Skip to main content

ఆగస్టు 2020 రాష్ట్రీయం

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకానికి ఆమోదం
Current Affairs
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌’ పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను 2020, సెప్టెంబరు 1న ప్రారంభించనున్నారు.
సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌..

  • రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ ప్లస్‌’ పథకాన్ని, మిగిలిన మండలాల్లో ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌’ పథకాన్ని అమలు చేస్తారు.
  • 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1,863 కోట్లు ఖర్చు చేయనుంది. గర్భిణులు, బాలింతలకు ఆరో నెల నుంచి 36 నెలల వరకు, పిల్లలకు 36 నెలల నుంచి 72 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌’ పథకాలకు ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు :గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు

వైఎస్సార్‌ ఆసరాకు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి రూ.27,169 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లించనుంది. ఇందుకోసం ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని ఆగస్టు 19న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మొదటి విడతగా 2020–21కి గాను రూ.6,792.21 కోట్లు చెల్లించనుంది. తద్వారా రాష్ట్రంలోని 9,33,180 డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న దాదాపు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలగనుంది.
త్వరలో జగనన్న విద్యా కానుక...
రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక పథకాన్ని 2020, సెప్టెంబర్‌ 5న ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 19న నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దాదాపు 43 లక్షల మందికి మూడు జతల యూనిఫారమ్‌ (వస్త్రం), టెస్ట్‌ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్‌ పంపిణీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వం రూ.648.09 కోట్లు వెచ్చించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వైఎస్సార్‌ ఆసరా పథకానికి ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు: డ్వాక్రా మహిళలకు 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి రూ.27,169 కోట్లను చెల్లించేందుకు

వైఎస్సార్‌ బీమాకు కేబినెట్ ఆమోదం
రేషన్ కార్డు(బియ్యం కార్డు) ఉండీ కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19న సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది. గతంలో ఎల్‌ఐసీతో కలసి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేది. అయితే దీనిని కొంత కాలం క్రితం ఉపసంహరించుకుంది. దీంతో పేదలకు ప్రయోజనం కల్పించే ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
రూ.583.50 కోట్ల వ్యయం...
రాష్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే వైఎస్సార్‌ బీమా పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకం కింద బియ్యం కార్డుదారుల కుటుంబం ఆధారపడే 18ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు బీమా పరిహారం ఇస్తారు. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారు. 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :వైఎస్సార్‌ బీమా పథకానికి ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ కేబినెట్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు:రేషన్ కార్డు(బియ్యం కార్డు) ఉండీ కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు

బల్క్‌ డ్రగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఏర్పాటు
తూర్పు గోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లలో ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏపీఐఐసీకి అనుబంధంగా ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆగస్టు 19న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ బల్క్‌ డ్రగ్‌ పార్కు ద్వారా వచ్చే 8 ఏళ్లలో రూ.6,960 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.46,400 కోట్ల అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం అంచాన వేస్తోంది. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...

  • వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే ఈ క్లస్టర్‌ ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ క్టస్టర్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.730 కోట్లు ఖర్చు చేస్తుంది.
  • శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు కోసం రైట్స్‌ కంపెనీ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను మంత్రివర్గం ఆమోదించింది. ఈ పోర్టు మొదటి దశ కింద దాదాపు రూ.3,669.95 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ దశలో భాగంగా 2024–25నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హ్యాండ్లింగ్, 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హ్యాండ్లింగ్‌ చేయాలన్నది లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు :ద్వారా వచ్చే 8 ఏళ్లలో రూ.6,960 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.46,400 కోట్ల అమ్మకాలు జరుగుతాయని

డిసెంబర్ నుంచి గడపకే నాణ్యమైన బియ్యం
శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం పథకాన్ని 2020, డిసెంబరు 1 నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు బియ్యం పంపిణీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ప్రభుత్వం ఆరేళ్లపాటు కాంట్రాక్టు ఇవ్వనుంది. వారికి ప్రతి నెల రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించనుంది. ఇందుకు అవసరమైన వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకం కింద 60 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు ఖర్చు చేయనుంది. బియ్యం మొత్తం స్టార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోట్లు, డోర్‌ డెలివరీకి రూ.296 కోట్లు కలిపి ప్రభుత్వం రూ.776 కోట్లు ఖర్చు చేయనుంది.
మంత్రివర్గం నిర్ణయాలు ఇలా...

  • ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) చట్టం–2006 సరవరణల ఆర్డినెన్స్ కు ఆమోదం. తద్వారా సీడ్‌ కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట పడి, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్‌ అందుతుంది.
  • పరిశ్రమల శాఖ రూపొందించిన రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం–2020కి ఆమోదం.
  • విశాఖపట్నం జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో రూ.510 కోట్లతో అదనంగా 115 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల ఏర్పాటు.
  • వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం.
  • పంచాయతీరాజ్‌ శాఖలో తొలిసారిగా 51 డివిజనల్‌ అభివృద్ధి అధికారుల పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020, డిసెంబర్ 1 నుంచి గడపకే నాణ్యమైన బియ్యం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా

ఎయిర్‌పోర్ట్‌ సిటీలో ఎడ్యుపోర్ట్
హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో అద్భుతమైన విద్యాసంస్థ అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ‘ఎడ్యుపోర్టు’ రూపుదిద్దుకోనుంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఎయిరొట్రోపొలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఎల్‌) ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు సెయింట్‌మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎమ్మార్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు ఆగస్టు 20న తెలిపారు. నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా విద్య, పరిశోధనా సంస్థలను అభివృద్ధి చేసే లక్ష్యంతో జీహెచ్‌ఏఎల్‌ ఈ అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ‘ఎడ్యుపోర్ట్‌’పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానమై ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎడ్యుపోర్టు అభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు: జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఎయిరొట్రోపొలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఎల్‌)
ఎక్కడ :హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీ
ఎందుకు:వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం
తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు పంచుతున్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో ఆగస్టు 20న షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందారు. రూ. వందల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. జలవిద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌ ప్యానల్‌ బోర్డులో మంటలు చెలరేగడం, ఆ తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడుతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ఉండగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఏడుగురు జెన్‌కో ఉద్యోగులుకాగా, మిగిలిన ఇద్దరు అమరాన్‌ బ్యాటరీ కంపెనీకి చెందిన వారు.
ఇదే తొలి ప్రమాదం...
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో 20 ఏళ్లుగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నిర్మాణం పనులు 1988– 89లో ప్రారంభయ్యాయి. కేంద్రంలో తొలిసారిగా 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి ఒక్కో యూనిట్‌ నిర్మాణ పనులు పూర్తి కాగా, మొత్తం 6 యూనిట్లను మూడేళ్లలో పూర్తి చేశారు. ఒక్క యూనిట్‌కు 150 మెగావాట్ల చొప్పు న విద్యుత్‌ కేంద్రం మొత్తం 900 మెగావాట్ల విద్యు త్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. విద్యుదుత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ ప్రమాదం జరగడం ఇదే తొలిసారి.

