యా విషయక లక్ష్యాలను వర్గీకరించింది?
    ఎ) R.C. రాస్
    బి) C.P.S. నాయర్
    సి) బ్లూమ్
    డి) స్మిత్
  2. ఎక్స్‌ట్రాపొలేషన్ దేనికి సంబంధించింది?
    ఎ) అనునాదం
    బి) అవగాహన
    సి) పరికల్పన
    డి) హేతుకీకరణ
  3. 'Taxonomy of Educational Objectives'.. ఎవరి రచన?
    ఎ) బ్లూమ్
    బి) థార్నడైక్
    సి) అరిస్టాటిల్
    డి) గాగ్నే
  4. ఎత్తుకు, గురుత్వ త్వరణానికి సంబంధం తెలపడం ______
    ఎ) వినియోగం
    బి) జ్ఞానం
    సి) అవగాహన
    డి) సంశ్లేషణ
  5. బొమ్మలు గీయడం ఏ రంగానికి చెందింది?
    ఎ) భావావేశ
    బి) జ్ఞానాత్మక
    సి) మానసిక చలనాత్మక
    డి) ఏదీకాదు
  6. భావావేశ రంగాన్ని వివరించినవారు?
    ఎ) గేట్స్
    బి) విలియమ్స్
    సి) క్రాత్‌హాల్
    డి) బ్లూమ్

సమాధానాలు

1) సి 2) బి 3) ఎ 4) సి 5) సి 6) సి
Published date : 28 Jan 2015 12:02PM

Photo Stories