State of States 2021: సమ్మిళిత అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా సమగ్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2021 ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించిందని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే’ సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. 2021 ఏడాదికిగానూ ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్’ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలను ‘ఇండియా టుడే’ సంస్థ తాజాగా ప్రకటించింది.
పనితీరులో ఆరో స్థానం..
ఇండియా టుడే సర్వే ప్రకారం... అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఏపీ తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. 2020 ఏడాది ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021 ఏడాది ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. పనీతీరులో తమిళనాడు రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది.
సర్వే ఇలా..
రాష్ట్రాల పనితీరును నిగ్గు తేల్చేందుకు ఇండియా టుడే సంస్థకు చెందిన ‘మార్కెటింగ్– డెవలప్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్‌ఏ)’ ద్వారా 2003 నుంచి ఏటా స్టేట్ ఆఫ్ స్టేట్స్ సర్వేను నిర్వహిస్తోంది. 2021 ఏడాదిగాను ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టారు. సర్వే బృందంలో ప్రముఖ విధాన నిర్ణేతలు, నీతి ఆయోగ్ ప్రతినిధులు, ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం 123 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి సర్వే చేపట్టారు.
చదవండి: నీతి ఆయోగ్ ఏ తేదీన ఏర్పాటైంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : ఇండియా టుడే ‘‘స్టేట్ ఆఫ్ స్టేట్స్’’ సర్వే
ఎక్కడ : దేశంలో..
ఎందుకు : ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్