ఫిబ్రవరి 2020 రాష్ట్రీయం
Sakshi Education
మహారాష్ట్రలోనూ దిశ చట్టం: మహారాష్ట్ర హోంమంత్రి
మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి మరణ శాసనం లిఖించేలా, 21 పనిదినాల్లోనే తీర్పు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-2019’ అద్భుత శాసన నిర్ణయమని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. దిశ తరహాలో మహారాష్ట్రలోనూ చట్టం తెస్తామని ప్రకటించారు. దిశ బిల్లుపై అధ్యయనం కోసం ఏపీలో పర్యటించిన సందర్భంగా అనిల్ ఈ మేరకు ప్రకటించారు. అనిల్ నేతృత్వంలోని మహారాష్ట్ర అధికారుల బృందం ఫిబ్రవరి 20న అమరావతికి వచ్చింది. సచివాలయంలో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితర అధికారులతో సమావేశమైంది. దిశ అమలు తీరును ఆ బృందం అడిగి తెలుసుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనూ అనిల్ సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్రలోనూ దిశ తరహా చట్టం
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్
ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణలపై ఆర్డినెన్స్
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994కు సవరణలు చేస్తూ ఇటీవలి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఫిబ్రవరి 20న రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించటానికి, సంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసింది. ఈ సవరణలో గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలే ప్రధాన అంశంగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణలపై ఆర్డినెన్స్
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలు తెచ్చేందుకు
కృష్ణా, గోదావరి కెనాల్స్ వెబ్‌సైట్ ప్రారంభం
మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్ అంశానికి సంబంధించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 19న ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ... మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్ ద్వారా కాలుష్యానికి గురైన కాలువలను కాలుష్య రహితంగా తీర్చిదిద్ది ఆధునికీకరించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సాగు, తాగుకు స్వచ్ఛమైన నీటిని అందించడమే ఈ మిషన్ లక్ష్యమని.. కృష్టా, గోదావరి నదులపై ఉన్న నగర, గ్రామీణ ప్రాంతాల్లోని కాలువలను శుద్ధి చేయడమే లక్ష్యంగా పనులు చేయాలని అధికారులకు సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్ వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : కాలుష్యానికి గురైన కాలువలను కాలుష్య రహితంగా తీర్చిదిద్ది ఆధునికీకరించేందుకు
పక్షుల సంరక్షణపై ఏపీ అటవీ శాఖ ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లోని వలస పక్షుల ఆవాస కేంద్రాల అభివృద్ధి, అంతరించిపోతున్న మత్స్యజాతుల జాబితాల్లోని వేల్‌షార్క్ సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఇటీవల జరిగిన ‘కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేరీ స్పీసెస్- 13వ సదస్సు (సీఎంఎస్-కాప్ 13)’లో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్), వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ)లతో ఈ ఒప్పందాలను చేసుకుంది. అటవీ శాఖ తరఫున రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ విభాగం పీసీసీఎఫ్ డి.నళిన్ మోహన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వలస పక్షుల ఆవాస కేంద్రాలను గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకోవడం కోసం బీఎన్‌హెచ్‌ఎస్‌తో, రాష్ట్రంలోని తీర ప్రాంతం పొడవునా వేల్ షార్క్‌ల సంరక్షణ కోసం డబ్ల్యూటీఐతో అటవీ శాఖ ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పక్షుల సంరక్షణపై బీఎన్‌హెచ్‌ఎస్‌తో ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ
ఎందుకు : వలస పక్షుల ఆవాస కేంద్రాలను గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకోవడం కోసం
తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం
పట్టణాల్లో సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, పచ్చదనమే ప్రధాన ఉద్దేశంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘పట్టణ ప్రగతి కార్యక్రమం’ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 128 పురపాలక సంఘాలు, 12 నగరపాలక సంస్థల్లో (హైదరాబాద్ మినహా) అన్ని వార్డులు, డివిజన్లలోనూ ఫిబ్రవరి 24న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజున రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డులు, డివిజన్లలో పాదయాత్రలు చేసి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ వ్యాప్తంగా
ఎందుకు : పట్టణాల్లో సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, పచ్చదనమే ప్రధాన లక్ష్యంగా
ఏపీలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం
ఏడాదికి రెండున్నర లక్షలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ‘జగనన్న వసతి దీవెన పథకం’ ప్రారంభమైంది. విజయనగరంలోని అయోధ్య మైదానంలో ఫిబ్రవరి 24న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు, భావి తరాల తలరాతలు మారుతాయని అన్నారు. అక్షరాల 11 లక్షల 87 వేల మంది పిల్లలకు ఈ రోజు ఒక బటన్ నొక్కిన వెంటనే ఆ తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ.1,100 కోట్లు నేరుగా పడుతుందని పేర్కొన్నారు.
సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు
ఏమిటి : పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని తీర్మానం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : తెలంగాణ రాష్ట్ర కేబినెట్
బయాలాజికల్-ఇ నూతన ప్లాంటు ప్రారంభం
ఔషధ రంగ సంస్థ బయాలాజికల్-ఇ (బీఈ) లిమిటెడ్ హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట వద్ద ఉన్న జీనోమ్ వ్యాలీ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో నూతన ప్లాంటును ఏర్పాటు చేసింది. 29 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ.300 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఫిబ్రవరి 17న ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ రూపొందించిన టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
సింజీన్ ఆర్‌అండ్‌డీ సెంటర్ ప్రారంభం
కాంట్రాక్ట్ రీసెర్చ్ సేవల్లో ఉన్న సింజీన్ ఇంటర్నేషనల్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన కొత్త పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా కేటీఆర్ ప్రారంభించారు. తొలి దశలో 52,000 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బయాలాజికల్-ఇ నూతన ప్లాంటు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : జీనోమ్ వ్యాలీ స్పెషల్ ఎకనమిక్ జోన్, శామీర్‌పేట, హైదరాబాద్
17వ బయో ఆసియా సదస్సు ప్రారంభం
ఆరోగ్య రంగంలోని సవాళ్లకు పరిష్కారం కనుగొనడంపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఫిబ్రవరి 17న 17వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. సుమారు 37 దేశాల నుంచి 2 వేల మంది సభ్యులు హాజరైన ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైద్యం తీరుతెన్నులు మారిపోతున్న ఈ ఆధునిక కాలానికి తగ్గ చికిత్స విధానాలపై పరిశోధనలు చేసే ఓ అంతర్జాతీయ స్థాయి సంస్థ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన ప్రకటించారు. కణ, జన్యుస్థాయి చికిత్సలపై పరిశోధనలు చేపట్టే ఈ సంస్థను నిర్మించడంలో ప్రభుత్వం సీసీఎంబీ సహాయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 19 వరకు జరగనున్న ఈ సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్‌తో పాటు అసోం, కేరళ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామ్యం వహిస్తున్నాయి.
బయో ఆసియా సదస్సు 2020 థీమ్: టుడే ఫర్ టుమారో
కార్ల్ జూన్‌కు ఎక్సలెన్సీ అవార్డు..
శరీర రోగ నిరోధక కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా కేన్సర్‌కు చికిత్స అందించే ఇమ్యూనోథెరపీని అభివృద్ధి చేసిన అమెరికన్ శాస్త్రవేత్త, పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కార్ల్ జూన్‌కు 2020 బయో ఆసియా జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. జీవశాస్త్ర రంగంలో విశేష కృషి జరిపిన వారికి ఈ అవార్డు ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 17వ బయో ఆసియా సదస్సు ప్రారంభం

ఎక్కడ : హెచ్‌ఐసీసీ, హైదరాబాద్
భారత్‌లో తొలి గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, కంప్యూటర్ విజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల కోసం భారత్‌లో తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ‘ఇమేజ్’ పేరుతో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) దీనిని నెలకొల్పింది. ఈ రంగాల్లో మేధో సంపత్తిపై దృష్టిసారించిన కంపెనీలకు ఇది తొలి ఇంక్యు బేషన్ సెంటర్ కావడం విశేషం. ఎస్‌టీపీఐ ఫెసిలిటీలో 10,000 చదరపు అడుగుల్లో దీనిని ఏర్పాటు చేశారు.
