గతేడాది ఇంటర్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల ఒక సంవత్సరం చదువు ఆగిపోయింది. ఇప్పుడు డి.ఎడ్ పూర్తి చేసి... ఉపాధ్యాయ...
Question
గతేడాది ఇంటర్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల ఒక సంవత్సరం చదువు ఆగిపోయింది. ఇప్పుడు డి.ఎడ్ పూర్తి చేసి... ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకుంటున్నాను. జాబ్ చేసుకుంటూ ఉన్నత విద్య అభ్యసించే వీలుందా?
మీరు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డి.ఎడ్) చేయొచ్చు. డి.ఎడ్‌కు అర్హత ఇంటర్. 17 ఏళ్లు పూర్తయి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా డైట్‌లో ప్రవేశం కల్పిస్తారు.
డి.ఎడ్ పూర్తిచేసిన వారు రాష్ట ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్ష రాసి, ఎస్‌జీటీగా పని చేయొచ్చు. దీంతోపాటు ఉన్నతవిద్య అభ్యసించే వీలుంది. డిస్టెన్స్‌లో బ్యాచ్‌లర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును అనేక విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రభుత్వ గుర్తింపుపొందిన ఏదైనా పాఠశాలలో కనీసం రెండేళ్ల బోధనానుభవం అవసరం. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)తోపాటు మన రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఈ విధానంలో బీఎడ్ కోర్సును అందిస్తున్నాయి.