డెఫ్ అండ్ డమ్(చెవిటి, మూగ) విద్యార్థులకు టీచింగ్ చేసే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న...
Question
డెఫ్ అండ్ డమ్(చెవిటి, మూగ) విద్యార్థులకు టీచింగ్ చేసే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టి, వినికిడి, బుద్ధి మాంద్యం గల పిల్లలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ నిచ్చేందుకు ఎంఈడీ(స్పెషల్‌ఎడ్యుకేషన్) కోర్సును నిర్వహిస్తోంది.
అర్హత: సంబంధిత అంశంలో 50 శాతం మార్కులతో బీఈడీ (స్పెషల్‌ఎడ్యుకేషన్) లేదా బీఈడీ (జనరల్)తోపాటు సంబంధిత అంశంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా.
వెబ్‌సైట్: www.rehabcouncil.nic.in
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)ను ఆఫర్ చేస్తోంది. అర్హత: 50 శాతం మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బీఈడీ(జనరల్)తోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఏడాది కోర్సు చేసి ఉండాలి.
వెబ్‌సైట్: https://jmi.nic.in
మధ్యప్రదేశ్‌కు చెందిన భోజ్ యూనివర్సిటీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను దూర విద్యా విధానంలో ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.bhojvirtualuniversity.com
ఈ కోర్సులను పూర్తి చేసిన వారు వివిధ రకాల వైకల్యాలతో బాధపడే పిల్లలకు వారికి కావాల్సిన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి రిహాబిలిటేషన్ సెంటర్లు, కమ్యూనిటీ కేర్ సెంటర్లు, ఆస్పత్రులు, ఎన్‌జీఓస్‌తోపాటు కొన్ని రకాల ప్రభుత్వ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.