ఆగష్టు 2019 రాష్ట్రీయం
Sakshi Education
హెచ్‌సీయూలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ ఆడిటోరియంలో ఆగస్టు 28 నుంచి 30 వరకు ‘వ్యవసాయం, పశుసంవర్థక రంగాల’పై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచ ఆహార భద్రతతోపాటు 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు సదస్సు కన్వీనర్ జువ్వాడి దేవీప్రసాద్ ఆగస్టు 25న తెలిపారు. ఈ సదస్సును హైదరాబాద్ లైఫ్ సైన్స్ సొసైటీ, పసురా గ్రీన్ విజనరీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆగస్టు 28, 30 తేదిల్లో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 25
ఎక్కడ : హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, హైదరాబాద్
హైదరాబాద్‌లో వన్ ప్లస్ ఆర్‌అండ్‌డీ సెంటర్
ప్రీమియం మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా సంస్థ వన్ ప్లస్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌అండ్‌డీ సెంటర్) నెలకొల్పింది. 1,86,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కేంద్రాన్ని తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మేల్యే కె. తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆగస్టు 26న ప్రారంభించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వన్ ప్లస్ ఫౌండర్, సీఈవో పీట్ లావ్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వన్ ప్లస్ ఆర్‌అండ్‌డీ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మేల్యే కె. తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
ఎక్కడ : నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్
కేంద్ర హోం మంత్రితో సీఎం జగన్ సమావేశం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 26న జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 13లో పొందుపరిచిన నిబంధనల మేరకు మౌలిక వసతుల ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అమిత్ షాను జగన్ కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక పెండింగ్ అంశాలను మంత్రికి నివేదించారు.
మరోవైపు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అంశాన్ని మంత్రితో జగన్ చర్చించారు. పోలవరంపై కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఈ సందర్భంగా మంత్రి షెకావత్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఢిల్లీ
కృష్ణపట్నంలో బీపీసీఎల్ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్
ప్రభుత్వ రంగ చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం వద్ద ఫ్లోటింగ్ ఎల్‌ఎన్‌జీ ఇంపోర్ట్ టెర్మినల్‌ను నిర్మించనుంది. ఈ విషయాన్ని బీపీసీఎల్ చైర్మన్ డి.రాజ్‌కుమార్ ఆగస్టు 26న వెల్లడించారు. రూ.1,500-1,700 కోట్ల పెట్టుబడితో.. 2022 నాటికి ఈ టెర్మినల్‌ను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులో బీపీసీఎల్‌కు 74 శాతం, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీకి 26 శాతం వాటా ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ఈ ఫ్లోటింగ్ స్టోరేజ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ వార్షిక సామర్థ్యం 10 లక్షల టన్నులుగా ఉంటుందని... భవిష్యత్తులో దీనిని 50 లక్షల టన్నుల సామర్థ్యానికి చేర్చవ చ్చన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీపీసీఎల్ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : బీపీసీఎల్ చైర్మన్ డి.రాజ్‌కుమార్
ఎక్కడ : కృష్ణపట్నం, ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో రఫేల్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్‌లో ఏర్పాటయిన ఆస్ట్రా రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్ (ఏఆర్‌సీ) స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంటర్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగస్టు 26న ప్రారంభించారు. శంషాబాద్ సమీపంలోని హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయిన ఈ సెంటర్ డిఫెన్స్ కమ్యూనికేషన్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ బలగాలకు ట్యాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ను (బీఎన్‌ఈటీ) అభివృద్ధి చేస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ (ఏఎంపీఎల్), ఇజ్రాయల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్డ్స్ డిఫెన్స్ సిస్టమ్ (ఆర్‌ఏడీఎస్‌ఎల్) కలిసి ఈ ఏఆర్‌సీ సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ సెంటర్‌లో ఆస్ట్రాకు 51 శాతం, రఫేల్‌కు 49 శాతం వాటాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రా రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్ (ఏఆర్‌సీ) స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి
ఎక్కడ : శంషాబాద్, హైదరాబాద్
ఏపీలో పథకాల అమలు ప్రణాళిక విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలు ప్రణాళికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగస్టు 27న ప్రకటించారు. సంక్షేమ ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారులకే చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులను ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.
పథకాల అమలు ప్రణాళిక
వరద నష్టంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలకు జరిగిన నష్టం, తీసుకున్న చర్యలు, అందించాల్సిన సాయం తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆగస్టు 27న జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, వ్యవసాయ, ఉద్యాన సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయాలు..