కోపర్తిలో ఎలక్టాన్రిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌
వైఎస్సార్‌ జిల్లా కోపర్తిలో ‘వైఎస్సార్‌ ఎలక్టాన్రిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ)’ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 500 ఎకరాల్లో ఈ క్లస్టర్‌ ఏర్పాటుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 26న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఎంసీ–2 విధానం కింద ఎలక్టాన్రిక్‌ తయారీదారులను ఆకర్షించేందుకు రూ.730.50 కోట్ల పెట్టుబడితో వైఎస్సార్‌ ఈఎంసీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌. కరికల్‌ వలవన్ పేర్కొన్నారు.
గ్రాంట్‌గా రూ.380.50 కోట్లు...
వైఎస్సార్‌ ఈఎంసీ ఏర్పాటుకు కేంద్ర ఎలక్టాన్రిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూ.380.50 కోట్లు గ్రాంట్‌గా సమకూర్చనుంది. మిగిలిన రూ.350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఆటోమోటివ్‌ ఎలక్టాన్రిక్స్, ఇండస్టియ్రల్‌ ఎలక్టాన్రిక్స్, కన్జ్యూమర్‌ ఎలక్టాన్రిక్స్, మెడికల్‌ ఎలక్టాన్రిక్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, టెలికాం నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్, ఈ మొబిలిటీ ఉత్పత్తుల తయారీకి చెందిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీఐఐసీ ఈ ఈఎంసీని అభివృద్ధి చేయనుంది. ఈ క్లస్టర్‌ ద్వారా రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్‌ ఎలక్టాన్రిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ) ఏర్పాటు
ఎప్పుడు: ఆగస్టు 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
ఎక్కడ : కోపర్తి, వైఎస్సార్‌ జిల్లా
ఎందుకు : రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని

పరిశ్రమలకు ఆధార్‌ తరహాలో ప్రత్యేక సంఖ్య
Current Affairs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాలను గుర్తించేందుకు పరిశ్రమలశాఖ ‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర పరిశ్రమ సర్వే2020 (ఎస్‌పీఎస్‌)’ని చేపట్టింది. 2020, అక్టోబర్‌ 15కల్లా సర్వే పూర్తి చేసి అదే నెల 30వ తేదీలోగా పూర్తి సమాచారాన్ని విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్, నీరు, నిపుణులైన మానవ వనరులను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటిస్థానంలో నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • ఎస్‌పీఎస్‌ సర్వే సందర్భంగా రాష్ట్రంలో ప్రతి పరిశ్రమకు ఆధార్‌ తరహాలో 11 అంకెలతో ప్రత్యేక సంఖ్యను కేటాయించి తొమ్మిది రకాల సమాచారాన్ని సేకరిస్తారు.
  • ‌- సర్వే పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్‌ చైర్మన్‌గా 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
పరిశ్రమ ఆధార్‌ అంటే...?
  • పరిశ్రమలకు ఆధార్‌ తరహాలో కేటాయించే 11 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్య ద్వారా అది ఏ రంగానికి చెందిన పరిశ్రమ? ఏ జిల్లాలో ఉంది? అనే వివరాలను సులభంగా గుర్తించవచ్చు.
  • 11 డిజిట్స్‌లో మొదటి మూడు జిల్లాను, తర్వాత రెండు అంకెలు మండలాన్ని సూచిస్తాయి. తదుపరి సంఖ్య ఏ రంగానికి చెందిన పరిశ్రమ? అనే విషయాన్ని తెలియచేస్తుంది. చివరి 5 డిజిట్స్‌ సీరియల్‌ నంబర్‌ ఉంటాయి. ఇలా రాష్ట్రంలోని చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పరిశ్రమలకు ఆధార్‌ తరహాలో ప్రత్యేక సంఖ్య
ఎప్పుడు: ఆగస్టు 13
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎందుకు :పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్, నీరు, నిపుణులైన మానవ వనరులను సమకూర్చేందుకు

మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీకి భూమి పూజ
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో మేధా సర్వో డ్రైవ్స్‌ సంస్థ స్థాపిస్తున్న మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీకి భూమి పూజ జరిగింది. తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డితో కలసి ఆగస్టు 13న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్రైవేటు సెక్టార్‌లో మేధా సంస్థ.. భారతదేశపు అతిపెద్ద రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 1984లో స్థాపించిన ఈ సంస్థ.. ప్రస్తుతం రూ.21 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరుకుందని వివరించారు.
మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ ఏడాదికి 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్స్‌ చొప్పున తయారు చేస్తుందని ఆ సంస్థ ఎండీ యడవెల్లి కశ్యప్‌రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీకి భూమి పూజ
ఎప్పుడు: ఆగస్టు 13
ఎవరు: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ :కొండకల్‌, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

కాకినాడ జేఎన్టీయూతో మిస్సోరి వర్సిటీ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)తో సంయుక్త పరిశోధనలకు అమెరికాలోని ప్రతిష్టాత్మక మిస్సోరి విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఈ మేరకు సంయుక్త పరిశోధనల కోసం మిస్సోరి వర్సిటీ, జేఎన్టీయూలకు అమెరికా ప్రభుత్వం 44 వేల డాలర్ల నిధులు మంజూరు చేసింది. బ్లాక్‌ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా, డేటా మైనింగ్‌ తదితర అంశాల్లో రెండు వర్సిటీల అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధనలు చేస్తారు. మిస్సోరి వర్సిటీ 2020 ఏడాది జేఎన్టీయూతోపాటు ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బొంబాయిలతో పరిశోధనా ఒప్పందాలు చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కాకినాడ జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)తో భాగస్వామ్యం ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: మిస్సోరి విశ్వవిద్యాలయం
ఎందుకు :బ్లాక్‌ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా, డేటా మైనింగ్‌ తదితర అంశాల్లో పరిశోధనకు

ఐఎస్‌బీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
సన్న బియ్యం రకం తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కు మార్కెటింగ్‌ కల్పించేందుకు వ్యవసాయ వర్సిటీలు, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 14న వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందం జరిగింది. రైతులు ఎక్కువగా పండిస్తున్న సన్న బియ్యం రకం ‘తెలంగాణ సోనా’రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పి స్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్శిటీ వైస్‌ చాన్స్ లర్‌ వి.ప్రవీణ్‌రావు అభిప్రాయపడ్డారు.
లీ ఫార్మాకు సీడీఎస్‌సీఓ అనుమతి
హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసూటికల్‌ కంపెనీ లీ ఫార్మాకు ఫావిపిరావిర్‌ యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియెంట్‌ (ఏపీఐ) తయారీకి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) అనుమతి ఇచ్చింది. విశాఖపట్నంలోని స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్ (వీఎస్‌ఈజెడ్‌)లో ఫావిపిరావిర్‌ 200 ఎంజీ ట్యాబ్లెట్స్‌ను తయారు చేస్తామని కంపెనీ తెలిపింది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.27గా ఉంటుందని డైరెక్టర్‌ రఘు మిత్ర చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు: తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు:సన్న బియ్యం రకం తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కు మార్కెటింగ్‌ కల్పించేందుకు

