Skip to main content

ద్వితీయ భూస్వరూపాలు

1. భూమి ఉపరితలంలోని భూభాగాన్ని ప్రధానంగా ఏ విధంగా విభజించారు?
జ. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు

2. సముద్రమట్టం నుంచి సుమారు 800 మీ. కన్నా ఎత్తుగా ఉండి, వాలు ఎక్కువగా ఉండే భూస్వరూపాన్ని ఏమంటారు?
జ. పర్వతం

3. ఆల్ఫ్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?
జ. ఐరోపా

4. అట్లాస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?
జ. ఆఫ్రికా

5. భూఅంతర్భాగంలో సంపీడన బలాలు పని చేయడం వల్ల ఏర్పడే పర్వతాలు?
జ. ముడుత పర్వతాలు

6. ముడుత పర్వతాలకు ఉదాహరణ?
జ. ఆసియాలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో ఆండిస్, ఉత్తర అమెరికాలో రాకీ

7. భూఅంతర్భాగంలో విరూపకారక చర్యల వల్ల విశాల భూభాగం నిలువునా చీలిపోయి మధ్య ప్రాంతం లోపలికి కుచించుకుపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు?
జ. ఖండ పర్వతాలు

8. ఖండ పర్వతాలపై ఉన్న భూభాగాన్ని ఏమంటారు?
జ. భ్రంశోద్ధి శిలా విన్యాసం

9. ఖండ పర్వతాల్లో లోపలికి కుచించుకుపోయిన భాగాన్ని ఏమంటారు?
జ. గ్రేబెల్

10. భూఅంతర్భాగం నుంచి లావా బయటకు ప్రవహించి భూమి ఉపరితలంపై విస్తరించడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు?
జ. అగ్ని పర్వతాలు

11. కిలిమంజారో అగ్ని పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
జ. మధ్య ఆఫ్రికా

12. ఇటలీలోని ప్రముఖ అగ్ని పర్వతం?
జ. వెసూవియస్

13. ప్యూజియామా అగ్ని పర్వతం ఎక్కడ ఉంది?
జ. జపాన్

14. పీఠభూమి అంచుల్లో ఏర్పడ్డ అగ్ని పర్వతాలకు ఉదాహరణ?
జ. ఆగ్నేయ ఆఫ్రికాలోని డ్రాకన్‌‌సబర్‌‌గ పర్వతాలు, ఇండియాలోని వింధ్య సాత్పూర పర్వతాలు

15. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం చాలా ఎత్తుగా ఉన్న పర్వతాలు క్రమేణా వికోషీకరణం చెంది ఎత్తును, పరిమాణాన్ని కోల్పోగా మిగిలిన పర్వతభాగాన్ని ఏమంటారు?
జ. అవశిష్ట పర్వతం

16. అవశిష్ట పర్వతానికి మంచి ఉదాహరణ?
జ. భారతదేశంలోని ఆరావళి పర్వతాలు

17. సముద్ర మట్టం నుంచి చాలా ఎత్తులో ఉండి కొద్దిపాటి ఎత్తు పల్లాలతో ఇంచుమించు సమతల ఉపరితలం గల భూస్వరూపం?
జ. పీఠభూమి

18. పర్వతాలతో పరివేష్టితమై ఉన్న పీఠభూముల్ని ఏమంటారు?
జ. పర్వతాంతర పీఠభూములు

19. ఏ రకమైన పీఠభూములు మిగతా వాటి కంటే చాలా ఎత్తులో ఉంటాయి?
జ. పర్వతాంతర పీఠభూములు

20. పర్వతాంతర పీఠభూములకు మంచి ఉదాహరణ?
జ. హిమాలయాలకు ఉత్తరంగా ఉన్న టిబెట్ పీఠభూమి, దక్షిణ అమెరికాలోని బొలీవియా పీఠభూమి

21. పర్వతాల దిగువున వాటి పాదాల దగ్గర ఏర్పడే పీఠభూములు?
జ. పర్వత పాద పీఠభూములు

22. పర్వత పాద పీఠభూములకు ఓవైపు పర్వతాలుంటే మరోవైపు ఉండేవి?
జ. మైదానాలు (లేక) సముద్రాలు

23. భూమి అంతర్భాగంలో జనించే ఊర్ద్వ బలాల వల్ల పైకి తన్నుకురావడం వల్ల ఏర్పడ్డ పీఠభూములు?
జ. పర్వత పాద పీఠభూములు

24. పర్వత పాద పీఠభూములకు మంచి ఉదాహరణ?
జ. భారతదేశంలోని దక్కన్ పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి

25. తక్కువ వాలును కలిగి సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండే పీఠభూమి?
జ. ఖండాంతర పీఠభూమి

26. ఖండాంతర పీఠభూమికి మంచి ఉదాహరణ?
జ. ఉత్తర అమెరికాలోని అపలేషియన్ పీఠభూమి

27. సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండి ఉపరితలం సమతలంగా ఉన్న భూభాగం?
జ. మైదానం

28. సముద్రమట్టాన్ని ఆనుకొని ఉన్న మైదానాలు?
జ. తీర మైదానాలు

29. తీర మైదానాలకు మంచి ఉదాహరణ?
జ. భారతదేశంలోని తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం

30. గాలి, నీరు, హిమానీ నదాల కోతకు గురై ఎత్తు తగ్గడం వల్ల ఏర్పడ్డ మైదానాలు?
జ. కోత మైదానాలు

31. కోత మైదానాలకు మంచి ఉదాహరణ?
జ. కెనడాలోని షీల్డు, రష్యాలోని పశ్చిమ సైబీరియా

32. గాలి, నదులు, హిమానీ నదాల ద్వారా మోసుకొనిపోయిన ఒండ్రుమట్టి, ఇసుక,గుళక రాళ్లతో ఏర్పడిన మైదానాలు?
జ. నిక్షేపిత మైదానాలు.

33. నిక్షేపిత మైదానానికి మంచి ఉదాహరణ?
జ. భారతదేశంలోని గంగా సట్లెజ్ మైదానం
Published date : 16 Mar 2012 06:03PM

Photo Stories