ఏమిటి : వరద నష్టంపై సమీక్ష
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్
73వ స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం జగన్
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అన ంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
గోల్కొండలో జాతీయ పతాకం ఆవిష్కరణ
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న చరిత్రాత్మక గోల్కొండ కోటలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
యూఎస్ చాంబర్ సమావేశంలో సీఎం జగన్
అమెరికా రాజధాని వాషింగ్టన్ (డీసీ)లో ఆగస్టు 16న నిర్వహించిన యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుంద న్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడి
ఎక్కడ : వాషింగ్టన్ (డీసీ), అమెరికా
స్వచ్ఛ దర్పణ్‌లో ఆరు తెలంగాణ జిల్లాలు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణలోని ఆరు జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ మేరకు స్వచ్ఛ దర్పణ్ ఫేస్- 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆగస్టు 17న విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 700 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. అందులో 8 జిల్లాలకు మొదటి ర్యాంకు దక్కింది. వీటిలో తెలంగాణలోని వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలతో పాటు గుజరాత్‌లోని ద్వారక, హరియాణాలోని రేవరీ జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు లభించింది.
స్వచ్ఛ దర్పణ్ ఫేస్- 3 ర్యాంకింగ్‌లలో తెలంగాణలోని 6 జిల్లాలు ప్రథమ స్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్ 19, వనపర్తి జిల్లా 20 స్థానంతో సరిపెట్టుకున్నాయి. మిగతా జిల్లాల విషయానికొస్తే... ఖమ్మం-65, మేడ్చల్-75, జనగామ-86, గద్వాల-89, మంచిర్యాల-96, మెదక్-105, వరంగల్ రూరల్-108, సిద్దిపేట-143, నాగర్‌కర్నూల్-149, మిగతా జిల్లాలు 168 నుంచి 307 మధ్య ర్యాంకింగ్‌లు సాధించగా భూపాలపల్లి -530తో రాష్ట్రం నుంచి చివరిస్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ దర్పణ్‌లో ఆరు తెలంగాణ జిల్లాలు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్
కేసీఆర్‌తో పవర్ ఫైనాన్స్ సీఎండీ భేటీ
మూడు రోజుల పర్యటనలో భాగంగా పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్‌శర్మ ఆగస్టు 18న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో దేశ, రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై చర్చ జరిగింది. అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్‌శర్మ
డాలస్‌లో సమావేశంలో సీఎం జగన్
అమెరికాలోని డాలస్‌లోగల హచిన్‌సన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆగస్టు 18న నిర్వహించిన సమావేశంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ప్రవాసాంధ్రులు మన (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి వచ్చి ఆయా రంగాల్లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని, అందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ప్రవాసాంధ్రులు తమ గ్రామాల్లోని ఆసుపత్రులు, స్కూళ్ల పునర్నిర్మాణంలో, బస్టాపుల ఏర్పాటులో భాగస్వాములు కావాలన్నారు.
భారత రాయబారి విందులో సీఎం జగన్
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ శ్రీంగ్లా వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 17న ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మందికిపైగా సీనియర్ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు.
అన్న అభయ హస్తం పేరు మార్పు
పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించే అన్న అభయ హస్తం పథకం పేరును వైఎస్సార్ అభయ హస్తంగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 19న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును వైఎస్సార్ పెళ్లి కానుక పథకంగా పేరు మార్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెళ్లి కానుక ప్రభుత్వం అమలు చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అభయ హస్తం పథకం పేరును వైఎస్సార్ అభయ హస్తంగా మార్పు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఏపీలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు
శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎలా పనిచేస్తుందో అదే మాదిరిగా బీసీ కమిషన్ కూడా పనిచేస్తుందని గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు తాత్కాలిక ప్రాతిపదికన బీసీ కమిషన్ పనిచేసిన విషయం తెలిసిందే.
శాశ్వత బీసీ కమిషన్
ఉద్దేశం
ఏపీ న్యాయ సమీక్ష బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల(ముందస్తు న్యాయ పరిశీలన)బిల్లు-2019కు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆగస్టు 20న ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. టెండర్ల విధానంలో అవినీతి, అక్రమాలకు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువగల పనులకు సంబంధించిన వివరాలను ముందుగా హైకోర్టు న్యాయమూర్తికి పంపి, ఆయన సూచనల మేరకు మార్పులు చేయాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల(ముందస్తు న్యాయ పరిశీలన)బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఏపీలో దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆగస్టు 20న దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై రాష్ట్రస్థాయి ప్రణాళిక సదస్సును నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఏపీ హోంశాఖమంత్రి ఎం.సుచరిత, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. దేవదాసీ వ్యవస్థను నిషేధించడం కాదు.. నిర్మూలించాలన్నారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం 1988లోనే చట్టాలు చేసినా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఏపీ హోంశాఖమంత్రి ఎం.సుచరిత, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదే శ్
హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంపస్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆగస్టు 21న ప్రారంభించారు. దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ క్యాంపస్‌లో మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. అమెజాన్‌కు అమెరికా వెలుపల ఇది ఏకై క సొంత భవనం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో సంస్థకు 300 క్యాంపస్‌లు ఉన్నాయి.