ఇంటింటా ఇన్నోవేటర్‌-2020 ప్రారంభం
వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం కృషి చేసేవారిని గుర్తించి ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ నడుంబిగించింది. దీని కోసం ‘ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్ 2020’ అనే అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్ 2020’ ఆన్ లైన్ వెర్షన్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగస్టు 15న హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు. 2019 ఏడాది 33 జిల్లాల పరిధిలో ‘ఇంటింటా ఇన్నోవేషన్’వాతావరణాన్ని సృష్టించడంలో విజయవంతమైన తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్ సెల్‌ (టీఎస్‌ఐసీ) కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ వెర్షన్ ను ప్రారంభించింది. క్షేత్ర స్థాయిలో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ను నిర్వహిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ పేర్కొన్నారు.
మెరుగైన ఫీచర్లతో అలాప్‌...
టిక్‌టాక్‌ కంటే మెరుగైన ఫీచర్లతో మేడిన్ హైదరాబాద్‌ నినాదంతో రూపొందించిన ‘అలాప్‌’యాప్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ప్రకటించింది. ఈ యాప్‌ను 13 భాషల్లో స్టార్టప్‌ కమ్యూనిటీ ద్వారా రూపొందించినట్లు టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ కుమార్‌ మక్తాల తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అలాప్‌ యాప్‌ టీజర్, లోగోను ఆగస్టు 15న హైదరాబాద్‌లో విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్ 2020 ఆన్ లైన్ వెర్షన్ ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 15
ఎవరు: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ:ప్రగతి భవన్, హైదరాబాద్
ఎందుకు:వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం కృషి చేసేవారిని గుర్తించి ప్రోత్సహించడానికి

సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్‌ సేవలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 17న సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ సేవలను ప్రారంభించారు. దీనిద్వారా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత సులభంగా, సురక్షితంగా, డిజిటల్, క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. కెనరా బ్యాంకు, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సహకారంతో ఈ యూపీఐ సేవలు అందనున్నాయి. యూపీఐ సేవల ప్రారంభం సందర్భంగా సీఎం ప్రసంగించారు.
సీఎం ప్రసంగం-ప్రధానాంశాలు
  • రాష్ట్రంలోని ప్రతి గడప వద్దకూ ప్రభుత్వ సేవలు, పరిపాలనను తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు వలంటీర్ల వ్యవస్థను తెచ్చాం.
  • గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 545కిపైగా సేవలందిస్తున్నాం.
  • ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి వారికి బాధ్యతను అప్పగించాం.
  • ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశాం.
జేఎన్‌టీయూకు శాశ్వత భవనాలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌ శాశ్వత భవనాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 17న తన క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్ నొక్కడం ద్వారా నరసరావుపేటలో శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం రూ.80 కోట్ల వ్యయంతో కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే ఏడాది మరో రూ.40 కోట్లు మౌలిక సదుపాయాల కోసం వ్యయం చేస్తామని, నరసరావుపేట జేఎన్‌టీయూ కోసం మొత్తం రూ.120 కోట్లు వెచ్చిస్తామని సీఎం ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్‌ సేవలు ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ: సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు: సచివాలయాల్లో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు

తెలంగాణలో ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ ప్లాంట్‌ ఏర్పాటు
పాలిమర్‌ ఉత్పత్తుల రంగంలో పేరొందిన ఈస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రూ.1,350 కోట్ల పెట్టుబడితో ‘ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌’ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. ఈస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ సంస్థ చైర్మన్ అరవింద్‌ సింఘానియాతో ఆగస్టు 17న వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించిన మంత్రి ఈ మేరకు తెలిపారు. ఈస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ తమ అత్యాధునిక పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. కంపెనీ నిర్మాణం కోసం తొలి దశలో రూ.500 కోట్లు ఖర్చు చేసి, 2022 మూడో త్రైమాసికం నాటికి పనులు పూర్తి చేస్తారన్నారు. ప్యాకేజింగ్‌ పరిశ్రమకు చెందిన పాలిమర్‌ ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ద్వారా స్థానికంగా 800 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ఏర్పాటు
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: ఈస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థ

ఏఆర్‌ఐఐఏ ర్యాంకుల్లో మద్రాస్‌ ఐఐటీకు తొలి స్థానం
సృజనాత్మక, నూతన ఆవిష్కరణల ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు కేంద్రప్రభుత్వం అటల్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ ఎచీవ్‌మెంట్స్‌ (ఏఆర్‌ఐఐఏ) ద్వారా ర్యాంకులను ప్రకటిస్తోంది. 2020 ఏడాదిగాను ఆరు కేటగిరీల్లోని ఈ ర్యాంకులను ఆగస్టు 18న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు విడుదల చేశారు.
మొదటి కేటగిరీలో...
ఏఆర్‌ఐఐఏ మొదటి కేటగిరీలో మద్రాస్ ఐఐటీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో ముంబై ఐఐటీ, మూడో స్థానంలో ఢిల్లీ ఐఐటీ, నాలుగో స్థానంలో బెంగళూరు ఐఐటీ, ఐదో స్థానంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిలిచాయి. కాన్పూర్, మండీ, రూర్కీలతో సహా 7 ఐఐటీలు, మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్ర నిధుల కేటగిరిలో...
రాష్ట్ర నిధులతో నడిచే విశ్వవిద్యాలయాల కేటగిరీలో మహారాష్ట్రలోని ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ మొదటి స్థానంలో, రెండు, మూడు స్థానాల్లో పంజాబ్‌ యూనివర్సిటీ, ఛౌదరి చరణ్‌ సింగ్‌ హరియాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నాయి.
స్వయం ప్రతిపత్తి సంస్థల కేటగిరీలో…
రాష్ట్ర నిధులతో నడిచే స్వయం ప్రతిపత్తి సంస్థల కేటగిరీలో పుణేలోని ‘కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌’, పీఈఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(బెంగళూరు), కోయంబత్తూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ప్రైవేటు వర్సిటీల్లో ‘ది కళింగ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ మొదటి స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏఆర్‌ఐఐఏ ర్యాంకుల్లోమొదటి కేటగిరీలో తొలి స్థానం
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: మద్రాస్‌ ఐఐటీ

ట్రై క్రాఫ్ట్‌ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ
హస్త కళాకృతులను మార్కెటింగ్‌ చేసేందుకు రూపొందించిన ‘ట్రై క్రాఫ్ట్‌ మొబైల్‌ యాప్‌’ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఆగస్టు 17న ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. జగిత్యాలకు చెందిన రమా శ్రీనివాస్‌ ఈ యాప్ ను అభివృద్ధి చేశారు. హస్త కళాకృ తుల తయారీదారు నుంచి నేరుగా కొనుగోలుదారులకు చేరవేసేందుకు ట్రై క్రాఫ్ట్‌ దోహదం చేస్తుంది. హస్త కళాకృతులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.
రవాణాకు ఆదా ట్రిప్‌
సరుకు రవాణా రంగంలో ఇంధనం, డబ్బు, సమయం వృథాను అరికట్టడంతో పాటు సరుకు రవాణా రంగాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు రూపొందించిన ‘ఆదా ట్రిప్‌’యాప్‌ను మంత్రి కేటీఆర్‌ ఆగస్టు 17న ఆవిష్కరించారు. సరుకుల రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వాహనాలు పూర్తి సామర్థ్యంతో రాకపోకలు సాగించేందుకు సర్వేజన ఐటీ సొల్యూషన్స్ ఈ యాప్‌ను రూపొందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ట్రై క్రాఫ్ట్‌ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు
ఎక్కడ: ప్రగతి భవన్, హైదరాబాద్
ఎందుకు:. హస్త కళాకృ తుల తయారీదారు నుంచి నేరుగా కొనుగోలుదారులకు చేరవేసేందుకు