స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్, హైదరాబాద్ ఏంజిల్స్, హైసియా, ఐఐఐటీ హైదరాబాద్, టై హైదరాబాద్‌తో ఇమేజ్ కేంద్రం అవగాహన ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇమేజ్ పేరుతో గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ)
ఎక్కడ : హైదరాబాద్
వైఎస్సార్ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని వయో వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించేందుకు ఉద్దేశించిన ‘మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం’ ప్రారంభమైంది. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలలో ఫిబ్రవరి 18న జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఫిబ్రవరి 18 నుంచి జూలై ఆఖరు వరకుమూడో విడత కంటి వెలుగు కొనసాగుతుందని చెప్పారు. 56,88,420 మంది అవ్వాతాతలకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు ప్రారంభమవుతున్నాయన్నారు.
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
ఏమిటి : వైఎస్సార్ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఎస్టీబీసీ కళాశాల, కర్నూలు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని వయో వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించేందుకు
చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణకు శంకుస్థాపన
తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి పనులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రిమోట్ కంట్రోల్ లింక్ ద్వారా ఫిబ్రవరి 18న ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణ ప్రాజెక్టుకు, ఎర్రగుంట్ల-నంద్యాల సెక్షన్‌లో విద్యుదీకరణకు శంకుస్థాపన చేశారు. అలాగే గుంతకల్లు-కల్లూరు మధ్య పూర్తయిన రెండో లైన్ మార్గం, విద్యుదీకరణను జాతికి అంకితం చేశారు.
రూ.221 కోట్ల అంచనాలతో...
రూ.221 కోట్ల అంచనాలతో చేపట్టిన చర్లపల్లి టెర్మినల్ విస్తరణ వల్ల నిత్యం లక్ష మందికి రవాణా సదుపాయం లభించనుంది. వచ్చే రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రగుంట్ల-నంద్యాల సెక్షన్‌లో రూ.112 కోట్ల అంచనాలతో 123 కి.మీ. మేర విద్యుదీకరణ చేపట్టనున్నారు. గుంతకల్లు-కల్లూరు సెక్షన్‌లో రూ.322 కోట్ల అంచనాలతో చేపట్టిన 41 కిలోమీటర్ల రెండవ లైన్ మార్గం నిర్మాణం పూర్తయింది. విద్యుదీకరణ పనులను పూర్తి చేశారు. ఈ మార్గాన్ని మంత్రి జాతికి అంకితం చేశారు.
427 స్టేషన్లలో ఉచిత హై స్పీడ్ వైఫై
దక్షిణమధ్య రైల్వేలో ఉచిత హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని మొట్టమొదట 2016లో సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టేషన్ వైఫై వినియోగంలో దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రూ.65 కోట్లతో 427 స్టేషన్‌లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కొత్తగా ప్రారంభించారు. దీన్ని మంత్రి గోయల్ జాతికి అంకితం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
దేశంలో రెండో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్‌లో మరో మెట్రోరైలు మార్గం ప్రారంభమైంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు నిర్మించిన 11 కి.మీ. మెట్రోరైలు మార్గానికి జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7న పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీంతో దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండో అతిపెద్ద మెట్రోరైల్ నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో అవతరించింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ మెట్రో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ మొత్తానికి జేబీఎస్ స్టేషన్ మాత్రమే ఐదు అంతస్తుల్లో నిర్మించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్కగా అవతరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : హైదరాబాద్ మెట్రో
ఎక్కడ : దేశంలో
ఏపీలో తొలి దిశ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 8న ప్రారంభించారు. అనంతరం నన్నయ వర్సిటీలో ‘దిశ’ చట్టంపై పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పాల్గొని ‘దిశ యాప్’ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ‘దిశ’ పోలీసుస్టేషన్ల ప్రత్యేకాధికారిణి దీపికాపటేల్ పాల్గొన్నారు.
దిశ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా తీసుకువచ్చిన ‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, ఆ మేరకు 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తున్నామన్నారు. తిరుపతి, విశాఖలో కొత్తగా రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2020, ఫిబ్రవరి నెలాఖరులోగా రాష్ట్రంలో 18 దిశ పోలీసుస్టేషన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 8

ఎక్కడ : రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా .
అనంతపురంలో బుల్లెట్ల తయారీ పరిశ్రమ
రక్షణ రంగంలో వినియోగించే బుల్లెట్ల (తూటాలు) తయారీ కేంద్రాన్ని స్టంప్ షూలీ అండ్ సోమప్ప స్ప్రింగ్‌స (ఎస్‌ఎస్‌ఎస్ స్ప్రింగ్‌స) సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయనుంది. రూ.580 కోట్లతో అనంతపురం జిల్లాలో ఈ యూనిట్‌ను ఆ సంస్థ ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ఫిబ్రవరి 9న తెలిపారు. లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పో సందర్భంగా ఎస్‌ఎస్‌ఎస్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని.. మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బుల్లెట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : ఎస్‌ఎస్‌ఎస్ స్ప్రింగ్‌స సంస్థ
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
11 జాతీయ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల’ ఏర్పాటు నేపథ్యంలో విజ్ఞాన మార్పిడి, శిక్షణ కోసం దేశంలోని 11 జాతీయ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఫిబ్రవరి 10న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉత్తమ పద్ధతులు పాటించినప్పుడే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, అధిక ఆదాయం వస్తుందని అన్నారు.
11,158 రైతు భరోసా కేంద్రాలు...
గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 2020 జూన్ నాటికి అందుబాటులోకి వస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం. వీటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. సేంద్రీయ వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్‌లో రైతులకు శిక్షణ ఇచ్చి, ఉత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకొస్తాం. పంట వేసే ముందే కనీస మద్దతు ధర ప్రకటిస్తాం’ అని సీఎం తెలిపారు.
ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న 11 సంస్థలు
మొక్కల పెంపకంలో తెలంగాణకు తొలి ర్యాంక్
2017-18లో 4,89,673 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. 3,82,364 హెక్టార్లలో మొక్కలు నాటిన ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. మొక్కల పెంపకానికి సంబంధించిన గణాంకాలను ఫిబ్రవరి 10న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో వెల్లడించారు. ఈ గణాంకాల ప్రకారం 2016-17లో 4,38,059 హెక్టార్లలో, 2015-16లో 2,36,598 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయస్థాయిలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానాన్ని సాధించింది. ఇదిలా ఉంటే 2018-19 సంవత్సరానికి గాను ఒడిశాకు 2,82,755 హెక్టార్లలో, తెలంగాణకు 2,76,870 హెక్టార్లలో మొక్కలు నాటాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొక్కల పెంపకంలో తెలంగాణకు తొలి ర్యాంక్
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్
ఎక్కడ : దేశంలో
ఏపీలో ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్ ఆవిష్కరణ
భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ దస్తావేజుల తయారీలో అవినీతి, దళారుల ప్రమేయం లేకుండా ఎవరి దస్తావేజులు వారే రాసుకునే పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానాన్ని ఇటీవల అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా ఆటోమ్యుటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్‌ను ఫిబ్రవరి 11న సచివాలయంలో విడుదల చేశారు.
