Skip to main content

Dogfights: అంతరిక్షంలో 'డాగ్ ఫైట్స్‌'.. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో ఇస్రో విన్యాసాలు

ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో అంతరిక్షంలో డాకింగ్ (అనుసంధానం), అన్ డాకింగ్ (విడతీత) ప్రయోగాలను విజయవంతం చేసి సత్తా చాటిన ఇస్రో మరో ఘనత సాధించింది.
Indian Satellites Practising Dogfights In Space   ISRO completes first-ever dogfight exercise in space

అంతరిక్షంలో తొలిసారిగా డాగ్‌ఫైట్ విన్యాసాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. యుద్ధవిమానాలు శత్రు ఫైటర్ జెట్ను కూల్చేందుకు వాటిని వెంబడిం చే విన్యాసాలను డాగ్ ఫైట్ అంటారు. శత్రు విమానం నుంచి దూసుకొచ్చే క్షిపణి నుంచి తప్పించుకునేందుకు గింగిరాలు తిరగడం వం టివన్నీ దాని కోవలోకే వస్తాయి. 

ఇస్రో తొలిసారిగా.. రేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో ఈ ఫీట్ చేసింది. ఆవిప్పుడు భూమి నుంచి 500 కి.మీ. ఎత్తులో గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. అంటే సాధారణ పౌరవిమానం కంటే 28 రెట్లు ఎక్కువ. తూటా కంటే 10 రెట్లు ఎక్కువ. అంత వేగంగా తిరుగుతున్న ఉపగ్రహాలను అత్యంత సమన్వయంతో పని చేయించి డాగ్ ఫైట్ విన్యాసాన్ని పూర్తి చేసినట్టు ఇస్రో ప్రకటించింది. 

ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. "మిషన్ పూర్తయిన తర్వాత కూడా ఉపగ్రహాల్లో సగం ఇంధనం మిగిలి ఉంది. కేవలం 2.5 కిలోల ఇంధనంతో ఇలాంటి క్లిష్టమైన మిషన్‌ను పొడిగించగలగడం భారత్ సాంకేతిక ప్రావీణ్యానికి నిదర్శనం" అని అన్నారు.

ఒక ఉపగ్రహం చుట్టూ మరో ఉప గ్రహం తిరిగేలా (పరిక్రమ) చూసే ప్రక్రియను కూడా డాగ్‌ఫైట్‌కు కొద్దిరోజుల ముందే ఇస్రో పూర్తి చేసింది.

Nuclear Power Plant: చంద్రుడిపై చైనా, రష్యా అణు విద్యుత్ కేంద్రం

Published date : 06 May 2025 08:50AM

Photo Stories