గూడ్‌న్యూస్: ఏపీ ఎస్సై/కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్
Sakshi Education
▶ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21వ తేదీన టాలెంట్ టెస్టు <br/>
▶ ఎంపికైన అభ్యర్థులకు ఒకే ప్రాంగణంలో క్లాసులు, గ్రౌండ్, హాస్టల్ సౌకర్యం<br/>
▶ మీ సొంత జిల్లా కేంద్రంలోనే పరీక్ష కేంద్రం
సాక్షి, ఎడ్యుకేషన్: ప్రముఖ కోచింగ్ సంస్థ iRise అకాడమీ వారు ఆంధ్రప్రదేశ్ ఎస్సై/కానిస్టేబుల్ ప్రిపేరయ్యే అభ్యుర్థులకు ఒక అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ అకాడమీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో మార్చి 21వ తేదీ(ఆదివారం) టాలెంట్ టెస్టు నిర్వహించనున్నారు. ఈ టెస్టు నందు ఎంపికైన మొదటి 100 ర్యాంకుల అభ్యర్థులకు ఉచితంగా ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ టెస్టు ద్వారా మొదటి 200 మందిని మాత్రమే ఎంపిక చేసి, వారికి అసలైన పరీక్షా విధానంలో 6 నుంచి 9 నెలలు ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వబడును. ఇలా ఎంపికైన అభ్యర్థుల కోసం ఒకే ప్రాంగణంలో క్లాసులు, గ్రౌండ్ సౌకర్యం కలదు. అలాగే హాస్టల్ సౌకర్యం కూడా ఇవ్వనున్నారు. ఈ టాలెంట్ టెస్టు రాయడానికి ఆసక్తి గల అభ్యుర్థులు తమ పేరు, మొబైల్ నెంబర్, పరీక్ష రాయదలచిన జిల్లా కేంద్రాన్ని 9985560325 నెంబర్‌కు వాట్సప్ లేదా SMS ద్వారా నమోదు చేసుకొనవలెను.
Published date : 17 Mar 2021 05:53PM