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకానికి ఆమోదం
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌’ పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను 2020, సెప్టెంబరు 1న ప్రారంభించనున్నారు.
సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌..
  • రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ ప్లస్‌’ పథకాన్ని, మిగిలిన మండలాల్లో ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌’ పథకాన్ని అమలు చేస్తారు.
  • 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1,863 కోట్లు ఖర్చు చేయనుంది. గర్భిణులు, బాలింతలకు ఆరో నెల నుంచి 36 నెలల వరకు, పిల్లలకు 36 నెలల నుంచి 72 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌’ పథకాలకు ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎందుకు :గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు

వైఎస్సార్‌ ఆసరాకు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి రూ.27,169 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లించనుంది. ఇందుకోసం ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని ఆగస్టు 19న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మొదటి విడతగా 2020–21కి గాను రూ.6,792.21 కోట్లు చెల్లించనుంది. తద్వారా రాష్ట్రంలోని 9,33,180 డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న దాదాపు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలగనుంది.
త్వరలో జగనన్న విద్యా కానుక...
రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక పథకాన్ని 2020, సెప్టెంబర్‌ 5న ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 19న నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దాదాపు 43 లక్షల మందికి మూడు జతల యూనిఫారమ్‌ (వస్త్రం), టెస్ట్‌ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్‌ పంపిణీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వం రూ.648.09 కోట్లు వెచ్చించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వైఎస్సార్‌ ఆసరా పథకానికి ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎందుకు: డ్వాక్రా మహిళలకు 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి రూ.27,169 కోట్లను చెల్లించేందుకు

వైఎస్సార్‌ బీమాకు కేబినెట్ ఆమోదం
రేషన్ కార్డు(బియ్యం కార్డు) ఉండీ కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19న సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది. గతంలో ఎల్‌ఐసీతో కలసి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేది. అయితే దీనిని కొంత కాలం క్రితం ఉపసంహరించుకుంది. దీంతో పేదలకు ప్రయోజనం కల్పించే ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
రూ.583.50 కోట్ల వ్యయం...
రాష్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే వైఎస్సార్‌ బీమా పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకం కింద బియ్యం కార్డుదారుల కుటుంబం ఆధారపడే 18ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు బీమా పరిహారం ఇస్తారు. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారు. 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :వైఎస్సార్‌ బీమా పథకానికి ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ కేబినెట్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎందుకు:రేషన్ కార్డు(బియ్యం కార్డు) ఉండీ కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు

బల్క్‌ డ్రగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఏర్పాటు
తూర్పు గోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లలో ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏపీఐఐసీకి అనుబంధంగా ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆగస్టు 19న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ బల్క్‌ డ్రగ్‌ పార్కు ద్వారా వచ్చే 8 ఏళ్లలో రూ.6,960 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.46,400 కోట్ల అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం అంచాన వేస్తోంది. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...
  • వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే ఈ క్లస్టర్‌ ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ క్టస్టర్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.730 కోట్లు ఖర్చు చేస్తుంది.
  • శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు కోసం రైట్స్‌ కంపెనీ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను మంత్రివర్గం ఆమోదించింది. ఈ పోర్టు మొదటి దశ కింద దాదాపు రూ.3,669.95 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ దశలో భాగంగా 2024–25నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హ్యాండ్లింగ్, 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హ్యాండ్లింగ్‌ చేయాలన్నది లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ: తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు :ద్వారా వచ్చే 8 ఏళ్లలో రూ.6,960 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.46,400 కోట్ల అమ్మకాలు జరుగుతాయని

డిసెంబర్ నుంచి గడపకే నాణ్యమైన బియ్యం
శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం పథకాన్ని 2020, డిసెంబరు 1 నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు బియ్యం పంపిణీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ప్రభుత్వం ఆరేళ్లపాటు కాంట్రాక్టు ఇవ్వనుంది. వారికి ప్రతి నెల రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించనుంది. ఇందుకు అవసరమైన వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకం కింద 60 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు ఖర్చు చేయనుంది. బియ్యం మొత్తం స్టార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోట్లు, డోర్‌ డెలివరీకి రూ.296 కోట్లు కలిపి ప్రభుత్వం రూ.776 కోట్లు ఖర్చు చేయనుంది.
మంత్రివర్గం నిర్ణయాలు ఇలా...
  • ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) చట్టం–2006 సరవరణల ఆర్డినెన్స్ కు ఆమోదం. తద్వారా సీడ్‌ కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట పడి, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్‌ అందుతుంది.
  • పరిశ్రమల శాఖ రూపొందించిన రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం–2020కి ఆమోదం.
  • విశాఖపట్నం జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో రూ.510 కోట్లతో అదనంగా 115 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల ఏర్పాటు.
  • వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం.
  • పంచాయతీరాజ్‌ శాఖలో తొలిసారిగా 51 డివిజనల్‌ అభివృద్ధి అధికారుల పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020, డిసెంబర్ 1 నుంచి గడపకే నాణ్యమైన బియ్యం
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా

బ్లాక్‌చెయిన్–పోస్ట్‌ ఆవిష్కరణ
Current Affairs స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి తెలంగాణ ఐటీ విభాగం ఎమర్జింగ్‌ టెక్నాలజీ బ్లాక్‌చెయిన్ తో రూపొందించిన ‘బ్లాక్‌చెయిన్ – ప్రొటెక్షన్ ఆఫ్‌ స్త్రీ నిధి ట్రాన్జాక్ష్స’(బీ–పోస్ట్‌) ప్రారంభమైంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాతో కలిసి ఆగస్టు 6న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్ బీ–పోస్ట్‌ను ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది సంఘాలకు చెందిన మహిళలు ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణాలకు క్రెడిట్‌ రేటింగ్‌ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన కాగి్నటోచెయిన్ అనే స్టార్టప్‌ ‘బీ పోస్ట్‌’ను ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఈవిధానంతో రుణవితరణ, చెల్లింపులు సులువు కానున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి:బ్లాక్‌చెయిన్ – ప్రొటెక్షన్ ఆఫ్‌ స్త్రీ నిధి ట్రాన్జాక్ష్స’(బీ–పోస్ట్‌) ఆవిష్కరణ
ఎప్పుడు: ఆగస్టు 6
ఎవరు: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌
ఎందుకు:స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీల కోసం

