Skip to main content

అక్టోబర్ 2018 రాష్ట్రీయం

హైదరాబాద్‌లో పాండ్రాల్ ప్లాంటు
Current Affairs రెల్వేలకు అవసరమైన విడిభాగాల తయారీలో ఉన్న అంతర్జాతీయ సంస్థ పాండ్రాల్... రాహీ టెక్నాలజీస్‌తో కలిసి హైదరాబాద్‌లో అక్టోబర్ 29న ప్లాంటును ప్రారంభించింది. ఏటా 40 లక్షల క్లిప్స్‌ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంటు ద్వారా ప్రధానంగా భారత మార్కెట్‌కు విడిభాగాలను సరఫరా చేస్తారు. ఇక్కడి ఫెసిలిటీలో తయారయ్యే క్లిప్స్‌ను మారిషస్‌లో ఎల్‌అండ్‌టీ నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టుకు వినియోగించనున్నట్టు పాండ్రాల్- రాహీ టెక్నాలజీస్ ఎండీ ప్రదీప్ ఖైతాన్ తెలిపారు. భారత మెట్రో రైల్ ప్రాజెక్టులతోపాటు బంగ్లాదేశ్, ఘనాలో ట్రాక్‌ల పునరుద్ధరణలోనూ వీటిని వాడతారని తెలియజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాండ్రాల్-రాహీ టెక్నాలజీస్ ప్లాంటు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎక్కడ : హైదరాబాద్

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. ఓటరు నమోదు, ఓటుహక్కు వినియోగంలో అవగాహన కల్పించే ‘స్వీప్’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద అక్టోబర్ 30న నిర్వహించిన రంగోలీ కార్యక్రమంతో ఈ రికార్డు దక్కింది. సూమారు 2,500 విద్యార్థులు, 2 వేల మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో 4,66,279 అడుగుల విస్తీర్ణంలో భారీ స్థాయి ఇండియా మ్యాప్‌ను 30 నిమిషాల్లో రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కృష్ణా జిల్లాకు చోటు
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎందుకు : 30 నిమిషాల్లో భారీ స్థాయి ఇండియా మ్యాప్‌ను రూపొందించినందుకు

ఏపీలో వాహనాలకు ఒకే కోడ్ తో రిజిస్ట్రేషన్ నంబర్లు
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కేటగిరీల వాహనాలకు జిల్లాల వారీగా కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒకే కోడ్‌తో రిజిస్ట్రేషన్ నంబర్లను కేటాయించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అక్టోబర్ 31న తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటిదాకా వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కో జిల్లాకు ఒక్కో కోడ్ తో నంబర్ జారీ చేస్తుండగా ఇకపై జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రాన్ని యూనిట్ తీసుకుని ఒకే కోడ్‌తో నంబర్లు కేటాయించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏపీ 38 కోడ్ వరకు నంబర్లు కేటాయించగా మరో 15 రోజుల్లో ఏపీ 39 కోడ్‌తో కొత్త నంబర్లు కేటాయించనున్నారు. దీంతో ఒకే రాష్ట్రం.. ఒకే కోడ్‌ను అమలుచేయనున్న మొదటి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.
మరోవైపు ప్రభుత్వ వాహనాలకు మాత్రం గతంలో మాదిరిగానే పాత సిరీస్‌తో నంబర్లు జారీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సులకు జడ్, పోలీసు వాహనాలకు పి, ఇతర ప్రభుత్వ వాహనాలకు టీ, యూ, వీ, ఎక్స్, వై.. సిరీస్‌లతో నంబర్లు జారీ చేస్తామన్నారు. కోడ్ మాత్రం ఏపీ 39తో ప్రారంభమవుతుందని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అన్ని వాహనాలకు ఒకే కోడ్ తో రిజిస్ట్రేషన్ నంబర్లు
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