ప్రస్తుతం భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదు (మ్యుటేషన్) కోసం మీసేవ కేంద్రాలకు, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆ భూములను కొనుగోలుదారుల పేరుతో తాత్కాలికంగా నమోదు చేసేలా రిజిస్ట్రేషన్ అధికారులకు వీలు కల్పిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం - 1971’ను ప్రభుత్వం సవరించింది. దీంతో అధికారులే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మీభూమి పోర్టల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన నమోదు చేస్తారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయం చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి నెల రోజుల్లో శాశ్వత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఈ భూమార్పిడి వివరాలను meebhoomi.ap.gov.in లో చూసుకునే సదుపాయాన్ని కల్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్ ఆవిష్కరణ

ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం
ఎందుకు : భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల కోసం
గోవింద్‌పూర్‌లో హట్సన్ ఐస్‌క్రీమ్ ప్లాంట్
చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్... తెలంగాణలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఫిబ్రవరి 12న కంపెనీ తెలిపింది. 2020, ఏడాది అక్టోబర్ నాటికి ప్లాంట్ కార్యకలాపాలు ఆరంభమవుతాయని పేర్కొంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, స్థానికంగా ఉన్న సుమారు 4 వేల మంది పాడి రైతులు ప్రయోజనం పొందుతారని వివరించింది.
హట్సన్ సంస్థ అరుణ్ ఐస్ క్రీమ్, హట్సన్, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్‌క్రీమ్స్, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్స్, నెయి్య, పన్నీర్ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాల్లో ఉంది. మన దేశంలో విక్రయించడంతో పాటు అమెరికా, మధ్యప్రాచ్యం వంటి 38 దేశాలకు ఎగుమతులూ చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్
ఎక్కడ : గోవింద్‌పూర్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 12న జరిగిన ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితుల గురించి కూలంకషంగా వివరించారు. విభజనానంతరం అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి తగిన విధంగా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అంశాలపై ఒక లేఖ అందిస్తూ అందులోని విషయాలన్నింటినీ స్పష్టంగా వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, శాసన మండలి రద్దు గురించి ప్రధానికి విశదీకరించారు.
ఇళ్ల కార్యక్రమానికి ఆహ్వానం..
2020, మార్చి 25వ తేదీ.. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి రావాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని తెలిపారు.
సీఎం ప్రధానికి విన్నవించిన అంశాలు..
ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణకు ఆమోదం
సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పంచాయతీ రాజ్ చట్ట సవరణ’ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 12న సమావేశమైన మంత్రివర్గం పంచాయతీ రాజ్ చట్ట సవరణతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ ప్రకారం.. పచ్చదనం, పారిశుధ్యాన్ని పెంపొందించే బాధ్యతలను సర్పంచులే నిర్వహించాలి. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారు అత్యవసర నిర్ణయాలు తీసుకోవచ్చు. సర్పంచులు ఆయా గ్రామాల్లోనే నివాసం ఉండాలి.
మున్సిపల్ చట్ట సవరణకు అంగీకారం...
మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఉన్న 24 రోజుల కాలపరిమితిని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ చట్ట సవరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకూ వర్తింప చేస్తారు.
అవినీతికి పాల్పడితే మూడేళ్లు జైలు..
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిపై అనర్హత వేటుతోపాటు మూడేళ్లు జైలు శిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం అవినీతికి పాల్పడ్డారని గెలిచిన తర్వాత రుజువైతే కూడా అలాంటి వారిపై అనర్హత వేటు వేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పంచాయతీ రాజ్ చట్ట సవరణకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు
సమత హత్యోదంతంలో దోషులకు మరణ శిక్ష
తెలంగాణలో సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్దూమ్‌లను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష విధించింది. అలాగే ముగ్గురికి కలిపి రూ.26 వేల జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. 2019, నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయమూర్తి విచారణ జరిపారు. డిసెంబర్ 11న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పడింది. బాధితురాలు, నిందితుల తరఫున వాదప్రతివాదనలు విన్న ప్రత్యే కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని జనవరి 30న తుది తీర్పు వెలువరించారు.
కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్ ప్రారంభం
రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫిబ్రవరి 2న సందర్శించారు. కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్‌ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ, రామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ డీ పటేల్ (దాజీ) పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని కాన్హా శాంతివనంలో నిర్మించారు. భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచానికి అత్యంత విలువైన బహుమతి వంటిదని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కాన్హా శాంతివనం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా, తె లంగాణ
ఏపీలో గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం
గ్రామ, వార్డు వలంటీరే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ‘గడప వద్దకే పెన్షన్’ కార్యక్రమం 13 జిల్లాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ, వార్డు వలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒక్క పూటలో 42,81291 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోను, బయోమెట్రిక్ డివైస్‌ను వెంట తీసుకెళ్లిన వలంటీర్లు.. లబ్ధిదారునితో వేలి ముద్రలు తీసుకొని పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2,16,874 మంది వలంటీర్లు తొలి రోజే 80 శాతం పైగా లబ్ధిదారులకు రూ.1,019 కోట్లు పంపిణీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
దేశంలోనే తొలి నాలుగో తరం రోబో ప్రారంభం
తుంటి, మోకాలు వంటి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో గుర్తింపు పొందిన సన్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యం తాజాగా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో దేశంలోనే తొలిసారిగా రూ.12 కోట్ల విలువ చేసే ఆధునిక ‘నాలుగో తరం’ రోబోను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫిబ్రవరి 1న తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ సింధు, సన్‌షైన్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ గురువారెడ్డిలు రోబోను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే తొలి నాలుగో తరం రోబో ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : సన్‌షైన్ ఆస్పత్రి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కీళ్లమార్పిడి శస్త్రచికిత్సకు
నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు
తెలంగాణలోని నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ (స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ కమ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 4న వెల్లడించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ సెంటర్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘డిప్యూటీ డెరైక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. రెండేళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు, ఉత్పత్తులు, నాణ్యత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. పసుపు, మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రాంతం స్పైసెస్ హబ్‌గా మారుతుంది. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల పంటల ప్రగతికి ఈ నిర్ణయం దోహదపడుతుంది’ అని మంత్రి వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : నిజామాబాద్, తెలంగాణ
హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్ సెంటర్ ఏర్పాటు
ఐర్లాండ్‌కు చెందిన డేటా, అనలిటిక్స్ కంపెనీ ఎక్స్‌పీరియన్.. ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ వద్ద 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. ప్రస్తుతం 200 మంది ఇంజనీర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. 2024 నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,500 స్థాయికి తీసుకు వెళ్లనున్నట్టు కంపెనీ తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ఫిబ్రవరి 4న ప్రారంభించారు.
యాక్సెంచర్ హబ్ కూడా...
ప్రొఫెషనల్, కన్సల్టింగ్ సర్వీసుల్లో ఉన్న అమెరికన్ కంపెనీ యాక్సెంచర్ హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. 3,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. భాగ్యనగరి సెంటర్‌లో 2,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ కేంద్రంలో డిజిటల్ ఎకానమీకి అవసరమైన ఉత్పత్తులు, సేవలను యాక్సెంచర్‌తో కలిసి క్లయింట్లు ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంస్థ తొలి నానో ల్యాబ్ ఒక్కడ కొలువుదీరింది. సంస్థకు ఇప్పటికే ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : డేటా, అనలిటిక్స్ కంపెనీ ఎక్స్‌పీరియన్
ఎక్కడ : హైదరాబాద్
ప్రత్యేక హోదాపై ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 4న లేఖ రాశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి 2020-21 బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్నారు.
రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ లోక్‌సభకు ఫిబ్రవరి 4న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ

విజయవాడలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఫిబ్రవరి 5న ది హిందూ గ్రూపు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఇవాళ అవసరమే కానీ విలాసం కాదని అన్నారు. రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఇంగ్లిష్ మీడియం కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పును తెచ్చేందుకు నాడు- నేడు, పౌష్టికాహారం, అమ్మ ఒడి, ఇంగ్లీషు మీడియం కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది హిందూ గ్రూపు ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 5

ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ అభివృద్ధి
రక్షణ, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ప్రకాశం జిల్లా దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. లక్నోలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పో-2020 సదస్సులో భాగంగా ఇండియా-ఫ్రాన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీ సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఈ మేరకు వెల్లడించారు.
విజయవాడలో డబ్ల్యూహెచ్‌ఈఎఫ్ సదస్సు
వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) ప్రాంతీయ సదస్సుకు విజయవాడ వేదిక కానుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు పది దేశాలకుపైగా 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని డబ్ల్యూహెచ్‌ఈఎఫ్-2020 సదస్సు చైర్మన్ ఎస్.ఎన్. కుమార్ బుద్ధవరపు ఫిబ్రవరి 5న తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, ‘కలసి అభివృద్ధి చెందుదాం- కలసి పంచుకుందాం’ అన్న లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సకు కేంద్రమంత్రులు వి.మురళీధరన్, జి.కిషన్‌రెడ్డిలతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేకంగా డిఫెన్స్ క్లస్టర్‌ను అభివృద్ధి
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఎక్కడ : దొనకొండ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రక్షణ, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 5న ఘనంగా ఫ్రారంభమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొత్తగూడ మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూ రునాగారం మండలం కొండాయి నుంచి గోవింద రాజులు సైతం మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నంటింది. జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి ఫిబ్రవరి 6న చేరుస్తారు. మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి సమ్మక్కను తీసుకొస్తారు.
తెలంగాణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతరను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్తులు వస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎక్కడ : మేడారం, తాడ్వాయి మండం, ములుగు జిల్లా, తెలంగాణ
ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం అందించేందుకు ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఏఐఐబీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ డి.జె.పాండియన్, డెరైక్టర్ జనరల్-ఇన్వెస్ట్‌మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ యీ-ఎన్-పంగ్, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ సోమనాథ్ బసు భేటీ అయ్యారు. ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించడానికి ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ)
నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను విడుదల
2020-2021కు సంబంధించిన నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న విడుదల చేశారు. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రం వ్యవసాయ ఆధారితమని, 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో దాని ప్రభావం మొదట ప్రాథమిక రంగాలపైనే.. అంటే వ్యవసాయంపైనే ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
వ్యవసాయ రుణాలు 1,34,402 కోట్లు
2020-21లో ప్రాథమిక రంగానికి రూ.2,11,865.38 కోట్ల రుణాలు ఇవ్వాలనేది నాబార్డు లక్ష్యం. ఇందులో రూ.1,34,402.52 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయి.
కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం తొలగించాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని విదేశీ వర్తక డెరైక్టర్ జనరల్ అమిత్ యాదవ్ ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020-2021 నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 6

- విద్యార్థులకు ఏటా రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కింద అందించే వసతి దీవెన కార్యక్రమం నేటితో ప్రారంభమవుతుంది.
- డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో రూ.10 వేలు.. మొత్తంగా ఏటా రూ.20 వేలు పిల్లల తల్లులకు అందిస్తాం.
- ఐటీఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.15 వేలు వారి తల్లులకు అందజేస్తాం.
- కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ వసతి దీవెన సాయం అందిస్తాం.
- వసతిదీవెన కింద ఏడాదికి రూ.2,300 కోట్లు, విద్యాదీవెన పథకంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద దాదాపు ఏడాదికి రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అమ్మఒడి కింద ఒకటి నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల కోసం రూ.6,400 కోట్లు ఇచ్చాం. ఈ మూడు పథకాలకూ కలిపి ఏడాదికి రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయనగరం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఏడాదికి రెండున్నర లక్షలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం చేసేందుకు
ఏపీలో అవినీతి నిర్మూలనపై వీడియోల విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్ ఫ్రీ నంబర్‌పై ప్రచారానికి సంబంధించి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సందేశంతో రూపొందించిన ఇంగ్లిష్, తెలుగు భాషల్లోని వీడియోలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఫిబ్రవరి 25న జరిగిన ఈ కార్యక్రమం నిర్వహించారు. ‘అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి సంకల్పం. ఎవ్వరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి’ అని పీవీ సింధు ఈ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో అవినీతి నిర్మూలనపై వీడియోల విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 25

ఎందుకు : అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్ ఫ్రీ నంబర్‌పై ప్రచారానికి
తెలంగాణలో సీఐఐ స్టార్టప్స్ ఇన్నోవేషన్ సెంటర్
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్స్ కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో స్టార్టప్స్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కేంద్రం పని చేస్తుందని, 2020, ఏప్రిల్ నుంచి ఈ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఐఐ ఫిబ్రవరి 25న తెలిపింది. వినూత్న ఆలోచనలు, స్టార్టప్స్‌కు మెంటారింగ్, అవకాశాలు, వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక ప్రోత్సాహం అందించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌కు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్, సీఐఐ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్‌కు చెందిన ప్రతీక్ష చారిటబుల్ ట్రస్ట్ సహకారం అందించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టార్టప్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 258
ఎవరు : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్స్ కోసం
ఏపీ సీఎంతో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో దక్షిణాసియా మానవ వనరుల విభాగం రీజినల్ డెరైక్టర్ షెర్ బర్న్ బెంజ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు బృందం భేటీ అయి్యంది. రాష్ట్ర సచివాలయంలో ఫిబ్రవరి 25న జరిగిన ఈ సమావేశంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. ఈ అంశాల్లో తగిన విధంగా సహాయం అందిస్తామని తెలిపింది. నాలుగు నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేసి, ఇతరత్రా ఏయే కార్యక్రమాలకు సహాయం అందించాలన్నదానిపై ఒక అవగాహనకు వస్తామని వెల్లడించింది. ఈ సందర్భంగా బ్యాంకు బృందానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను సీఎం సమగ్రంగా వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం
ఎక్కడ : ఏపీ సచివాలయం
ఎందుకు : విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందించే విషయమై చర్చించేందుకు
కాకినాడలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రూ.110 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఫిబ్రవరి 26న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా 154 ఈఎస్‌ఐ ఆస్పత్రులు, 1,500 డిస్పెన్సరీలు, 815 బ్రాంచ్ కార్యాలయాలు, 63 రీజినల్, సబ్ రీజనల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయన్నారు. దేశంలోని కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. కార్మిక వర్గాలతోపాటు, పేదల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్
ఎక్కడ : కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్ సమ్మిట్‌లో కేటీఆర్
భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో ఫిబ్రవరి 13న జరిగిన టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్-2020 సమ్మిట్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారక రామారావు పాల్గొన్నారు. ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ... దేశంలో జాతీయ పార్టీలేవీ లేవని, అలా చలామణిలో ఉన్నవన్నీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని అన్నారు.‘భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుంది. కేంద్రం విధివిధానాలు ఎన్ని ఉన్నా వాటి ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉంది’ అని పేర్కొన్నారు. కేంద్రం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్-2020 సమ్మిట్