మూసీ నదిలో డ్రగ్ రెసిస్టెన్స్ పై పరిశోధన
కృష్ణా నది ఉపనది అయిన మూసీ నదిలోని ‘డ్రగ్‌ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన సాగనుంది. మందుల ఉత్పత్తి తర్వాత ఆయా కంపెనీల నుంచి విడుదలైన ‘యాంటీ బయాటిక్స్‌’వ్యర్థాల గాఢత మూసీలో అత్యధికస్థాయిలో ఉన్నట్టు ఇప్పటికే బయటపడింది. ఈ నేపథ్యంలో వీటిస్థాయి అధికస్థాయిలో ఉన్న మూసీతోపాటు తక్కువస్థాయిలో ఉన్న చెన్నైలోని అడయార్‌ నదిపైనా ఈ పరిశోధన జరగనుంది. ఇండో–యూకే ప్రాజెక్ట్‌లో భాగంగా బ్రిటన్ బర్మింగ్ హామ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ అధ్యయనంలో ఐఐటీ–హైదరాబాద్‌ కూడా భాగస్వామి కానుంది.
1.2 మిలియన్ పౌండ్‌లు...
ఈ కొత్త పరిశోధక ప్రాజెక్ట్‌ కోసం ఇండియా, యూకే కలిసి 1.2 మిలియన్ పౌండ్‌ స్టెర్లింగ్‌లు కేటాయించాయి. బ్రిటన్–ఇండియా ప్రభుత్వాల సహకారంతో 8 మిలియన్ల పౌండ్‌ స్టెర్లింగ్‌ల ఖర్చులో నిర్వహిస్తున్న యాంటీ–మైక్రోబియల్‌ రెసిస్టెన్స్(ఏఎంఆర్‌) సైంటిఫిక్‌ రీసెర్చ్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. తల్లుల నుంచి సోకే ‘సూపర్‌ బగ్‌ ఇన్ఫెక్షన్ల’తో భారత్‌లో ప్రతియేటా 58 వేల చిన్నారులు మృత్యువాత పడుతున్నట్టు, యూరప్‌ యూనియన్ లో ప్రతి ఏడాది 28–38 వేల మధ్యలో ‘డ్రగ్‌ రెసిస్టెన్స్ పాథోజెన్ల’తో మరణాలు సంభవిస్తున్నట్టు అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి:డ్రగ్‌ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాపై పరిశోధన
ఎప్పుడు: ఆగస్టు 6
ఎవరు: బ్రిటన్ బర్మింగ్ హామ్‌ యూనివర్సిటీ, ఐఐటీ–హైదరాబాద్‌
ఎక్కడ: మూసీ నది, అడయార్‌ నది

జాతీయ చేనేత దినోత్సవం
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చేనేత రంగంలోని 40 వేల కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7) సందర్భంగా చేనేత, జౌళి శాఖల అధికారులు, కలెక్టర్లు, చేనేత కార్మికులతో ఆగస్టు 7న నిర్వహించిన వర్చువల్‌ సమావేశం మంత్రి పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ‘నేతన్నకు చేయూత’ పథకం కింద కరోనా సమయంలో రూ.93 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.10.24 కోట్లతో పోచంపల్లి, ఆలేరు, కనుకుల, శాయంపేట, కమలాపూర్, ఆర్మూర్, వెల్టూర్, వేములవాడలో బ్లాక్‌ లెవల్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్కు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించామని, గద్వాల చేనేత పార్కుకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు.
ఆలంబన యాప్ ఆవిష్కరణ
చేనేత జౌళి శాఖ రూపొందించిన ‘ఆలంబన యాప్‌’ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు గ్రహీతలకు ఇస్తున్న నగదు పురస్కారాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని మంత్రి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన 18 మంది కళాకారులకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేనేత పురస్కారాలు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:జాతీయ చేనేత దినోత్సవం
ఎప్పుడు: ఆగస్టు 7
ఎవరు: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అధ్యయన కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని అధ్యక్షతన ఐదుగురు అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆగస్టు 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, సాధారణ పరిపాలన (సర్వీసెస్‌) శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలి.
కమిటీకి ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాలు..
  • ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం.
  • పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్‌ స్థాయిల్లో నిర్దిష్ట బాధ్యతలున్నాయి. పునర్వ్యవస్థీకరణలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.
  • ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలుండాలి.
  • వీలైనంత తక్కువ వ్యయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి.
  • ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని భౌగోళిక సరిహద్దులు, పరిపాలన కేంద్రాలను సూచిస్తూ 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ సిఫార్సులు చేయాలి.
ఇందు కోసమే కొత్త జిల్లాలు...
  • ప్రభుత్వ సేవలను, పాలనను ప్రజల గడప ముందుకే తీసుకువెళ్లడం ద్వారా వారిలో సంతృప్త స్థాయిని పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.
  • ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది.
  • ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అధ్యయన కమిటీ
ఎప్పుడు: ఆగస్టు 7
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు:రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేసేందుకు

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్స్‌ కేంద్రం ఏర్పాటు
వైద్య ఉపకరణాల తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ‘మెడ్‌ట్రానిక్స్‌’సంస్థ హైదరాబాద్‌లో రూ.1,200 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ఆగస్టు 11న వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఒమర్‌ ఇస్రాక్‌తో జరిగిన వర్చువల్‌ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడారు. మెడ్‌ట్రానిక్స్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా మెడికల్‌ టెక్నాలజీ రంగంలో మరిన్ని పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
అమెరికా బయట అతిపెద్ద సెంటర్‌
మెడ్‌ట్రానిక్స్‌ పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ఆ సంస్థతో చర్చలు కొనసాగిస్తూ వచ్చింది. గతంలో అమెరికా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మెడ్‌ట్రానిక్స్‌ చైర్మన్ ఇస్రాక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా బయట అతిపెద్ద ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఏర్పాటుకు ఆయన సంసిద్ధత వ్యక్తంచేశారు. ప్రస్తుత ఒప్పందం ద్వారా వచ్చే ఐదేళ్లలో మెడ్‌ట్రానిక్స్‌ రూ.1200 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌) ఏర్పాటు
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: మెడ్‌ట్రానిక్స్‌ సంస్థ
ఎక్కడ: హైదరాబాద్