క్యాంపస్ ప్రారోంభోత్సవం సందర్భంగా అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు భారత్‌లో రూ.35,000 కోట్ల పెట్టుబడి పెట్టామని వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు ఫుడ్, రిటైల్‌లో ఖర్చు చేశామన్నారు. 2004లో భారత్‌లో అడుగుపెట్టిన అమెజాన్ తొలుత భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
ఎక్కడ : హైదరాబాద్
గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
సమాచార లభ్యతను పెంచడంతో పాటు, డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రముఖ సంస్థ గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, గూగుల్ దక్షిణాసియా సంచాలకుడు చేతన్ కృష్ణస్వామి ఆగస్టు 21న సంతకాలు చేశారు. ప్రభుత్వ సమాచారాన్ని, సేవలను ఆన్‌లైన్ ద్వారా తెలుగులో అందించడం, డిజిటలీకరణ లక్ష్యాలు సాధించడం వంటి వాటికి ఈ ఒప్పందం సహకరిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎందుకు : సమాచార లభ్యతను పెంచడంతో పాటు, డిజిటల్ సేవలను విస్తరించేందుకు
ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 15న విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లుగా నియమితులై బాధ్యతల్లో చేరుతున్న సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. నవరత్నాలే కాకుండా మేనిఫెస్టోలోని ఇతర పథకాల అమలు కూడా వలంటీర్ల ద్వారానే జరుగుతుందని సీఎం చెప్పారు. వలంటీర్లే ప్రభుత్వ స్వరం లాంటివారన్నారు.
వలంటీర్ల ద్వారా బియ్యం డోర్ డెలివరీ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలవుతుందని సీఎం చెప్పారు. దీన్ని క్రమంగా విస్తరించి ఏప్రిల్ కల్లా ప్రతి జిల్లాలో బియ్యం డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలు అందజేసే ఉద్దేశంతో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవ స్థ ప్రారంభం
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలు అందజేసేందుకు
ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు అదనంగా మరో రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆగస్టు 8న ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రాంతాల్లో గిరిజన గ్రామాలే అధికంగా ఉన్నందున వారి జీవనోపాధి దెబ్బతినడంతో అదనంగా సాయాన్ని ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన సాయం వివరాలు...
ఏమిటి : ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఏపీలో మహిళా మిత్ర సేవలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8న ‘మహిళా మిత్ర’ సేవలను శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో మహిళా మిత్ర ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అవగాహన సదస్సులోనూ మంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేధింపులకు గురవుతున్న మహిళలు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారన్నారు. అలాంటి వారు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకరిద్దరు ‘మహిళా మిత్ర’ పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఎలాంటి సైబర్ సమస్యలున్నా 9121211100కు వాట్సాప్ చేయాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళా మిత్ర సేవలు ప్రారంభం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు
హైదరాబాద్‌లో పటాన్‌చెరు సమీపంలో ఎలక్ట్రికల్ గూడ్‌స తయారీ సంస్థ గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు ఏర్పాటుచేయనుంది. ఈ ప్రతిపాదిత ప్లాంటుకు వచ్చే మూడేళ్లలో రూ.125 కోట్లు వెచ్చించనున్నట్లు గోల్డ్‌మెడల్ డెరైక్టర్ కిషన్ జైన్ ఆగస్టు 8న తెలిపారు. ఏటా 12 లక్షల ఫ్యాన్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటుని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ గూడ్‌స పరిశ్రమలో గోల్డ్‌మెడల్‌కు 15-18 శాతం వాటా ఉందన్నారు. ఇప్పటికే గోల్డ్‌మెడల్ సంస్థకు విజయవాడ, ముంబై, రాజస్థాన్‌లో ఫ్యాక్టరీలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : గోల్డ్‌మెడల్ డెరైక్టర్ కిషన్ జైన్
ఎక్కడ : హైదరాబాద్
కియా తొలి కారు సెల్టోస్ ఆవిష్కరణ
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తాజాగా భారత్‌లో తమ తొలి కారు ’సెల్టోస్’ను ఆవిష్కరించింది. అనంతపురంలోని కియా ప్లాంటులో ఆగస్టు 8న జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ రోజా, భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంగ్-కిల్, కియా మోటార్స్ ఇండియా ఎండీ కూక్ హున్ షిమ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెల్టోస్ కారును ఆవిష్కరించారు.
536 ఎకరాల్లో ప్లాంటు ..
అనంతపురం జిల్లా పెనుగొండలో సుమారు 536 ఎకరాల్లో కియా ప్లాంటు ఏర్పాటైంది. వార్షికంగా దీని ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల కార్లు కాగా, భవిష్యత్‌లో 7 లక్షల యూనిట్లకు కియా పెంచుకోనుంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారుచేసేలా ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. 2019 ఏడాది జనవరిలో కియా మోటార్స్ ట్రయల్ ఉత్పత్తి ప్రారంభించింది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఈ ప్లాంటులో వినియోగిస్తోంది.
