Skip to main content

ఎంఏ (హిందీ)తో హిందీ ప్రవీణ పూర్తి చేశాను. ఇపుడు హిందీలో బీఈడీ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్‌ చేసే విశ్వవిద్యాలయాల...

Question
ఎంఏ (హిందీ)తో హిందీ ప్రవీణ పూర్తి చేశాను. ఇపుడు హిందీలో బీఈడీ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్‌ చేసే విశ్వవిద్యాలయాల గురించి వివరించగలరు?
హిమాచల్‌ ప్రదేశ్‌ యూనివర్సిటీ (సిమ్లా) (www.hpuniv.nic.in/icdeol.htm), పంజాబ్‌ యూనివర్సిటీ (పాటియాల) (www.dccpbi.com/courses.html), కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర) (www.kukinfo.com/dcc2008/1.pdf) లు హిందీ బీఈడీ కోర్సును దూరవిద్యలో అందిస్తున్నాయి.
ఇక రెగ్యులర్‌ విధానంలో ఆఫర్‌ చేసే విద్యా సంస్థల విషయానికి వస్తే...
హిందీ బీఈడీ కోర్సును అందించే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇమాన్యూల్‌ కాలేజ్‌ ఆఫ్‌ బీఈడీ ఒకటి. కేరళలోని వాజీచల్‌ వద్ద ఉంది. కోర్సును శాస్ర్తీయ దృక్పథంతో రూపొందించి అందిస్తున్నారు. నాలుగు సెమిస్టర్లుగా బోధిస్తారు. మూస విధానాన్ని అనుసరించకుండా హిందీ బోధనలో అనుసరించాల్సిన విభిన్న ఆధునిక ప్రక్రియలను నేర్పిస్తారు. విద్యార్థులకు హిందీ బోధన, భాషా నైపుణ్యాలు, సంభాషణా చాతుర్యం వంటివి సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాల్సిన మెళకువలను శిక్షణ తీసుకునే అభ్యర్థులకు వివరిస్తారు. ఈ కాలేజీకి కేరళ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.
వెబ్‌సైట్‌ : www.emmanuelbed.in/courses

Photo Stories