పరిశ్రమలకు దన్నుగా వైఎస్సార్‌ ఏపీ వన్‌
ఓ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన మొదలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా జీవితకాలం అండగా నిలిచే విధంగా దేశంలోనే తొలిసారిగా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి నష్టభయం లేకుండా హ్యాండ్‌ హోల్డింగ్‌ కల్పించాలన్న ఉద్దేశంతో... 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ను పొందుపరిచారు. ఏపీఐఐసీ కార్యాలయంలో ఆగస్టు 10న జరిగిన కార్యక్రమంలో నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా విడుదల చేశారు.
నూతన విధానంలోని ముఖ్యాంశాలు
  • మహిళా సాధికారితలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు నెలకొల్పే పరిశ్రమలకు అధిక రాయితీలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానం రూపొందింది.
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా రంగాలవారీగా క్లస్టర్ల విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల యజమానులకు నిర్వహణ వ్యయం బాగా తగ్గేవిధంగా నూతన విధానం అవకాశం కల్పిస్తుంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఎస్‌సీలకు 16.2 శాతం, ఎస్‌టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
ఏపీ వన్‌లో 10 కీలక సేవలు..
వైఎస్‌ఆర్‌ ఏపీ వన్‌ ద్వారా 10 కీలక సేవలను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించనుంది. ఇందుకోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఫెసిలిటేషన్‌ సెల్, మార్కెట్‌ రీసెర్చ్‌ సెల్, మార్కెటింగ్‌ అండ్‌ బ్రాండింగ్‌ సెల్, సేల్స్‌ సపోర్ట్‌ సెల్, స్కీం సపోర్ట్‌ సెల్, ఎంఎస్‌ఎంఈ రీవిటలైజేషన్‌ స్కీం, బిజినెస్‌ ఏనేబుల్‌మెంట్‌ సెల్, ఇన్వెస్టర్‌ రీచ్‌ ఔట్‌ సెల్, ఇన్సెంటివ్‌ మేనేజ్‌మెంట్‌ సెల్, స్పెషల్‌ కేటగిరీ సెల్‌ ఏర్పాటు చేసింది.
తగ్గనున్న పెట్టుబడి వ్యయం
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడి వ్యయం చాలా తక్కువయ్యే విధంగా అన్ని మౌలిక వసతులతో కూడిన పారిశ్రామిక పార్కులను క్లస్టర్ల విధానంలో అభివృద్ధి చేయనున్నారు. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని రంగాలవారీగా పారిశ్రామిక క్లస్టర్లు, పార్కులు అభివృద్ధి చేయనున్నారు. బొమ్మల తయారీ, ఫర్నిచర్, ఫుట్‌వేర్‌లెదర్, మెషినరీ, ఏయిరోస్పేస్, డిఫెన్స్‌ వంటి రంగాల పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య, వారికున్న నైపుణ్యాలు, రాష్ట్రంలో ఉన్న యూనిట్లకు ఎంత మంది ఉద్యోగులు అవసరం? తదితర వివరాలన్నీ ఒకేచోట లభించేలా డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు రెండు స్కిల్డ్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:2020–23 నూతన పారిశ్రామిక విధానం
ఎప్పుడు: ఆగస్టు 10
ఎవరు: ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా
ఎక్కడ:ఏపీఐఐసీ కార్యాలయం, అమరావతి

పీఎంయూ కాల్‌సెంటర్‌ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. నిర్దేశిత సమయంలోగా వినతులు, దరఖాస్తుల పరిష్కారం, అమలును పర్యవేక్షించేందుకు పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 10న తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దరఖాస్తు ఎక్కడ ఆగినా సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా పీఎంయూ కాల్‌సెంటర్‌ పనిచేస్తుంది. పీఎంయూలో 200 మంది సిబ్బంది పనిచేస్తారు. మొదటగా నాలుగు రకాల సేవలపై పర్యవేక్షణను అమల్లోకి తెచ్చారు. అక్టోబర్‌ నుంచి 543 రకాలకుపైగా సేవలపై పీఎంయూ దృష్టి సారించనుంది. సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మార్గదర్శకాలను బోర్డుల ద్వారా ప్రజలకు వెల్లడించాలని సీఎం పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ) ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 10
ఎవరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు:నిర్దేశిత సమయంలోగా వినతులు, దరఖాస్తుల పరిష్కారం, అమలును పర్యవేక్షించేందుకు

ఏఐ4ఏఐ వర్చువల్‌ సదస్సు
సెంటర్‌ ఫర్‌ ది ఫోర్త్‌ ఇండ్రస్టియల్‌ రివల్యూషన్ (సీ4ఐఆర్‌), వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫర్‌ అగ్రికల్చర్‌ ఇన్నోవేషన్స్ (ఏఐ4ఏఐ) వర్చువల్‌ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగస్టు 12న కీలకోపన్యాసం చేశారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) సహా అత్యాధునిక ఐటీ సాంకేతికత (ఎమర్జింగ్‌ టెక్నాలజీ)లో ప్రపంచ స్థాయిలో గుర్తింపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
మంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
  • తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2020ని కృత్రిమ మేధో సంవత్సరంగా ప్రకటించింది.
  • ‌- ఏఐ ద్వారా సమాజానికి అవసరమయ్యే ఆవిష్కరణల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు నాస్కామ్‌ భాగస్వామ్యంతో తెలంగాణ ఏఐ మిషన్ (టీ–ఎయిమ్‌)ను ఏర్పాటు చేశాం.
  • వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ఏఐ4ఏఐ వర్చువల్‌ సదస్సు
ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం
రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 12న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్న ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున నగదును ముఖ్యమంత్రి జమ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అందించనున్నారు. ఇందుకోసం ఏటా రూ.4,687 కోట్లు వ్యయం కానుంది.
వైఎస్సార్‌ చేయూత ప్రారంభం సందర్భంగా వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులు, కలెక్టర్లను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని, వైఎస్సార్‌ చేయూత ద్వారా నాలుగేళ్లూ కచ్చితంగా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 22,28,909 మంది అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ: సీఎం క్యాంపు కార్యలయం, తాడేపల్లి
ఎందుకు:రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్‌ క్లబ్‌ ప్రారంభం
Current Affairs
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని(జూలై 30) పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్లు సంయుక్తంగా జూలై 30న యాంటీ హ్యూమన్ట్రాఫికింగ్‌ క్లబ్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెబినార్‌లో ప్రసంగిస్తూ.. మానవ అక్రమ రవాణా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా... ప్రతి జిల్లాలో యాంటీ హ్యూమన్ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
రెడ్‌రోప్‌ స్వచ్ఛంద సంస్థ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ల సహకారంతో ఏపీ మహిళా కమిషన్జూలై 30న నిర్వహించిన వెబినార్‌లో ఏపీ మహిళా కమిషన్చైర్‌పర్సన్వాసిరెడ్డి పద్మ ప్రసంగించారు. మరోవైపు ‘చైల్డ్‌ లైన్–1098, ఫోరం ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌’ ఆధ్వర్యంలో బాలలను, మహిళలను అప్రమత్తం చేస్తూ రూపొందించిన పోస్టర్‌ను, చైల్డ్‌లైన్–1098 లోగోతో కోవిడ్‌ మాస్క్‌లను ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీ పీవీ సునీల్‌కుమార్‌ ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యాంటీ హ్యూమన్ట్రాఫికింగ్‌ క్లబ్‌ ప్రారంభం
ఎప్పుడు: జూలై 30
ఎవరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్
ఎందుకు: ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని(జూలై 30) పురస్కరించుకుని

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత
కృష్ణా నదీ జలాలను మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా ముందుకెళ్లొద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనా«థ్‌దాస్‌కు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనా జూలై 30న లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని మళ్లించేందుకు ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్ధమైందని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిస్పందించిన బోర్డు, ఏపీకి ఈ లేఖ రాసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత
ఎప్పుడు: జూలై 30
ఎవరు : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు
ఎందుకు: కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా ముందుకెళ్లొద్దని

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ జూలై 31న ఆమోదించడంతో అవి చట్టాలుగా మారాయి. ఆ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహర్‌రెడ్డి జూలై 31న వేర్వేరుగా గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు సాకారం కానుంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం ఆ రెండు బిల్లులకు రూపకల్పన చేసింది.
ఆమోదం పొందక పోయినా...