విదేశాలకు ఇక్కణ్నుంచే ఎగుమతులు..
సెల్టోస్ కారును ఇక్కణ్నుంచే దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు కియా మోటార్స్ ఎగుమతి చేయనుంది. భారత్‌లో కియా మోటార్స్ దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. ఇందులో 1.1 బిలియన్ డాలర్లు అనంతపురం ప్లాంటుపైనే ఇన్వెస్ట్ చేసింది. దీనితో 11,000 మందికి ఉపాధి లభిస్తుందని కియా తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కియా తొలి కారు సెల్టోస్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : పెనుగొండ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎంతో తమిళనాడు మంత్రుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్‌పీ వేలుమణి, మంత్రి జయకుమార్, ముఖ్య కార్యదర్శి మనివాసన్ భేటీ అయ్యారు. అమరావతిలో ఆగస్టు 9న జరిగిన ఈ సమావేశంలో తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని, అందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్‌కు తమిళనాడు మంత్రలు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ చెన్నై తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్‌పీ వేలుమణి, మంత్రి జయకుమార్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని
ఆదివాసీ ఉత్సవంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న విశాఖపట్నం జిల్లా అరకు లోయలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల భివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. రూ.66 కోట్లను కేటాయించి ఆదివాసుల కోసం పాడేరులో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 2019-20 బడ్జెట్‌లో రూ.4,988 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి గిరిజన పోస్టుమెట్రిక్ విద్యార్థికి భోజనం, వసతి కోసం ఏటా రూ.20 వేల చొప్పున అందించేందుకు రూ.132.11 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆదివాసీ ఉత్సవంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి
ఎక్కడ : అరకు, విశాఖట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
టీఐఎఫ్‌ఆర్‌లో ఎక్స్‌ట్రీమ్ సెంటర్ ఏర్పాటు
హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్)లో ఎక్స్‌ట్రీమ్ ఫొటోనిక్ ఇన్నోవేషన్ సెంటర్(ఎపిక్)ను ఏర్పాటుచేయనున్నారు. టీఐఎఫ్‌ఆర్, యూకేకు చెందిన రూథర్‌ఫర్డ్ అప్పిలేట్ లేబొరేటరీ-సెంట్రల్ లేజర్ ఫెసిలిటీ(సీఎల్‌ఎఫ్) సంయుక్తంగా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు ఆగస్టు 9న రెండు సంస్థలు అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎక్స్‌ట్రీమ్ ఫొటోనిక్ ఇన్నోవేషన్ సెంటర్(ఎపిక్) ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : టీఐఎఫ్‌ఆర్, రూథర్‌ఫర్డ్ అప్పిలేట్ లేబొరేటరీ
ఎక్కడ : టీఐఎఫ్‌ఆర్, హైదరాబాద్
ఒకే దేశం-ఒకే కార్డు విధానం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే దేశం-ఒకే కార్డు విధానం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని రేషన్ దుకాణంలో ఆగస్టు 9న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఢిల్లీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తి జాతీయ పోర్టబిలిటీ విధానం ద్వారా తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సమక్షంలో ఐదు కిలోల బియ్యాన్ని తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒకే దేశం-ఒకే కార్డు విధానం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఔట్‌రీచ్ సదస్సులో ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆగస్టు 9న నిర్వహించిన దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధుల (డిప్లొమాటిక్ ఔట్‌రీచ్) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో నిర్వహించిన ఈ సదస్సులో 25 దేశాల నుంచి 50 మందికి ప్రతినిధులు హాజరయ్యారు. అందులో 16 దేశాల రాయబారులు ఉన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విదేశీ ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ సదస్సు

హైదరాబాద్‌లో అయాన్ ఆర్‌అండ్‌డీ సెంటర్
నీరు, పర్యావరణ నిర్వహణ సేవలందిస్తున్న అయాన్ ఎక్స్‌చేంజ్ హైదరాబాద్‌లోని పటాన్‌చెరు వద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌అండ్‌డీ సెంటర్) నెలకొల్పింది. 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది. కెమికల్స్, రెసిన్స్ తదితర వ్యాపారాలతోపాటు నూతన ఉత్పా దనల అభివృద్ధిలో ఈ సెంటర్ తోడ్పాటు అందిస్తుందని అయాన్ ఎక్స్‌చేంజ్ సీఎండీ రాజేష్ శర్మ ఆగస్టు 9న తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసర్చ్ (డీఎస్‌ఐఆర్) నుంచి ఆర్‌అండ్‌డీ కేంద్రానికి ధ్రువీకరణ ఉందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : అయాన్ ఎక్స్‌చేంజ్
ఎక్కడ : పటాన్‌చెరు, హైదరాబాద్
ఏపీ గవర్నర్‌తో శ్రీలంక హైకమిషనర్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను ఆగస్టు 11న అమరావతిలోని రాజ్‌భవన్‌లో శ్రీలంక హైకమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశిష్ట బౌద్ధ పుణ్యక్షేత్రాల గురించి గవర్నర్ వివరించారు. శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ మధ్య పర్యాటక రంగాభివృద్ధికి సహకరించాల్సిందిగా గవర్నర్ కోరారు. భారత్‌తో వ్యాపారం చేసే సార్క్ దేశాల్లో శ్రీలంక అతి పెద్ద దేశమని.. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ఫెర్నాండో గవర్నర్‌కు వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ భేటీ
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : శ్రీలంక హైకమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో
ఎక్కడ : రాజ్‌భవన్, అమరావతి, ఆంధ్రప్రదేశ్
పట్టిసీమ ప్రాజెక్టును ఆపేయండి : ఎన్జీటీ
గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగస్టు 13న ఆదేశించింది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఆయా ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని స్పష్టం చేసింది. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, త్రినాథ్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను ఆపేయాలని ఆదేశం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)
నవరత్నాల అమలుకు హెల్ప్‌లైన్ నంబర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ పథకం అమలులో భాగంగా ఫిర్యాదులు, స్పందనలు తెలుసుకునేందుకు వీలుగా నాలుగు అంకెలు గల హెల్ప్‌లైన్ నంబర్ 1902ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఆగస్టు 13న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించింది. అలాగే అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని సర్వీసు ప్రొవైడర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కార్యాలయ పర్యవేక్షణలో నడిచే ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నవరత్నాల అమలుకు హెల్ప్‌లైన్ నంబర్ 1902
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి సదుపాయాలతో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆగస్టు 13న సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 2019, డిసెంబర్ 21 నుంచి క్యూ ఆర్ కోడ్‌తో కూడిన హెల్త్‌కార్డును ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు కింద కంటి పరీక్షలు ప్రారంభించాలని ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు

ఎక్కడ : కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి
కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆగస్టు 1న జరిగిన ఈ భేటీలో ప్రధానంగా నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. నదీ జలాల విషయంలో తాము ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి ముమ్మాటికీ సమంజసమైనది, సరైనదని అభిప్రాయపడ్డారు. మరోవైపు తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కూడా జగన్ కలుసుకున్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరు చర్చించారు.

ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడి
ఎక్కడ : ప్రగతి భవన్, హైదరాబాద్
ఎందుకు : జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు
హైదరాబాద్ వర్సిటీకి ఎమినెన్స్ హోదా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహా దేశంలోని ఐదు వర్సిటీలకు ఎమినెన్స్ హోదా ప్రకటించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సిఫారసు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఢిల్లీ వర్సిటీ, బీహెచ్‌యూ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఆగస్టు 2న యూజీసీ ఎంపవర్డ్ ఎక్స్‌పర్ట్ కమిటీ(ఈఈసీ) నిర్ణయం తీసుకుంది.
ఎమినెన్స్ హోదా పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం నిధులను వెచ్చించేందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ సంస్థలకై తే ప్రభుత్వాల నుంచి నిధులు అందనప్పటికీ స్పెషల్ కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీగా మరింత అటానమీ లభిస్తుంది.
అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏటా ఆగస్టు 6న ప్రభుత్వ కార్యాలయాల్లో జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆగస్టు 3న ఆదేశాలు పంపింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
హడేరాలో ఏపీ సీఎం జగన్
ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 4న హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్ (ఉప్పు నీటి నుంచి ఉప్పును తొలగించే ప్రక్రియ) ప్లాంటును సందర్శించారు. ఈ సందర్భంగా సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా తయారు చేసే ప్రక్రియపై ముఖ్యమంత్రికి ప్లాంటు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట టెల్ అవీవ్‌లోని భారతీయ మిషన్ ఉప అధిపతి షెరింగ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్ ప్లాంటు సందర్శన
ఎప్పుడు : ఆగస్టు 4

ఎక్కడ : హడేరా, ఇజ్రాయెల్
విశాఖలో ఐ అండ్ సి సెంటర్
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో ఇన్‌స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ సెంటర్) ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కేంద్రప్రభుత్వానికి ఆగస్టు 4న ప్రతిపాదన పంపింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఈ సెంటరును మంజూరు చేసింది. ఇప్పటికే ఐ అండ్ సీ సెంటరు నిర్మాణాన్ని ఏపీలో చేపట్టేందుకు రూ.16.5 కోట్లు కేటాయించాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్‌టీహెచ్) కేంద్రానికి సిఫారసు చేసింది. దీని నిర్మాణానికి స్థలం చూపిస్తే ఏర్పాటుకు అయ్యే వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఐ అండ్ సీ సెంటర్ ఏర్పాటైతే డ్రైవింగ్ పరీక్షలు అన్నీ ఆటోమేషన్ విధానంలోనే జరుగుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ సెంటర్) ఏర్పాటుకు ప్రతిపాదన
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ
ఎక్కడ : గంభీరం గ్రామం, ఆనందపురం మండలం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఏపీ గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత లభించింది. ఈ మేరకు ఆగస్టు 5న కేంద్ర మానవ వనరుల శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు వర్సిటీల ఏర్పాటుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఈ రెండు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలో కేంద్ర విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత
ఎప్పుడు : ఆగస్టు 5
ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆగస్టు 6న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని మోదీని జగన్ కోరారు. ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లుగా ఏపీ ఎదుర్కొన్న పరిస్థితులు, తమ ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలను మోదీకి జగన్ వివరించారు.
