Skip to main content

PSLV-C61: మే 18వ తేదీ రీశాట్‌-1బి ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి మే 18వ తేదీ ఉదయం 6.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి61 వాహకనౌకను ప్రయోగించనుంది.
ISRO satellite launch with PSLV-C61  Satellite launching into orbit from Satish Dhawan Space Centre   EOS-09 satellite set to be launched on May 18   PSLV-C61 launch vehicle at Satish Dhawan Space Centre

ఈ ప్రయోగం ద్వారా 1,710 కేజీల బరువు కలిగిన ఈవోఎస్‌-09 (రీశాట్‌-1బి) ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం సీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్‌ను కలిగి ఉండి, భూభాగాన్ని మరియు సరిహద్దులను నిశితంగా పరిశీలించగలదు. ఇది రక్షణ శాఖకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని అందించనుంది. రీశాట్ సిరీస్‌లో ఇది ఏడవ ఉపగ్రహం.

పీఎస్‌ఎల్‌వీ-సి61 వాహకనౌకను ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీ(పీఐఎఫ్‌)లో మూడు దశల్లో అనుసంధానించి, ఈ నెల 2న మొదటి రాకెట్ ప్రయోగ వేదికకు తరలించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత, నాల్గవ దశతో పాటు ఉపగ్రహాన్ని కూడా అనుసంధానించారు.

Dogfights: అంతరిక్షంలో 'డాగ్ ఫైట్స్‌'.. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో ఇస్రో విన్యాసాలు

Published date : 12 May 2025 11:55AM

Photo Stories