  • ఆర్టికల్‌ 197(1)(బి) ప్రకారం దిగువ సభ ఆమోదించిన ఒక బిల్లు ఎగువ సభకు వెళ్లి ఆమోదం పొందక పోయినా, నిలిచి పోయినా మూడు నెలల నిర్ణీత వ్యవధి దాటితే మళ్లీ శాసనసభ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రకారం రెండోసారి జూన్ 16న సమావేశమైన శాసనసభ మరోసారి ఈ బిల్లులను ఆమోదించి పంపింది.
  • ఆర్టికల్‌ 197(2)(బి) ప్రకారం ఇలా రెండోసారి కూడా ఎగువ సభ ఆమోదం పొందకుండా ఒక బిల్లు నిలిచి పోతే, 30 రోజుల వ్యవధి కనుక దాటితే ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల విషయంలో కూడా అదే జరిగింది.
  • నిబంధనల మేరకు శాసన వ్యవస్థ ఈ బిల్లులను ఆమోదించడంతో జూలై 18న గవర్నర్‌ వద్దకు పంపారు. గవర్నర్‌ ఆ బిల్లులను ఆమోదించడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

సీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు

సీఆర్‌డీఏ (క్యాపిటల్‌ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ) రద్దు బిల్లును ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ జూలై 31న ఆమోదించడంతో ఇక ఆ సంస్థ కనుమరుగుకానుంది. ఆ స్థానంలో ఏఎంఆర్‌డీఏ (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు కానుంది. సీఆర్‌డీఏ కార్యకలాపాలన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏ నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ ఉద్యోగులంతా ఏఎంఆర్‌డీఏ ఉద్యోగులుగా మారతారు.
  • భూసమీకరణ సహా రాజధాని వ్యవహారాలన్నీ ఈ సంస్థే నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ చేసుకున్న అగ్రిమెంట్లు, కాంట్రాక్టులన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏ కిందకు వస్తాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న ప్రాంతమంతా ఏఎంఆర్‌డీఏ కిందకు వస్తుంది. రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఏఎంఆర్‌డీఏ కృషి చేస్తుంది.
  • 2014 డిసెంబర్‌లో టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం ద్వారా సీఆర్‌డీఏ ఏర్పాటైంది.
  • అప్పటివరకూ ఉన్న వీజీటీఎం ఉడా (విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ) స్థానంలో సీఆర్‌డీఏను ఏర్పాటు చేశారు.
  • ‘వీజీటీఎం ఉడా’ 2014లో ‘సీఆర్‌డీఏ’గా మారగా ఇప్పుడు ‘ఏఎంఆర్‌డీఏ’గా కొత్తరూపం దాల్చనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు: జూలై 31
ఎవరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్

విద్యావారధి వాహనాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆరీ్ట), రాష్ట్ర విద్యా పరిపాలన శిక్షణా సంస్థ (సీమ్యాట్‌) సంయుక్తంగా రూపకల్పన చేసిన విద్యావారధి వాహనాలు ప్రారంభమయ్యాయి. సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జూలై 31న జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఈ వాహనాలను ప్రారంభించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో విద్యాసంస్థలు తెరవలేని పరిస్థితి ఉన్నందున విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో భాగంగా ప్రభుత్వం ఆన్ లైన్, డిజిటల్, మొబైల్‌ వాహనాల రూపకల్పన చేసింది. పాఠశాలలు పున:ప్రారంభమయ్యేంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలు విద్యావారధి మొబైల్‌ వ్యాను టీవీ తెరల ద్వారా బోధిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: విద్యావారధి వాహనాలు ప్రారంభం
ఎప్పుడు: జూలై 31
ఎవరు: విద్యాశాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌
ఎందుకు: టీవీ తెరల ద్వారా పాఠ్యాంశాల బోధనకు

టెక్సాస్‌తో వర్సిటీతో టిటా భాగస్వామ్యం
ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న సైబర్‌ మోసాలను అరికట్టేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) నడుం బిగించింది. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (యూటీడీ) సాయంతో, ‘డిజిథాన్’భాగస్వామ్యంతో ‘సైబర్‌ రెడీ ప్రోగ్రామ్‌’పేరిట సైబర్‌ సెక్యూరిటీపై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఆస్తులను కాపాడే లక్ష్యంతో 2022 నాటికి 10 వేల మందికి శిక్షణ ఇవ్వాలని టిటా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ శిక్షణ పొందిన వారికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ను యూటీడీ, డిజిథాన్ టిటా వెల్లడించింది.
ఓజోనిట్‌ ఆవిష్కరణ
కరోనా వైరస్‌ నివారణ, నియంత్రణ కోసం వరంగల్‌ నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) అధ్యాపకులు ‘ఓజోనిట్‌’అనే నూతన పరికరాన్ని ఆవిష్కరించారు. నిట్‌ వరంగల్‌ ఫిజిక్స్‌ విభాగాధిపతి డి.దినకర్‌ సారథ్యంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.హరనాథ్, పీహెచ్‌డీ స్కాలర్‌ పి.చందర్‌రావు సంయుక్తంగా ఈ ఓజోనిట్‌ పరికరాన్ని ఆవిష్కరించారు. మల్టిపుల్ స్టెరిలైజేషన్ గా రూపొందించిన ఈ పరికరం ఇళ్లలో ఉపయోగించే ఫ్రిజ్‌ మాదిరిగా ఉంటుంది. ఈ పరికరం దానిలో ఉంచిన వస్తువులపై ఉన్న వైరస్, ఫంగస్, బ్యాక్టీరియాలను అరగంటలో హతం చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (యూటీడీ) భాగస్యామ్యం
ఎప్పుడు: జూలై 31
ఎవరు: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా)
ఎందుకు: సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఆస్తులను కాపాడే లక్ష్యంతో 2022 నాటికి 10 వేల మందికి శిక్షణ ఇవ్వాలని

ఏపీలో ఇంధన పొదుపుపై బీఈఈ అధ్యయనం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల్లో ఇంధన పొదుపు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఏపీలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో చేపట్టే.. అంతర్జాతీయ ఇంధన పొదుపు సాంకేతికతకు ఈ అధ్యయనం కీలకం కానుంది. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ. చంద్రశేఖర్‌ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

  • విద్యుత్‌ వినియోగం అధికంగా ఉండే గ్లాస్, రిఫ్రాక్టరీ పరిశ్రమలను అధ్యయనం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ను బీఈఈ ఎంపిక చేసింది. ఈ అధ్యయన బాధ్యతను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్స్టిట్యూట్‌–టెరీ’కు అప్పగించింది.
  • అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ జాబితా ప్రకారం మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రిఫ్రాక్టరీ పరిశ్రమల్లో ఏడాది పాటు టెరీ అధ్యయనం చేస్తుంది. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా జాతీయ స్థాయిలో ఎంఎస్‌ఎంఈల కోసం బీఈఈ ఒక రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తుంది.
  • రాష్ట్రంలో విద్యుత్‌ పొదుపుకు అపార అవకాశాలున్నాయని టెరీ గతంలో నిర్వహించిన ఓ సర్వేలో గుర్తించింది. దీంతో అన్ని స్థాయిల్లోనూ అత్యాధునిక సాంకేతికత, పొదుపు చేయగల విద్యుత్‌ ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంధన పొదుపు సంస్థ
  • కృషి చేస్తోంది.
  • ఎంఎస్‌ఎంఈ రంగంలో నూతన ఎనర్జీ ఎఫిషియన్సీ సాంకేతికత అమలు చేస్తున్న ఇంధన శాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నదని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. రాష్ట్రంలో చేపట్టే అధ్యయనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆయన ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎంఎస్‌ఎంఈపరిశ్రమల్లో ఇంధన పొదుపు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు అధ్యయనం
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