ప్రధాని కార్యాలయ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేందర్ మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ పి.కె.మిశ్రాను కలసి ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 6

ఎక్కడ : న్యూఢిల్లీ
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం ఇటీవల చట్టం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌గా చల్లా మధుసూదన్ రెడ్డి ఆగస్టు 7న ఆ సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి
కేంద్రమంత్రులతో సీఎం జగన్ సమావేశం
ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు ఆగస్టు 7న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడులను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమై రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు. మొదటగా హోమంత్రి అమిత్ షాను జగన్ కలిసారు. హామీలను నెరవేర్చాలని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలవాలని ఆయనను అభ్యర్థించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ జగన్ భేటీ అయ్యారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు భారీ కార్యక్రమాలను చేపట్టామని మంత్రికి ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఆయా కార్యక్రమాలకు సాయం చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు భర్తీతోపాటు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రహదారుల నిర్మాణం, నిర్వహణకు చేయూతనివ్వాలని, అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి పూర్తిస్థాయిలో కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని నితిన్ గడ్కరీని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

- 2019, సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు
- 2019, సెప్టెంబర్ చివర్లో సొంత ఆటో, ట్యాక్సీ వాలాలకు రూ.10 వేలు
- 2019, అక్టోబర్ 15న వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభం
- 2019, నవంబర్ 21న పడవ, బోటు ఉన్న మత్స్యకారులకు రూ.10 వేలు..అదే రోజు మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ రూ.ఆరు నుంచి రూ.9కి పెంపు
- 2019, డిసెంబర్ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు
- 2020, జనవరి 26న జగనన్న అమ్మఒడి కార్యక్రమం ప్రారంభం
- 2020, ఫిబ్రవరి చివరి వారంలో నాయీబ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు రూ.10 వేలు.. అలాగే వైఎస్సార్ పెళ్లి కానుక అమలు
- 2020, మార్చి చివరి వారంలో ధూప, దీప, నైవేద్యం.. మసీదులు, చర్చిలకు సంబంధించిన హామీల అమలు
- 2020, ఉగాది రోజు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
వరద నష్టంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలకు జరిగిన నష్టం, తీసుకున్న చర్యలు, అందించాల్సిన సాయం తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆగస్టు 27న జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, వ్యవసాయ, ఉద్యాన సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయాలు..
- పకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి
- పంట నష్టాన్ని బ్యాంకులు మినహాయించుకోకుండా రైతుల అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకే ఇన్‌పుట్ సబ్సిడీ వేయాలి
- విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను గుర్తించడానికి ప్రతి నియోజకవర్గంలో పరీక్ష కేంద్రాలు (ల్యాబ్స్) ఏర్పాటు చేయాలి. భూసార పరీక్షలను నిర్వహించాలి
- కౌలు రైతులకు గ్రామ సచివాలయాల్లోనే కార్డులు ఇవ్వాలి. కౌలు రైతుల చట్టంపై అవగాహన కల్పించాలి.
- పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే సలహాలు, పరిష్కారాల కోసం కాల్‌సెంటర్, ఒక యాప్‌ను సిద్ధం చేయాలని సీఎం నిర్ణయించారు.
- వద తాకిడికి గురైన ప్రాంతాలకు పూర్తి సబ్సిడీ(100 శాతం)పై వరి, మినుము, పెసర, మొక్కజొన్న విత్తనాలను ప్రభుత్వం అందజేయాలి.
ఏమిటి : వరద నష్టంపై సమీక్ష
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్
73వ స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం జగన్
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అన ంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- అన్ని విధాలా వెనుకబాటు తనం, అవినీతి, దళారీలు, సామాజిక-ఆర్థిక- రాజకీయ వెనకబాటుతనంతో కునారిల్లుతున్న వ్యవస్థను మార్చుకోవాలన్న కృత నిశ్చయంతోనే తమ ప్రభుత్వం నవరత్నాలు ప్రకటించింది.
- శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన మొట్ట మొదటి ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను.
- ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింప జేస్తూ చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనదే.
