తృతీయ భూస్వరూపాలు
Sakshi Education
1. రెండు భూభాగాలని కలుపుతూ రెండు జలభాగాలను వేరు చేసే సన్నని భూభాగం?
జ. భూసంధి
2. భూసంధులకు ఉదాహరణలు?
జ. పనామా, సూయజ్
3. ఒక భూభాగపు చివరికొన సముద్రంలోకి చొచ్చుకొని పోయినట్లు ఉంటే దాన్ని ఏమంటారు?
జ. అగ్రం
4. ఆఫ్రికా ఖండపు దక్షిణపు చివరి కొన?
జ. గుడ్‌హోప్ అగ్రం
5. భారతదేశానికి దక్షిణ సరిహద్దు?
జ. కన్యాకుమారి అగ్రం
6. అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో ఏ రకమైన భూస్వరూపం ఏర్పడుతుంది?
జ. ఎడారి
7. సముద్రానికి ఆనుకొని ఉండే భూభాగం?
జ. తీరం
8. సన్నని లోతైన భూతలాన్ని ఏమంటారు?
జ. లోయలు
9. భూ అంతర్భాగంలోని బలాల వల్ల భూపటలంపైన ఉన్న రెండు సమాంతరభ్రంశాల మధ్య ఉన్న భూభాగం కిందికి జారిపోవడంతో ఏర్పడ్డ భూభాగాన్ని ఏమంటారు?
జ. పగులు లోయ
10. భారతదేశంలో పగులు లోయలో ప్రవహించే నదులు?
జ. నర్మద, తపతి
11. నదీ ప్రవాహం వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడ్డ లోతైన లోయను ఏమంటారు?
జ. అగాధదరి
12. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అగాధ దరి
జ. అమెరికాలోని కొలరాడో
13. నదీ ప్రవాహ జలం ఎత్తై ప్రాంతం నుంచి అగాధదరి కిందకు పడే ప్రదేశాన్ని ఏమంటారు?
జ. జలపాతం
14. నయగారా జలపాతం ఏ ఖండంలో ఉంది?
జ. ఉత్తర అమెరికా
15. నదులు సముద్రంలో కలిసే ప్రాంతం?
జ. నదీ ముఖద్వారం
16. నదీ ముఖద్వారం వద్ద సముద్రాన్ని కలిసే ముందు నది రెండు లేక మూడు పాయలుగా చీలినపుడు ఆ పాయల మధ్య ఉండే ప్రాంతం?
జ. డెల్టా
17. కృష్ణా, గోదావరి డెల్టాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
జ. ఆంధ్రప్రదేశ్
18. ఖండ అంతర్భాగంలో ఉన్న నదీ జల భాగాన్ని ఏమంటారు?
జ. సరస్సు
19. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన సరస్సు?
జ. కొల్లేటి సరస్సు
20. రవాణా, నీటి పారుదలకు తవ్వి కృత్రిమంగా ఏర్పాటు చేసిన జలమార్గం?
జ. కాలువ
21. సూయజ్ కాలువ వేటిని కలుపుతుంది?
జ. ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం
22. సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందిన అర్థచంద్రాకార భూస్వరూపాన్ని ఏమంటారు?
జ. అఖాతం
23. రెండు విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ, రెండు విశాల భూభాగాలను వేరు చేసే సన్నని సముద్ర భాగాన్ని ఏమంటారు?
జ. జలసంధి
24. ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని ఏమంటారు?
జ. సింధు శాఖ
25. సముద్ర అంతర్భాగంలో భూతలంపై ఉండే పర్వత శిఖరాన్ని ఏమంటారు?
జ. రిడ్‌జ
26. మన్నార్ సింధుశాఖ ఏ దేశాల మధ్య ఉంది?
జ. భారత్, శ్రీలంక
27. అట్లాంటిక్ మహాసముద్రంలోని రిడ్‌జ
జ. మిడ్ ఓషనిక్ రిడ్‌జ

Published date : 16 Mar 2012 06:05PM