రక్షణ కోసం తొలిసారిగా పక్షుల వినియోగం
అడవుల్లోని మావోయిస్టు దళాల కదలికలను గుర్తించేందుకు పోలీసులు ఉపగ్రహాల చిత్రాలు, డ్రోన్లు వాడేవారు. నిత్యం దండకారణ్యంలో తిరుగాడే మావోలు కూడా ఇప్పుడు డ్రోన్లు వాడుతూ పోలీసుల కదలికలను తెలుసుకుంటూ వారి కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తు వేసేలా మావోలు, ఇతర సంఘ విద్రోహకశక్తుల డ్రోన్లను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు పలు గద్దలు, డేగలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు హోంశాఖ చేసిన ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దేశంలోనే తొలిసారి...
పోలీసు శాఖలోని వివిధ విభాగాలకుతోడు అశ్వ, జాగిల దళాలు పోలీసుల విధినిర్వహణకు ఎంతో దోహదపడుతున్నాయి. ఈ రెండింటినీ పోలీసులు ప్రత్యేక దళాలుగా చూస్తారు. ఇప్పుడు గరుడదళం చేరింది. గరుడదళాన్ని వినియోగించడం దేశంలోనే ఇదే తొలిసారి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్ ట్రెయినింగ్‌ అకాడమీ(ఐఐటీఏ)లో ఈ గరుడ దళానికి శిక్షణ ఇవ్వనున్నారు. నెదర్లాండ్స్‌ పోలీసులు తొలిసారిగా డ్రోన్లను పట్టుకోవడంలో డేగ, గద్దలకు శిక్షణ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రక్షణ కోసం దేశంలో తొలిసారిగా పక్షుల వినియోగం
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: తెలంగాణ పోలీసులు

మూడు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
మహిళల స్వయం సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఇటీవలే గుజరాత్‌కు చెందిన అమూల్‌తో ఒప్పందం చేసుకోగా..తాజాగా ఆగస్టు 3న మరో మూడు ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును మహిళలందరూ సద్వినియోగం చేసుకునేలా ఈ కంపెనీలు సహకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ద్వారా ఈ కంపెనీలు వారికి తోడ్పాటునందిస్తాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
మూడు కంపెనీలు ఇవే...
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్‌ కంపెనీలతో ఆగస్టు 3న రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీనియర్‌ మేనేజర్‌ జోసెఫ్‌ వక్కీ, ఐటీసీ డివిజనల్‌ సీఈఓ రజనీకాంత్‌ కాయ్, హెచ్‌యూఎల్‌ జీఎస్‌ఎం చట్ల రామకృష్ణారెడ్డి వేర్వేరుగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్‌యూఎల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మెహతా, ఐటీసీ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ పూరి, ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీఈఓ, ఎండీ మధుసూదన్ గోపాలన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్‌ కంపెనీలతో ఒప్పందం
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు:మహిళల స్వయం సాధికారత కోసం

మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్
మహిళలపై సైబర్‌ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు రూపొందించిన ‘ఈ–రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. రాఖీ పండుగను పురస్కరించుకుని ఆగస్టు 3న సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ–రక్షాబంధన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదని అన్నారు.
మరో కార్యక్రమం...
  • 4s4u.ap.police.gov.in అనే పోర్టల్‌ను కూడా సీఎం ప్రారంభించారు.
  • రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్‌ చానల్లో వివిధ నిపుణులతో మహిళలకు అవగాహన కల్పిస్తారు.
  • స్మార్ట్‌ఫోన్‌ వల్ల మంచి ఏంటి? చెడు ఏంటి? నష్టాలేంటి? వేధింపులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కలిగిస్తారు.
  • సైబర్, వైట్‌కాలర్‌ నేరాలు.. తదితర అంశాలనూ వివరిస్తారు.
  • ఏయే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, ఏ యాప్‌లవల్ల ఇబ్బందులు వస్తాయన్న వాటి గురించి కూడా చెబుతారు.
  • నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలో తెలియజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఈ–రక్షాబంధన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ: సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు:మహిళలపై సైబర్‌ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు

ఐఎస్‌బీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో ఆగస్టు 5న ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సమక్షంలో ఏపీ ఈడీబీసీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐఎస్‌బీ డీన్‌ ప్రొఫెసర్‌ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలు చేయడం ద్వారా వర్చువల్‌ ఒప్పందం జరిగింది.
పబ్లిక్‌ పాలసీ ల్యాబ్‌ ఏర్పాటు...
  • ఏపీని అభివృద్ధి పథంవైపు నడిపేందుకు ఐఎస్‌బీతో కలిసి ‘పబ్లిక్‌ పాలసీ ల్యాబ్‌’ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు.
  • ఐఎస్‌బీ ఒప్పందంతో పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాలవలవన్‌ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో ఒప్పందం
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు:పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు

సచివాలయం కొత్త భవన నిర్మాణానికి ఆమోదం
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ర్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లను ఆమోదించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆగస్టు 5న ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్‌–బీపాస్‌ పాలసీని కూడా మంత్రివర్గం ఆమోదించింది.
కేబినెట్ నిర్ణయాలు..
  • కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు నిర్వహించాలి. ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలి
  • గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాత విద్యుత్‌ బిల్లుల బకాయిలను వన్ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలి
  • ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మేయడానికి ఆమోదం
  • దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానం
  • కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో 2020 ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలి
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: తెలంగాణ కేబినెట్

తెలంగాణలో నూతన ఉద్యోగ విధానం
తెలంగాణలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆగస్టు 5న ఆమోదించింది. ఈ నూతన విధానంలో భాగంగా... స్థానిక మానవ వనరులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు జీఎస్టీలో రాయితీ, విద్యుత్‌ చార్జీల్లో ప్రోత్సాహకాలు, పుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. సెమీ స్కిల్డ్‌ కేటగిరీలో 70 శాతం, స్కిల్డ్‌ కేటగిరీలో 60 శాతం స్థానికుల కు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తారు. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా టీ ప్రైడ్, టీ ఐడియాలో భాగంగా పరిశ్రమలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తోంది.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...
  • టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుండటంతో స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలశాఖ రూపొందించిన ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది.
  • వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం, తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్ పాలసీ’ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:నూతన ఉద్యోగ విధానానికి ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం
ఎందుకు:తెలంగాణలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు

హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీకి ఆమోదం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐటీ పరిశ్రమల కారిడార్‌గా పేరొందిన పశ్చిమ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదిత హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీని కేబినెట్‌ ఆగస్టు 5న ఆమోదించింది. 2019–20లో హైదరాబాద్‌ 18 శాతం వృద్ధి రేటుతో రూ.1,18,000 కోట్ల ఐటీ ఎగుమతులను సాధించగా, ఇందులో 90 శాతం పశ్చిమ కారిడార్‌ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, వీటి పరిసర ప్రాంతాల నుంచే వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి:హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీకి ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: తెలంగాణ కేబినెట్
ఎందుకు:రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు
Published date : 01 Sep 2020 12:02PM

Photo Stories