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : న్యూఢిల్లీ
సమ్మక్క బ్యారేజీగా తుపాకులగూడెం బ్యారేజీ
తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసీ వీర వనిత, వన దేవత.. ‘సమ్మక్క’పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.ఈ మేరకు బ్యారేజీకి ‘సమ్మక్క బ్యారేజీ’గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్‌రావును ఫిబ్రవరి 12న ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తై బీడు భూముల్లోకి కాళేశ్వరం నీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు. మరోవైపు ఫిబ్రవరి 13న సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 13న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సమ్మక్క బ్యారేజీగా తుపాకులగూడెం బ్యారేజీ
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : తెలంగాణ
నాస్కాం టెక్నాలజీ లీడర్‌షిప్ ఫోరంలో కేటీఆర్
ముంబైలో జరుగుతున్న నాస్కాం టెక్నాలజీ లీడర్‌షిప్ ఫోరం-2020 కార్యక్రమంలో ఫిబ్రవరి 14న తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మార్చి టు 5 ట్రిలియన్ ఎకానమీ రియాల్టీ ఆర్ ఆంబియష్’అనే అంశంపై మహీంద్రా ఎండీ సీపీ గార్నానీ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కావాలంటే కేంద్రప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇన్నోవేషన్ (నూతన ఆవిష్కరణలు), ఇన్‌ఫ్రాస్టక్చర్ (మౌలిక సదుపాయాలు), ఇంక్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత వృద్ధి) ద్వారా నయా భారత్ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాస్కాం టెక్నాలజీ లీడర్‌షిప్ ఫోరం-2020
ఎప్పుడు : ఫిబ్రవరి 14

ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
సీతమ్మ సాగర్ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం బ్యారేజీ
గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీకి ‘సీతమ్మసాగర్’గా నామకరణం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు సాగునీటి శాఖ అధికారులకు ఫిబ్రవరి 14న సీఎం ఆదేశాలు జారీ చేశారు. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో దీని పేరును సీతమ్మ సాగర్‌గా పెట్టాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గోదావరిపై చేపట్టిన తుపాకులగూడెం పేరుకు సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీతమ్మ సాగర్ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం బ్యారేజీ
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : తెలంగాణ
హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 14న జరిగిన ఈ భేటీలో ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లోనే ఆమోదం తెలపాలని అమిత్ షాకు జగన్ విన్నవించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింపజేయాలన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం-2020 తెచ్చినట్లు అమితాషాకు జగన్ వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడి
ఎక్కడ : న్యూఢిల్లీ
కేంద్ర న్యాయశాఖ మంత్రితో ఏపీ సీఎం జగన్ భేటీ
కేంద్ర న్యాయ, ఐటీ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 15న జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో శాసనసభ.. మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసిందని, కేంద్ర న్యాయ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. మహిళలు, చిన్నారులపై నేరాలను నియంత్రించేందుకు రూపొందించిన దిశ చట్టం వెంటనే అమలులోకి వచ్చేలా కేంద్రం నుంచి తీసుకోవాల్సిన చర్యలు వేగవంతం చేయాలని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర న్యాయ, ఐటీ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ తీర్మానం
పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. కేరళ, పంజాబ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలోనూ ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు...

- పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహకం కోసం ఫిబ్రవరి 18న ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలి. వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి జరగాలి.
- పట్టణప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలి.
- జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.78 కోట్లు, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్లు వెంటనే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి.
- పట్టణ ప్రగతిలో పచ్చదనం-పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి.
- తెలంగాణ లోకాయుక్త చట్టంపై తెచ్చిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించింది.
ఏమిటి : పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని తీర్మానం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : తెలంగాణ రాష్ట్ర కేబినెట్
బయాలాజికల్-ఇ నూతన ప్లాంటు ప్రారంభం
ఔషధ రంగ సంస్థ బయాలాజికల్-ఇ (బీఈ) లిమిటెడ్ హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట వద్ద ఉన్న జీనోమ్ వ్యాలీ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో నూతన ప్లాంటును ఏర్పాటు చేసింది. 29 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ.300 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఫిబ్రవరి 17న ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ రూపొందించిన టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
సింజీన్ ఆర్‌అండ్‌డీ సెంటర్ ప్రారంభం
కాంట్రాక్ట్ రీసెర్చ్ సేవల్లో ఉన్న సింజీన్ ఇంటర్నేషనల్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన కొత్త పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా కేటీఆర్ ప్రారంభించారు. తొలి దశలో 52,000 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బయాలాజికల్-ఇ నూతన ప్లాంటు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : జీనోమ్ వ్యాలీ స్పెషల్ ఎకనమిక్ జోన్, శామీర్‌పేట, హైదరాబాద్
17వ బయో ఆసియా సదస్సు ప్రారంభం
ఆరోగ్య రంగంలోని సవాళ్లకు పరిష్కారం కనుగొనడంపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఫిబ్రవరి 17న 17వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. సుమారు 37 దేశాల నుంచి 2 వేల మంది సభ్యులు హాజరైన ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైద్యం తీరుతెన్నులు మారిపోతున్న ఈ ఆధునిక కాలానికి తగ్గ చికిత్స విధానాలపై పరిశోధనలు చేసే ఓ అంతర్జాతీయ స్థాయి సంస్థ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన ప్రకటించారు. కణ, జన్యుస్థాయి చికిత్సలపై పరిశోధనలు చేపట్టే ఈ సంస్థను నిర్మించడంలో ప్రభుత్వం సీసీఎంబీ సహాయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 19 వరకు జరగనున్న ఈ సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్‌తో పాటు అసోం, కేరళ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామ్యం వహిస్తున్నాయి.
బయో ఆసియా సదస్సు 2020 థీమ్: టుడే ఫర్ టుమారో
కార్ల్ జూన్‌కు ఎక్సలెన్సీ అవార్డు..
శరీర రోగ నిరోధక కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా కేన్సర్‌కు చికిత్స అందించే ఇమ్యూనోథెరపీని అభివృద్ధి చేసిన అమెరికన్ శాస్త్రవేత్త, పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కార్ల్ జూన్‌కు 2020 బయో ఆసియా జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. జీవశాస్త్ర రంగంలో విశేష కృషి జరిపిన వారికి ఈ అవార్డు ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 17వ బయో ఆసియా సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : హెచ్‌ఐసీసీ, హైదరాబాద్
భారత్‌లో తొలి గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, కంప్యూటర్ విజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల కోసం భారత్‌లో తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ‘ఇమేజ్’ పేరుతో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) దీనిని నెలకొల్పింది. ఈ రంగాల్లో మేధో సంపత్తిపై దృష్టిసారించిన కంపెనీలకు ఇది తొలి ఇంక్యు బేషన్ సెంటర్ కావడం విశేషం. ఎస్‌టీపీఐ ఫెసిలిటీలో 10,000 చదరపు అడుగుల్లో దీనిని ఏర్పాటు చేశారు.
స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్, హైదరాబాద్ ఏంజిల్స్, హైసియా, ఐఐఐటీ హైదరాబాద్, టై హైదరాబాద్‌తో ఇమేజ్ కేంద్రం అవగాహన ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇమేజ్ పేరుతో గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ)
ఎక్కడ : హైదరాబాద్
వైఎస్సార్ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని వయో వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించేందుకు ఉద్దేశించిన ‘మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం’ ప్రారంభమైంది. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలలో ఫిబ్రవరి 18న జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఫిబ్రవరి 18 నుంచి జూలై ఆఖరు వరకుమూడో విడత కంటి వెలుగు కొనసాగుతుందని చెప్పారు. 56,88,420 మంది అవ్వాతాతలకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు ప్రారంభమవుతున్నాయన్నారు.
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
- కంటి వెలుగు కార్యక్రమం మొదటి దశ 2019, అక్టోబర్ 10న అనంతపురంలో ప్రారంభమైంది. స్కూళ్లకు వెళ్లే చిన్నారుల కోసం మొదలుపెట్టాం. 66 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాం.
- 2019, నవంబర్ 1 నుంచి 31 వరకూ రెండోదశ కంటి వెలుగు కార్యక్రమం పూర్తి చేశారు. 500 మంది నిపుణులైన బృందాలతో 4.36 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు.
- నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఐపీహెచ్‌ఎస్ (ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్) స్థాయికి తీసుకొస్తాం. మొదటగా కర్నూలు జిల్లా నుంచే దీన్ని ప్రారంభిస్తున్నాం.
- రాష్ట్రంలో ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీ (బోధనాసుపత్రి)లకు అదనంగా 16 కొత్త కాలేజీలు కలిపి మొత్తం 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు నర్సింగ్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ప్రతి ఆసుపత్రిలో పీజీ కోర్సులు వస్తాయి.
ఏమిటి : వైఎస్సార్ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఎస్టీబీసీ కళాశాల, కర్నూలు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని వయో వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించేందుకు
చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణకు శంకుస్థాపన
తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి పనులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రిమోట్ కంట్రోల్ లింక్ ద్వారా ఫిబ్రవరి 18న ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణ ప్రాజెక్టుకు, ఎర్రగుంట్ల-నంద్యాల సెక్షన్‌లో విద్యుదీకరణకు శంకుస్థాపన చేశారు. అలాగే గుంతకల్లు-కల్లూరు మధ్య పూర్తయిన రెండో లైన్ మార్గం, విద్యుదీకరణను జాతికి అంకితం చేశారు.
రూ.221 కోట్ల అంచనాలతో...
రూ.221 కోట్ల అంచనాలతో చేపట్టిన చర్లపల్లి టెర్మినల్ విస్తరణ వల్ల నిత్యం లక్ష మందికి రవాణా సదుపాయం లభించనుంది. వచ్చే రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రగుంట్ల-నంద్యాల సెక్షన్‌లో రూ.112 కోట్ల అంచనాలతో 123 కి.మీ. మేర విద్యుదీకరణ చేపట్టనున్నారు. గుంతకల్లు-కల్లూరు సెక్షన్‌లో రూ.322 కోట్ల అంచనాలతో చేపట్టిన 41 కిలోమీటర్ల రెండవ లైన్ మార్గం నిర్మాణం పూర్తయింది. విద్యుదీకరణ పనులను పూర్తి చేశారు. ఈ మార్గాన్ని మంత్రి జాతికి అంకితం చేశారు.
427 స్టేషన్లలో ఉచిత హై స్పీడ్ వైఫై
దక్షిణమధ్య రైల్వేలో ఉచిత హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని మొట్టమొదట 2016లో సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టేషన్ వైఫై వినియోగంలో దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రూ.65 కోట్లతో 427 స్టేషన్‌లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కొత్తగా ప్రారంభించారు. దీన్ని మంత్రి గోయల్ జాతికి అంకితం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
దేశంలో రెండో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్‌లో మరో మెట్రోరైలు మార్గం ప్రారంభమైంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు నిర్మించిన 11 కి.మీ. మెట్రోరైలు మార్గానికి జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7న పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీంతో దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండో అతిపెద్ద మెట్రోరైల్ నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో అవతరించింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ మెట్రో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ మొత్తానికి జేబీఎస్ స్టేషన్ మాత్రమే ఐదు అంతస్తుల్లో నిర్మించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్కగా అవతరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : హైదరాబాద్ మెట్రో
ఎక్కడ : దేశంలో
ఏపీలో తొలి దిశ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 8న ప్రారంభించారు. అనంతరం నన్నయ వర్సిటీలో ‘దిశ’ చట్టంపై పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పాల్గొని ‘దిశ యాప్’ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ‘దిశ’ పోలీసుస్టేషన్ల ప్రత్యేకాధికారిణి దీపికాపటేల్ పాల్గొన్నారు.
దిశ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా తీసుకువచ్చిన ‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, ఆ మేరకు 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తున్నామన్నారు. తిరుపతి, విశాఖలో కొత్తగా రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2020, ఫిబ్రవరి నెలాఖరులోగా రాష్ట్రంలో 18 దిశ పోలీసుస్టేషన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా .
అనంతపురంలో బుల్లెట్ల తయారీ పరిశ్రమ
రక్షణ రంగంలో వినియోగించే బుల్లెట్ల (తూటాలు) తయారీ కేంద్రాన్ని స్టంప్ షూలీ అండ్ సోమప్ప స్ప్రింగ్‌స (ఎస్‌ఎస్‌ఎస్ స్ప్రింగ్‌స) సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయనుంది. రూ.580 కోట్లతో అనంతపురం జిల్లాలో ఈ యూనిట్‌ను ఆ సంస్థ ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ఫిబ్రవరి 9న తెలిపారు. లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పో సందర్భంగా ఎస్‌ఎస్‌ఎస్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని.. మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బుల్లెట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : ఎస్‌ఎస్‌ఎస్ స్ప్రింగ్‌స సంస్థ
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
11 జాతీయ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల’ ఏర్పాటు నేపథ్యంలో విజ్ఞాన మార్పిడి, శిక్షణ కోసం దేశంలోని 11 జాతీయ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఫిబ్రవరి 10న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉత్తమ పద్ధతులు పాటించినప్పుడే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, అధిక ఆదాయం వస్తుందని అన్నారు.
11,158 రైతు భరోసా కేంద్రాలు...
గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 2020 జూన్ నాటికి అందుబాటులోకి వస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం. వీటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. సేంద్రీయ వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్‌లో రైతులకు శిక్షణ ఇచ్చి, ఉత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకొస్తాం. పంట వేసే ముందే కనీస మద్దతు ధర ప్రకటిస్తాం’ అని సీఎం తెలిపారు.
ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న 11 సంస్థలు
- ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నై
వ్యవసాయం, పర్యావరణం, పౌష్టికాహారం సహా వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ. తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు సూచనలు, సలహాలు ఇస్తుంది.
- ఐసీఏఆర్, వ్యవసాయ విస్తరణ విభాగం, న్యూఢిల్లీ
భారతదేశంలో వ్యవసాయ విద్య, పరిశోధనలను సమన్వయం చేసే బాధ్యతతో పని చేస్తున్న స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనలలో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగి ఉంది. విత్తనాల ఉత్పత్తి, భూసారం, నీటి నాణ్యత పరీక్ష, ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో రైతులకు శిక్షణ ఇస్తుంది.
- భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ)
న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తోంది. పూసా ఇన్‌స్టిట్యూట్‌గా పిలుస్తారు. అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఈ సంస్థ తయారు చేస్తుంది. పంటలకు సోకే వివిధ రకాల తెగుళ్లను గుర్తించే పరికరాలను రూపొందింస్తుంది. భూసార పరీక్షలు చేసి తదనుగుణంగా రైతులకు ఎరువుల వినియోగంలో తగిన సిఫార్సులు చేస్తుంది.
- సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
ఫరీదాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చేయడం. ఎరువుల నాణ్యతను నిర్ధారించి రైతులకు సిఫార్సు చేస్తుంది.
- జాతీయ విత్తన పరిశోధన, శిక్షణ సంస్థ
నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వారణాశి కేంద్రంగా పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏడాదికి 20 వేల శాంపిళ్లను పరీక్షిస్తుంది. విత్తనాల నాణ్యతను నిర్ధారిస్తుంది. విత్తన రంగంలో రైతు భరోసా కేంద్రాలకు అండగా నిలుస్తుంది.
- సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రిడా)
ఈ సంస్థను 1985లో స్థాపించారు. వర్షాధార వ్యవసాయంలో పరిశోధనలు దీని లక్ష్యం. జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులను కూడా చేపడుతుంది. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ సంస్థ శాఖలు ఉన్నప్పటికీ ప్రధాన క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. అనూహ్య వాతావరణ మార్పుల వల్ల వస్తున్న విపరిణామాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. పరిశోధన, సాంకేతిక సహకారం అందిస్తుంది.