- అక్టోబర్ 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్నాం.
- పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా, స్థానికుల నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టేలా తొలిసారిగా చట్టం చేస్తున్నాం.
- పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌లను ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రభుత్వ శాఖల్లో రూ.కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్‌లైన్‌లో పెడతాం.
- జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా టెండరు పనులను ఖరారు చేసే ప్రక్రియను హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తున్నాం.
- రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున ఈ అక్టోబర్ 15వ తేదీ నుంచే అందించబోతున్నాం. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు.
- తుపాను, కరువు వచ్చినప్పుడు రైతన్నలను ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశాం.
- గోదావరి జలాలను సాగర్, శ్రీశైలంకు తరలించటం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు అందించే కార్యక్రమం ప్రారంభించటానికి ప్రణాళికలు వేస్తున్నాం.
- 972 కిలోమీటర్ల సముద్ర తీరం, సీ పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్-రోడ్డు కనెక్టివిటీతో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం.
గోల్కొండలో జాతీయ పతాకం ఆవిష్కరణ
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న చరిత్రాత్మక గోల్కొండ కోటలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- అవినీతికి, అలసత్వానికి అవకాశం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెడతాం
- కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పరిశుభ్రమైన, పచ్చదనం వెల్లివిరిసే గ్రామాలు, మునిసిపాలిటీలను తయారు చేసుకోగలం.
- రాష్ట్రంలో విద్యుత్తు, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా దేశం ముందు గర్వంగా నిలబడింది
- కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.84% వృద్ధిరేటుతో స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది.
- రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో రూ.4లక్షల కోట్ల విలువైన సంపదుంటే, నేడు రూ.8.66లక్షల కోట్లకు చేరుకోవడం మన ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తుంది.
- గడిచిన ఐదేళ్ళలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.52వేల కోట్ల నుంచి లక్షా పదివేల కోట్ల రూపాయలకు చేరుకోవడం మనం సాధించిన ప్రగతికి అద్దం పడుతుంది
- కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల అమలుతో నూతన ఒరవడిని ప్రవేశ పెట్టడానికి 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది.
- విద్యుత్ సమస్యల పరిష్కారానికి 60 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్‌శాఖ ప్రజల భాగస్వామ్యంతో పవర్ వీక్ నిర్వహించుకోవాలి.
- రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచి, అందిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబీమా పథకాన్ని కొనసాగిస్తున్నాం.
- గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్ నుంచి తెలంగాణ రైతాంగం అదనంగా 575 టీఎంసీల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది
- తెలంగాణ ఆరోగ్య సూచిక ‘హెల్త్ ప్రొఫైల్’తయారు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
- పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు గడిచిన ఐదేళ్ళలో చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి.
యూఎస్ చాంబర్ సమావేశంలో సీఎం జగన్
అమెరికా రాజధాని వాషింగ్టన్ (డీసీ)లో ఆగస్టు 16న నిర్వహించిన యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుంద న్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడి
ఎక్కడ : వాషింగ్టన్ (డీసీ), అమెరికా
స్వచ్ఛ దర్పణ్‌లో ఆరు తెలంగాణ జిల్లాలు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణలోని ఆరు జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ మేరకు స్వచ్ఛ దర్పణ్ ఫేస్- 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆగస్టు 17న విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 700 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. అందులో 8 జిల్లాలకు మొదటి ర్యాంకు దక్కింది. వీటిలో తెలంగాణలోని వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలతో పాటు గుజరాత్‌లోని ద్వారక, హరియాణాలోని రేవరీ జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు లభించింది.
స్వచ్ఛ దర్పణ్ ఫేస్- 3 ర్యాంకింగ్‌లలో తెలంగాణలోని 6 జిల్లాలు ప్రథమ స్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్ 19, వనపర్తి జిల్లా 20 స్థానంతో సరిపెట్టుకున్నాయి. మిగతా జిల్లాల విషయానికొస్తే... ఖమ్మం-65, మేడ్చల్-75, జనగామ-86, గద్వాల-89, మంచిర్యాల-96, మెదక్-105, వరంగల్ రూరల్-108, సిద్దిపేట-143, నాగర్‌కర్నూల్-149, మిగతా జిల్లాలు 168 నుంచి 307 మధ్య ర్యాంకింగ్‌లు సాధించగా భూపాలపల్లి -530తో రాష్ట్రం నుంచి చివరిస్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ దర్పణ్‌లో ఆరు తెలంగాణ జిల్లాలు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్
కేసీఆర్‌తో పవర్ ఫైనాన్స్ సీఎండీ భేటీ
మూడు రోజుల పర్యటనలో భాగంగా పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్‌శర్మ ఆగస్టు 18న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో దేశ, రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై చర్చ జరిగింది. అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్‌శర్మ
డాలస్‌లో సమావేశంలో సీఎం జగన్
అమెరికాలోని డాలస్‌లోగల హచిన్‌సన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆగస్టు 18న నిర్వహించిన సమావేశంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ప్రవాసాంధ్రులు మన (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి వచ్చి ఆయా రంగాల్లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని, అందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ప్రవాసాంధ్రులు తమ గ్రామాల్లోని ఆసుపత్రులు, స్కూళ్ల పునర్నిర్మాణంలో, బస్టాపుల ఏర్పాటులో భాగస్వాములు కావాలన్నారు.
