Telangana: ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఉద్దేశం?
తెలంగాణ రాష్ట్ర శాసనసభ అక్టోబర్ 1న నాలుగు బిల్లులను ఆమోదించింది. బిల్లుల వివరాలు ఇలా...
1. గృహ నిర్మాణ మండలిని రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా గుర్తించడంతోపాటు ముగ్గురు సభ్యులను నామినేట్ చేసేలా సవరించిన తెలంగాణ గృహ నిర్మాణమండలి (సవరణ) బిల్లు–2021ను గృహ నిర్మాణమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదించింది.
2. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌ఆర్‌ఐ), హార్టీకల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల అనుబంధాన్ని అనుమతించేందుకు ఉద్దేశించిన ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు– 2021కు సభ ఆమోదం తెలిపింది.
3. జాతీయ న్యాయ శాస్త్ర అధ్యయనాలు, పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయం (నల్సార్)లో తెలంగాణ విద్యార్థుల కోటాను 20 నుంచి 25 శాతానికి పెంచడంతోపాటు ఈ 25 శాతం కోటాలో బీసీలు, ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించే నల్సార్ సవరణ బిల్లు–2021కు సైతం శాసనసభ ఆమోదం తెలిపింది.
4. కొత్త గ్రామాల ఏర్పాటు, ఏదైనా గ్రామం విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం, పేరు, హద్దుల మార్పునకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది.
చదవండి: తెలంగాణ హరిత నిధి ఏర్పాటు ముఖ్య ఉద్దేశం?