బీఈడీ పూర్తి చేశా. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్నా. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఏకోర్సు ఎంచుకోవాలి?
Question
బీఈడీ పూర్తి చేశా. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్నా. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఏకోర్సు ఎంచుకోవాలి?
బీఈడీ పూర్తి చేశారు. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్నారు కాబట్టి.. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఎంఎస్సీ ఎంచుకోవడం లాభిస్తుంది. ఎంఎస్సీ కోర్సు చేయడం వల్ల టీచింగ్ చేసే సబ్జెక్ట్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ థియరీస్, కాన్సెప్ట్స్, టాపిక్స్‌ను అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. దీనివల్ల సబ్జెక్ట్‌పై మరింత పట్టు లభించడమేకాకుండా... విద్యార్థులకు మరింత అవగాహనతో పాఠాలు చెప్పే వీలుంటుంది. ముఖ్యంగా ఈ అంశం టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్న మీలాంటి వారికి కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇతోధికంగా దోహదపడుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి ఎంఈడీని చేయవచ్చు. ఎంఈడీ చేయడం వల్ల టీచింగ్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీలును బట్టి ఈ కోర్సు ను రెగ్యులర్/డిస్టెన్స్ రెండు విధాలుగా చేయవచ్చు.
మన రాష్ట్రంలో ఎంఈడీని రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in
మన రాష్ట్రంలో ఎంఈడీని రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in