Skip to main content

భూమి - ఆవిర్భావం

1. గ్రహాల ఆవిర్భావాన్ని తెలుసుకోవడానికి కృషి చేసిన వారిలో ముఖ్యులు?
జ. టి.సి. చాంబర్లీన్, ఇమాన్యుయల్ కాంట్, ఎఫ్.ఆర్. మౌల్టన్

2. విశ్వం ఆవిర్భావంలో శీతలంగా, చలనం లేకుండా ఉన్న వాయువులు, దుమ్ము కణాలు ఒకదానితోఒకటి ఢీకొని ఉష్ణం ఉద్భవించింది. ఈ విశాలమైన వేడి వాయువులతో ఉన్న దానిని ఏమని పిలిచారు?
జ. నీహారిక

3. ‘‘నీహారిక అతి వేగంగా తిరగడం వల్ల ఏర్పడే అపకేంద్ర బలానికి దానిలోని వాయువులు క్రమంగా, వలయాలుగా విడిపోయి, క్రమేపి ఘనీభవించిన గ్రహాలుగా ఏర్పడ్డాయి’’ అని భావించింది ఎవరు?
జ. ఇమాన్యుయల్ కాంట్

4. గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని రూపొందించింది?
జ. టి.సి. చాంబర్లీన్, ఎఫ్.ఆర్.మౌల్టన్

5. సౌర కుటుంబం పుట్టుకపై వచ్చిన సిద్ధాంతాల్లో అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతం?
జ. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం

6. ‘విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం’ను ప్రతిపాదించింది?
జ. జార్జెస్ అబె లిమిటియర్
Published date : 16 Mar 2012 05:44PM

Photo Stories