- జాతీయ పాడి పరిశోధన సంస్థ, కర్నాల్
దేశంలోనే అతి ముఖ్యమైన పాల పరిశోధన సంస్థ. కర్నాల్ కేంద్రంగా పని చేస్తోంది. 50 ఏళ్లుగా పాల ఉత్పత్తి, శుద్ధి, నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి తదితర రంగాలలో గణనీయమైన నైపుణ్యం ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పాలలో విషపూరిత, రసాయన పదార్థాలను కనిపెట్టడానికి మంచి విధానాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తుంది. స్వచ్ఛమైన పాలను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. కొత్త జాతులను అభివృద్ధి చేస్తుంది.
- ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)
ఈ సంస్థ పూణే కేంద్రంగా పని చేస్తోంది. ‘ఇంపీరియల్ బాక్టీరియలాజికల్ లాబొరేటరీ’గా అవతరించి ఆ తర్వాత ఐవీఆర్‌ఐగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పశువులకు వచ్చే వ్యాధులను గుర్తించడానికి ఉత్తమ వైద్య విధానాలను ప్రవేశపెడుతుంది. ఈ వ్యాధులను గుర్తించడానికి క్షేత్ర స్థాయిలో ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. వీటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. పశువులకు టీకాల విషయంలోనూ సహకరిస్తుంది.
- సదరన్ రీజియన్ అనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్
ఈ సంస్థ బెంగళూరులోని హెబ్బాళ్ కేంద్రంగా పని చేస్తోంది. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలలో సేవలు అందిస్తుంది. పశువుల వ్యాధులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తుంది.
- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్
మంచినీటితో చేపల పెంపకంలో ఈ సంస్థ దిట్ట. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ప్రధాన కేంద్ర కార్యాలయం ఉంది. మంచినీటి ఆక్వాకల్చర్‌లో ఇదో ఆధునిక పరిశోధనా సంస్థ. ఆక్వా రంగంలో శిక్షణ ఇస్తుంది. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు క్షేత్ర స్థాయిలో ఉండేలా పర్యవేక్షిస్తుంది. గంటల్లోనే పరీక్షా ఫలితాలు తేల్చుతుంది. ఆక్వాకల్చర్‌లో స్మార్ట్ లాబొరేటరీ సొల్యూషన్స్ ను ప్రవేశ పెడుతుంది. వీటి నిర్వహణకు కమిటీలు, వాటిపై తనిఖీ ఉండేలా చూస్తుంది.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్
జాతీయ మొక్కల సంరక్షణ సంస్థ (ఎన్‌పీపీటీఐ) 1996 నుంచి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. పంటల తెగుళ్ల నివారణలో సమర్థవంతమైన సంస్థ. మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. రైతులకు శిక్షణ ఇస్తుంది. మానవ వనరుల అభివృద్ధి కోసం శిక్షణా కోర్సులను నిర్వహిస్తుంది.
మొక్కల పెంపకంలో తెలంగాణకు తొలి ర్యాంక్
2017-18లో 4,89,673 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. 3,82,364 హెక్టార్లలో మొక్కలు నాటిన ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. మొక్కల పెంపకానికి సంబంధించిన గణాంకాలను ఫిబ్రవరి 10న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో వెల్లడించారు. ఈ గణాంకాల ప్రకారం 2016-17లో 4,38,059 హెక్టార్లలో, 2015-16లో 2,36,598 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయస్థాయిలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానాన్ని సాధించింది. ఇదిలా ఉంటే 2018-19 సంవత్సరానికి గాను ఒడిశాకు 2,82,755 హెక్టార్లలో, తెలంగాణకు 2,76,870 హెక్టార్లలో మొక్కలు నాటాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొక్కల పెంపకంలో తెలంగాణకు తొలి ర్యాంక్
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్
ఎక్కడ : దేశంలో
ఏపీలో ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్ ఆవిష్కరణ
భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ దస్తావేజుల తయారీలో అవినీతి, దళారుల ప్రమేయం లేకుండా ఎవరి దస్తావేజులు వారే రాసుకునే పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానాన్ని ఇటీవల అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా ఆటోమ్యుటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్‌ను ఫిబ్రవరి 11న సచివాలయంలో విడుదల చేశారు.
ప్రస్తుతం భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదు (మ్యుటేషన్) కోసం మీసేవ కేంద్రాలకు, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆ భూములను కొనుగోలుదారుల పేరుతో తాత్కాలికంగా నమోదు చేసేలా రిజిస్ట్రేషన్ అధికారులకు వీలు కల్పిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం - 1971’ను ప్రభుత్వం సవరించింది. దీంతో అధికారులే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మీభూమి పోర్టల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన నమోదు చేస్తారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయం చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి నెల రోజుల్లో శాశ్వత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఈ భూమార్పిడి వివరాలను meebhoomi.ap.gov.in లో చూసుకునే సదుపాయాన్ని కల్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం
ఎందుకు : భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల కోసం
గోవింద్‌పూర్‌లో హట్సన్ ఐస్‌క్రీమ్ ప్లాంట్
చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్... తెలంగాణలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఫిబ్రవరి 12న కంపెనీ తెలిపింది. 2020, ఏడాది అక్టోబర్ నాటికి ప్లాంట్ కార్యకలాపాలు ఆరంభమవుతాయని పేర్కొంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, స్థానికంగా ఉన్న సుమారు 4 వేల మంది పాడి రైతులు ప్రయోజనం పొందుతారని వివరించింది.
హట్సన్ సంస్థ అరుణ్ ఐస్ క్రీమ్, హట్సన్, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్‌క్రీమ్స్, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్స్, నెయి్య, పన్నీర్ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాల్లో ఉంది. మన దేశంలో విక్రయించడంతో పాటు అమెరికా, మధ్యప్రాచ్యం వంటి 38 దేశాలకు ఎగుమతులూ చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్
ఎక్కడ : గోవింద్‌పూర్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 12న జరిగిన ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితుల గురించి కూలంకషంగా వివరించారు. విభజనానంతరం అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి తగిన విధంగా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అంశాలపై ఒక లేఖ అందిస్తూ అందులోని విషయాలన్నింటినీ స్పష్టంగా వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, శాసన మండలి రద్దు గురించి ప్రధానికి విశదీకరించారు.
ఇళ్ల కార్యక్రమానికి ఆహ్వానం..
2020, మార్చి 25వ తేదీ.. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి రావాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని తెలిపారు.
సీఎం ప్రధానికి విన్నవించిన అంశాలు..
- పోలవరం సవరించిన అంచనాలను(రూ.55,549 కోట్లు) ఆమోదించండి
- అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి
- పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలి.
- కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలి.
- రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలి.
- కృష్ణా- గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలి.
- రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలి.
- ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-2019ను ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలి.
- హైకోర్టు కర్నూలుకు తరలించడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలి
- వెనకబడిన ఏడు జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలి.
ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణకు ఆమోదం
సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పంచాయతీ రాజ్ చట్ట సవరణ’ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 12న సమావేశమైన మంత్రివర్గం పంచాయతీ రాజ్ చట్ట సవరణతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ ప్రకారం.. పచ్చదనం, పారిశుధ్యాన్ని పెంపొందించే బాధ్యతలను సర్పంచులే నిర్వహించాలి. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారు అత్యవసర నిర్ణయాలు తీసుకోవచ్చు. సర్పంచులు ఆయా గ్రామాల్లోనే నివాసం ఉండాలి.
మున్సిపల్ చట్ట సవరణకు అంగీకారం...
మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఉన్న 24 రోజుల కాలపరిమితిని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ చట్ట సవరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకూ వర్తింప చేస్తారు.