విజయవాడలో అంతర్జాతీయ పడవ పోటీలు
Current Affairs నవంబర్ 16, 17, 18 తేదీల్లో విజయవాడ కృష్ణా నదిలో అంతర్జాతీయ పడవ పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెల్లడించారు. అక్టోబర్ 19న ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా నవంబర్ నెలలో విజయవాడలో మూడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ పడవ పోటీలను పున్నమిఘాట్‌లో నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నవంబర్ 23-25 వరకు పున్నమిఘాట్‌లో అమరావతి ఎయిర్‌షోను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మూడు రోజుల పాటు ఉదయం, సాయంత్రం నిర్వహించే యాక్రోబాటిక్ ఎయిర్ షోను రోజుకు లక్షమంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 10న విజయవాడలో సోషల్‌మీడియా ఈవెంట్‌ను నిర్వహిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రిటీని ఎంపిక చేసి, ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ పడవ పోటీలు
ఎప్పుడు: నవంబర్ 16, 17, 18 తేదీల్లో
ఎక్కడ: విజయవాడ
ఎందుకు : పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా

వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ ప్రారంభం
వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ విశాఖపట్నంలో అక్టోబర్ 23న ప్రారంభమైంది. ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం 10 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాజధాని అమరావతిని ప్రపంచంలోనే మేటి ఐటీ సిటీగా, నాలెడ్జి నగరంగా, తిరుపతిని హార్డ్‌వేర్, ఎలక్ట్రానికగ్ హబ్‌గా తయారు చేస్తామన్నారు.
ప్రపంచస్థాయి ఫిన్‌టెక్ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం ‘వన్ మిలియన్ డాలర్ ఛాలెంజ్’ (రూ. 7 కోట్లు) పోటీలను నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 15 దేశాల నుంచి 1,800 మంది ఐటీ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎక్కడ : విశాఖపట్నం

దేశంలోనే ప్రథమంగా బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డులు
దేశంలోనే ప్రథమంగా అంధుల కోసం బ్రెయిలీ లిపిలోనూ ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల (ఎపిక్)ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ కొందరు దివ్యాంగులకు ఈ బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డులను పంపీణి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కరపత్రాలు, మూగ, బధిరులకు అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజితో రూపొందించిన చిత్రాల సీడీలను రావత్ ఆవిష్కరించారు. ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో ఈసీ ఈ చిత్రాలు రూపొందించింది. ఈ చిత్రాలు, కరపత్రాల్లో పోలింగ్ కేంద్రంలో ఎలా ఓటు వేయాలి.. ఈవీఎం మెషీన్లను ఎలా వాడాలి వంటి త దితర వివరాలున్నాయి.
ఐకాన్లుగా దివ్యాంగ సెలబ్రిటీలు..
వివిధ రంగాల్లో సెలబ్రిటీలుగా ఉన్న 9 మంది దివ్యాంగులు ఐకాన్లుగా ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసేందుకు సమ్మతి తెలిపారు. వీరిలో అంధత్వ దివ్యాంగులైన గాయని శ్రావ్య, అంతర్జాతీయ క్రికెటర్లు మహేందర్ వైష్ణవ్, జి.మధు, ఐటీ డెవలపర్ అనీస్ సుల్తానా, రేడియో జాకీ టి.వెంకటేశ్, బధిర దివ్యాంగులు నటి అభినయ, ఆర్థోపెడిక్‌కు సంబంధించి సైంటిస్ట్ (ఆర్ అండ్ డీ) థాండర్ బాబూ నాయక్, బారియర్ ఫ్రీ కంపెయినర్ నర్సింగ్‌రావు, టీవీ యాంకర్ సుజాత వీరిలో ఉన్నారు. ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,12,098 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే ప్రథమంగా బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డులు పంపీణి
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎక్కడ : తెలంగాణ

హైదరాబాద్‌లో అంత ర్జాతీయ విత్తన సదస్సు
Current Affairs
హైదరాబాద్ లో అంతర్జాతీయ విత్తన సదస్సు-2019ను నిర్వహించనున్నారు. ఈ మేరకు విత్తన సదస్సు లోగో, కరదీపికలను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అక్టోబర్ 11న ఆవిష్కరించారు. 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరగనున్న ఈ సదస్సులో 83 దేశాల నుంచి విత్తన పరిశోధన, ఉత్పత్తి, నాణ్యత మొదలగు రంగాలకు చెందిన 800 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ విత్తన సదస్సు-2019
ఎప్పుడు : 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు
ఎక్కడ : హైదరాబాద్

