Free Internship Opportunity: నాస్కామ్ ఉచిత ఇంటర్న్‌షిప్ అవకాశం అప్లై చేసుకోండిలా..
Sakshi Education
మద్దిలపాలెం: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ మరియు డిగ్రీ చదువుతున్న 50,000 మంది విద్యార్థులకు ఉచిత ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పించేందుకు నాస్కామ్ ఆధ్వర్యంలో ఫ్రీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభమవుతోంది.
Free Internship Opportunity
మంగళవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం, ఏయూ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ మాట్లాడారు.
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ నాస్కామ్ సహకారంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.
విద్యార్థులు జూన్ 7 లోపు ఉన్నత విద్యా మండలి అధికారిక పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 90526 56967 నంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ రీజినల్ హెడ్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.