Skip to main content

కేవీపీవై ఫెలోషిప్‌– 2021.. దరఖాస్తు వివరాలు ఇలా..

కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన (కేవీపీవై).. ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి భారత సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం దరఖాస్తులు కోరుతోంది.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ),బెంగళూరు.. కేవీపీవై 2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాఠశాల, కళాశాల విద్యార్థులను బేసిక్‌ సైన్సెస్‌లో పరిశోధనల వైపు ప్రోత్సహించడం ఈ ఫెలోషిప్‌ ముఖ్య ఉద్దేశం.

పరీక్ష: కేవీపీవై ఫెలోషిప్‌–2021
ఆర్థిక ప్రోత్సాహం: యూజీ స్థాయిలో నెలకు రూ. 5000తోపాటు కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ. 20,000 అందిస్తారు. పీజీ స్థాయిలో నెలకు రూ. 7000తోపాటు కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ. 28,000 చెల్లిస్తారు.
కాల వ్యవధి: ప్రీ పీహెచ్‌డీ స్థాయి వరకూ లేదా ఐదేళ్లు.. ఈ రెండింటిలో ఏది ముందయితే అంతవరకూ ఈ ఫెలోషిప్‌ లభిస్తుంది.

విభాగాలు: స్ట్రీమ్‌ ఎస్‌ఏ, స్ట్రీమ్‌ ఎస్‌ఎక్స్, స్ట్రీమ్‌ ఎస్‌బీ.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ప్రస్తుతం(2021–22) ఇంటర్మీడియెట్‌ ప్రథమ/ద్వితీయ, డిగ్రీ/ఇంటిగ్రేటెడ్‌ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు.

ఎంపిక విధానం: కేవీపీవై అప్టిట్యూడ్‌ టెస్ట్, ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
కేవీపీవై పరీక్ష తేది: 07.11.2021

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://kvpy.iisc.ac.in/main/about.htm

Photo Stories