మందారం’సంపుటి ఆవిష్కరణ
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి సాహిత్య ప్రస్థానంపై రూపొందించిన ‘మందారం’సంపుటిని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు అక్టోబర్ 11న ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ అస్తిత్వం, సాహిత్య వికాసంలో నందిని సిధారెడ్డి కృషి విస్మరించలేమన్నారు. సిధారెడ్డి కవిత్వం సమాజిహ తమైనదని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మందారం’సంపుటి ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : మంత్రి హరీశ్‌రావు
ఎక్కడ : తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్‌లో తిత్లీ తూఫాను
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి గ్రామం వద్ద అక్టోబర్ 11న తిత్లీ తూఫాను తీరం దాటింది. గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన తిత్లీ శ్రీకాకుళం జిల్లాలో పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ తుఫాను కారణంగా ఏడుగురు మృతి చెందారు. సుమారు 9 లక్షల మందిపై తూఫాను ప్రభావం పడింది. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినటంతోపాటు సుమారు 1.44 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. జిల్లాలో సగటున 77 మిమీ వర్షపాతం నమోదైంది. మొత్తం మీద తిత్లీ తుఫాను వల్ల జిల్లాలో రూ.1,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తిత్లీ తూఫాను విధ్వంసం
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎక్కడ : శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్

జడ్చర్లలో డీఎస్‌ఎం ప్లాంటు ప్రారంభం
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో డీఎస్‌ఎం సంస్థ తన రెండో ప్లాంటును అక్టోబర్ 15న ప్రారంభించింది. జంతువుల పోషకాహార విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న డీఎస్‌ఎం దాదాపు 174 దేశాలలో కార్యకలాపాలు సాగిస్తుంది. మహారాష్ట్రలోని అంబార్‌లో తొలి ప్లాంటును ఏర్పాటు చేసిన ఈ సంస్థ టర్నోవరు రూ.2 వేల కోట్ల వరకు ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీఎస్‌ఎం నూతన ప్లాంటు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు :
ఎక్కడ : పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, జడ్చర్ల , మహబూబ్‌నగర్, తెలంగాణ

మిర్చి ఎయిర్‌పోర్ట్ రేడియో సర్వీసులు ప్రారంభం
హైదరాబద్‌లోని రాజీవ్‌గాందీ అంతర్జాతీయం విమానాశ్రయం (శంషాబాద్ విమానాశ్రయం)లో మిర్చి ఎయిర్‌పోర్ట్ రేడియో సర్వీసులు ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ప్యాసింజర్ ప్రైమ్ ప్రోగ్రామ్ కింద ఈ రేడియో సర్వీసులను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జీహెచ్‌ఐఎల్) అక్టోబర్ 16న ప్రారంభించింది. ఈ సర్వీసుల ద్వారా ముందుగా రికార్డు చేసిన తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పాటలను అందించనున్నారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఈ రేడియో సేవలు అందుబాటులో ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిర్చి ఎయిర్‌పోర్ట్ రేడియో సర్వీసులు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్
ఎక్కడ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్

తిరుపతిలో డిక్సన్ సంస్థ ప్రారంభం
Current Affairs తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేసే ‘డిక్సన్’ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ మేరకు రూ.150 కోట్ల పెట్టుబడితో నిర్మించిన డిక్సన్ ప్లాంటును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్టోబర్ 4న ప్రారంభించారు. 800 మందికి ఉపాధి కల్పించే ఈ ప్లాంటులో ఎల్‌ఈడీ బల్బులు, టీవీలు, సీసీ కెమెరాలు, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిక్సన్ సంస్థ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : తిరుపతి, ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో క్వాల్కామ్ క్యాంపస్
హైదరాబాద్‌లోని కోకాపేటలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ క్వాల్కామ్ తన ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రం (క్యాంపస్)ను ఏర్పాటు చేయనున్నట్లు అక్టోబర్ 6న ప్రకటించింది. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌లో 5జీ మొబైల్ టెక్నాలజీపై పరిశోధనలు, పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని శాన్‌డియాగో కేంద్రంగా క్వాల్కమ్ పనిచే స్తోంది. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఈ అభివృద్ధి కేంద్రం అమెరికా బయట ఉన్న క్యాంపస్‌లలో అతిపెద్ద క్యాంపస్ కానుందని ఆ సంస్థ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్వాల్కామ్ ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : క్వాల్కమ్
ఎక్కడ : కోకాపేట, హైదరాబాద్

 