అవినీతికి పాల్పడితే మూడేళ్లు జైలు..
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిపై అనర్హత వేటుతోపాటు మూడేళ్లు జైలు శిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం అవినీతికి పాల్పడ్డారని గెలిచిన తర్వాత రుజువైతే కూడా అలాంటి వారిపై అనర్హత వేటు వేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పంచాయతీ రాజ్ చట్ట సవరణకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు
సమత హత్యోదంతంలో దోషులకు మరణ శిక్ష
తెలంగాణలో సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్దూమ్‌లను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష విధించింది. అలాగే ముగ్గురికి కలిపి రూ.26 వేల జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. 2019, నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయమూర్తి విచారణ జరిపారు. డిసెంబర్ 11న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పడింది. బాధితురాలు, నిందితుల తరఫున వాదప్రతివాదనలు విన్న ప్రత్యే కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని జనవరి 30న తుది తీర్పు వెలువరించారు.
కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్ ప్రారంభం
రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫిబ్రవరి 2న సందర్శించారు. కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్‌ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ, రామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ డీ పటేల్ (దాజీ) పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని కాన్హా శాంతివనంలో నిర్మించారు. భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచానికి అత్యంత విలువైన బహుమతి వంటిదని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కాన్హా శాంతివనం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా, తె లంగాణ
ఏపీలో గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం
గ్రామ, వార్డు వలంటీరే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ‘గడప వద్దకే పెన్షన్’ కార్యక్రమం 13 జిల్లాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ, వార్డు వలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒక్క పూటలో 42,81291 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోను, బయోమెట్రిక్ డివైస్‌ను వెంట తీసుకెళ్లిన వలంటీర్లు.. లబ్ధిదారునితో వేలి ముద్రలు తీసుకొని పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2,16,874 మంది వలంటీర్లు తొలి రోజే 80 శాతం పైగా లబ్ధిదారులకు రూ.1,019 కోట్లు పంపిణీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
దేశంలోనే తొలి నాలుగో తరం రోబో ప్రారంభం
తుంటి, మోకాలు వంటి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో గుర్తింపు పొందిన సన్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యం తాజాగా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో దేశంలోనే తొలిసారిగా రూ.12 కోట్ల విలువ చేసే ఆధునిక ‘నాలుగో తరం’ రోబోను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫిబ్రవరి 1న తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ సింధు, సన్‌షైన్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ గురువారెడ్డిలు రోబోను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే తొలి నాలుగో తరం రోబో ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : సన్‌షైన్ ఆస్పత్రి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కీళ్లమార్పిడి శస్త్రచికిత్సకు
నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు
తెలంగాణలోని నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ (స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ కమ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 4న వెల్లడించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ సెంటర్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘డిప్యూటీ డెరైక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. రెండేళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు, ఉత్పత్తులు, నాణ్యత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. పసుపు, మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రాంతం స్పైసెస్ హబ్‌గా మారుతుంది. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల పంటల ప్రగతికి ఈ నిర్ణయం దోహదపడుతుంది’ అని మంత్రి వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : నిజామాబాద్, తెలంగాణ
హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్ సెంటర్ ఏర్పాటు
ఐర్లాండ్‌కు చెందిన డేటా, అనలిటిక్స్ కంపెనీ ఎక్స్‌పీరియన్.. ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ వద్ద 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. ప్రస్తుతం 200 మంది ఇంజనీర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. 2024 నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,500 స్థాయికి తీసుకు వెళ్లనున్నట్టు కంపెనీ తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ఫిబ్రవరి 4న ప్రారంభించారు.
యాక్సెంచర్ హబ్ కూడా...
ప్రొఫెషనల్, కన్సల్టింగ్ సర్వీసుల్లో ఉన్న అమెరికన్ కంపెనీ యాక్సెంచర్ హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. 3,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. భాగ్యనగరి సెంటర్‌లో 2,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ కేంద్రంలో డిజిటల్ ఎకానమీకి అవసరమైన ఉత్పత్తులు, సేవలను యాక్సెంచర్‌తో కలిసి క్లయింట్లు ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంస్థ తొలి నానో ల్యాబ్ ఒక్కడ కొలువుదీరింది. సంస్థకు ఇప్పటికే ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : డేటా, అనలిటిక్స్ కంపెనీ ఎక్స్‌పీరియన్
ఎక్కడ : హైదరాబాద్
ప్రత్యేక హోదాపై ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 4న లేఖ రాశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి 2020-21 బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్నారు.
రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ లోక్‌సభకు ఫిబ్రవరి 4న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
విజయవాడలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఫిబ్రవరి 5న ది హిందూ గ్రూపు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఇవాళ అవసరమే కానీ విలాసం కాదని అన్నారు. రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఇంగ్లిష్ మీడియం కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పును తెచ్చేందుకు నాడు- నేడు, పౌష్టికాహారం, అమ్మ ఒడి, ఇంగ్లీషు మీడియం కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది హిందూ గ్రూపు ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ అభివృద్ధి
రక్షణ, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ప్రకాశం జిల్లా దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. లక్నోలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పో-2020 సదస్సులో భాగంగా ఇండియా-ఫ్రాన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీ సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఈ మేరకు వెల్లడించారు.
విజయవాడలో డబ్ల్యూహెచ్‌ఈఎఫ్ సదస్సు
వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) ప్రాంతీయ సదస్సుకు విజయవాడ వేదిక కానుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు పది దేశాలకుపైగా 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని డబ్ల్యూహెచ్‌ఈఎఫ్-2020 సదస్సు చైర్మన్ ఎస్.ఎన్. కుమార్ బుద్ధవరపు ఫిబ్రవరి 5న తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, ‘కలసి అభివృద్ధి చెందుదాం- కలసి పంచుకుందాం’ అన్న లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సకు కేంద్రమంత్రులు వి.మురళీధరన్, జి.కిషన్‌రెడ్డిలతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేకంగా డిఫెన్స్ క్లస్టర్‌ను అభివృద్ధి
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఎక్కడ : దొనకొండ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రక్షణ, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 5న ఘనంగా ఫ్రారంభమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొత్తగూడ మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూ రునాగారం మండలం కొండాయి నుంచి గోవింద రాజులు సైతం మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నంటింది. జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి ఫిబ్రవరి 6న చేరుస్తారు. మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి సమ్మక్కను తీసుకొస్తారు.
తెలంగాణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతరను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్తులు వస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎక్కడ : మేడారం, తాడ్వాయి మండం, ములుగు జిల్లా, తెలంగాణ
ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం అందించేందుకు ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఏఐఐబీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ డి.జె.పాండియన్, డెరైక్టర్ జనరల్-ఇన్వెస్ట్‌మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ యీ-ఎన్-పంగ్, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ సోమనాథ్ బసు భేటీ అయ్యారు. ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించడానికి ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ)
నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను విడుదల
2020-2021కు సంబంధించిన నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న విడుదల చేశారు. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రం వ్యవసాయ ఆధారితమని, 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో దాని ప్రభావం మొదట ప్రాథమిక రంగాలపైనే.. అంటే వ్యవసాయంపైనే ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
వ్యవసాయ రుణాలు 1,34,402 కోట్లు
2020-21లో ప్రాథమిక రంగానికి రూ.2,11,865.38 కోట్ల రుణాలు ఇవ్వాలనేది నాబార్డు లక్ష్యం. ఇందులో రూ.1,34,402.52 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయి.
కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం తొలగించాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని విదేశీ వర్తక డెరైక్టర్ జనరల్ అమిత్ యాదవ్ ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020-2021 నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం
Published date : 01 Mar 2020 03:00PM