Industry 4.0: కల్పతరువు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఎక్కడ ఏర్పాటైంది?
కల్పతరువు పేరుతో..
దేశ పారిశ్రామిక రంగంలో ఆటోమేషన్‌ను పెంచే విధంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రూపుదిద్దుకుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు స్టీల్ ప్లాంట్ రూ.10 కోట్లు కేటాయించగా కేంద్రం రూ.30 కోట్లను మంజూరు చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్న ఇండస్ట్రీ–4 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను 2021, జనవరిలో ప్రారంభించనున్నారు.
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో..
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మరో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్ నెలకొల్పింది. ఇందులో అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్, 3–డీ ప్రింటర్స్, పీసీబీ ప్రొటోటైప్ మెషీన్స్, సోల్డరింగ్ స్టేషన్లు, హైఎండ్ ఆసిలోస్కోప్స్‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నారు. దీన్ని త్వరలో ప్రారంభించనున్నారు.
చదవండి: పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : దేశ పారిశ్రామిక రంగంలో ఆటోమేషన్‌ను పెంచే విధంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్