కేసరపల్లిలో హెచ్‌సీఎల్ క్యాంపస్‌కు భూమిపూజ
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో ఏర్పాటుచేయనున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యాంపస్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అక్టోబర్ 8న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఈ హెచ్‌సీఎల్ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద సెంటర్‌గా ఉండబోతున్నదని చెప్పారు. ఐటీ, ఎలకా్ర్టనిక్స్ రంగాల్లో కలిపి 2019నాటికి రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యాంపస్ ఏర్పాటుకు భూమిపూజ
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
ఎక్కడ : కేసరపల్లి, గన్నవరం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో వాజ్‌పేయి విగ్రహం
Current Affairs హైదరాబాద్‌లో దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహం, ఎకరా స్థలంలో స్మారక భవనం నెలకొల్పనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 27న జరిగిన తెలంగాణ శాసన మండలి పదో సమావేశంలో ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరాబాద్‌తో వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధం ఉందని, ఆయన జ్ఞాపకాలు, చర్యలు భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలని ఈ సంద ర్భంగా కేసీఆర్ అన్నారు.
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో రాష్ట్రంలో అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని కేసీఆర్ తెలిపారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ

చార్మినార్‌కు స్వచ్ఛ ఐకానిక్ పురస్కారం
స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడమైన చార్మినార్‌కు స్వచ్ఛ ఐకానిక్ పురస్కారం లభించింది. ఈ మేరకు ఢిల్లీలో అక్టోబర్ 2న జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. చారిత్రక కట్టడాల అభివృద్ధి, పునరుద్ధరణ, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ ఐకానిక్ పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : చార్మినార్
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ

హైదరాబాద్‌లో స్టెంట్ల తయారీ పరిశ్రమ
హైదరాబాద్‌లో స్టెంట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయనున్నట్లు సహజానంద మెడికల్ టెక్నాలజీస్ (ఎస్‌ఎంటీ) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అక్టోబర్ 2న ప్రకటించింది. నగర శివార్లలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివెజైస్ పార్కులో రూ.250 కోట్ల పెట్టుబడితే ఈ పరిశ్రమను నెలకొల్పనున్నారు. హృదయ సంబంధిత రోగాలకు జరిపే శస్త్రచికిత్సల్లో వినియోగించే పరికరాల (మినిమల్లీ ఇన్వేసివ్ లైఫ్ సేవింగ్ మెడికల్ డివెజైస్)ను ఈ పరిశ్రమలో తయారు చేయనున్నారు. ఏటా 12.5 లక్షల స్టెంట్లు, 20 లక్షల బెలూన్ కాథెటర్స్ ఈ పరిశ్రమలో ఉత్పత్తికానున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 2,200 ఉపాధి లభించ నుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో స్టెంట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : సహజానంద మెడికల్ టెక్నాలజీస్ (ఎస్‌ఎంటీ) ప్రైవేట్ లిమిటెడ్

ముఖ్యమంత్రి యువనేస్తం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యువనేస్తం పథకంను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలోని ప్రజావేదికలో అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ పథకానికి 15 రోజుల వ్యవధిలో 6.10లక్షల మంది నమోదు చేసుకోగా 2.15లక్షల మందిని ఎంపికచేశారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ.1000 భృతిని అందజేస్తారు.
స్వచ్ఛతే సేవ కార్యక్రమం ప్రారంభం
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబునాయుడు విజయవాడలోని 19వ డివిజన్ రెడ్ సర్కిల్‌లో ప్రారంభించారు. ప్రపంచానికి అహింసా మార్గం చూపిన మహాత్మాగాంధీ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ప్రజలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న ఇద్దరు మహనీయులు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్

గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి ఆరోస్థానం
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్-2018లో ఆంధ్రప్రదేశ్‌కు ఆరోస్థానం లభించింది. ఈ మేరకు గాంధీ జయంతి (స్వచ్ఛత దివాస్) సందర్భంగా అక్టోబర్ 2న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్యశాఖ మంత్రి ఉమాభారతి ఈ ర్యాంకులను ప్రకటించి, అవార్డులు అందజేశారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీ 82.57 శాతం మార్కులను సాధించింది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్-2018లో హరియాణ మొదటి ర్యాంకును కైవసం చేసుకోగా గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది.
పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన నిర్మూలన, తదితర అంశాల ప్రాతిపదికన ఎంపిక చేసిన రాష్ట్రాలకు కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్-2018లో ఆరోస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఆంధ్రప్రదేశ్

Published date : 24 Oct 2018 03:37PM

Photo Stories