భారత రాయబారి విందులో సీఎం జగన్
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ శ్రీంగ్లా వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 17న ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మందికిపైగా సీనియర్ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు.
అన్న అభయ హస్తం పేరు మార్పు
పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించే అన్న అభయ హస్తం పథకం పేరును వైఎస్సార్ అభయ హస్తంగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 19న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును వైఎస్సార్ పెళ్లి కానుక పథకంగా పేరు మార్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెళ్లి కానుక ప్రభుత్వం అమలు చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అభయ హస్తం పథకం పేరును వైఎస్సార్ అభయ హస్తంగా మార్పు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఏపీలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు
శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎలా పనిచేస్తుందో అదే మాదిరిగా బీసీ కమిషన్ కూడా పనిచేస్తుందని గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు తాత్కాలిక ప్రాతిపదికన బీసీ కమిషన్ పనిచేసిన విషయం తెలిసిందే.
శాశ్వత బీసీ కమిషన్
ఉద్దేశం
- బీసీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడం.
- బీసీల సాధికారత కోసం నిరంతరం పని చేయడం.
- కుల సర్టిఫికెట్ల సమస్యలు, గ్రూపుల్లో మార్పు, చేర్పులు.
- సామాజిక, ఆర్థిక, విద్య, ఇతర స్థితిగతుల ద్వారా బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం.
- బీసీలకు అన్ని రంగాల్లో అవసరమైన రక్షణ చర్యలను కల్పిస్తుంది.
- ఎవరైనా తమను బీసీ జాబితాలో చేర్చాలని కోరితే అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సిఫారసు చేస్తుంది.
- విద్యా సంస్థల అడ్మిషన్లలో, ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పాటించకపోవడం ఫిర్యాదులపై విచారణ.
- బీసీల సామాజిక ఆర్థిక, విద్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వేలు, అధ్యయనం.
- బీసీల అభ్యున్నతికి అవసరమైన సంక్షేమ, ఇతర విధానాల రూపకల్పన.
- బీసీలపై వేధింపులు లేదా సామాజిక బహిష్కరణ లాంటి ఘటనలు చోటు చేసుకుంటే సమగ్ర దర్యాప్తు.
ఏపీ న్యాయ సమీక్ష బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల(ముందస్తు న్యాయ పరిశీలన)బిల్లు-2019కు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆగస్టు 20న ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. టెండర్ల విధానంలో అవినీతి, అక్రమాలకు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువగల పనులకు సంబంధించిన వివరాలను ముందుగా హైకోర్టు న్యాయమూర్తికి పంపి, ఆయన సూచనల మేరకు మార్పులు చేయాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల(ముందస్తు న్యాయ పరిశీలన)బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఏపీలో దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆగస్టు 20న దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై రాష్ట్రస్థాయి ప్రణాళిక సదస్సును నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఏపీ హోంశాఖమంత్రి ఎం.సుచరిత, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. దేవదాసీ వ్యవస్థను నిషేధించడం కాదు.. నిర్మూలించాలన్నారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం 1988లోనే చట్టాలు చేసినా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఏపీ హోంశాఖమంత్రి ఎం.సుచరిత, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదే శ్
హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంపస్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆగస్టు 21న ప్రారంభించారు. దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ క్యాంపస్‌లో మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. అమెజాన్‌కు అమెరికా వెలుపల ఇది ఏకై క సొంత భవనం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో సంస్థకు 300 క్యాంపస్‌లు ఉన్నాయి.
క్యాంపస్ ప్రారోంభోత్సవం సందర్భంగా అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు భారత్‌లో రూ.35,000 కోట్ల పెట్టుబడి పెట్టామని వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు ఫుడ్, రిటైల్‌లో ఖర్చు చేశామన్నారు. 2004లో భారత్‌లో అడుగుపెట్టిన అమెజాన్ తొలుత భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
ఎక్కడ : హైదరాబాద్
గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
సమాచార లభ్యతను పెంచడంతో పాటు, డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రముఖ సంస్థ గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, గూగుల్ దక్షిణాసియా సంచాలకుడు చేతన్ కృష్ణస్వామి ఆగస్టు 21న సంతకాలు చేశారు. ప్రభుత్వ సమాచారాన్ని, సేవలను ఆన్‌లైన్ ద్వారా తెలుగులో అందించడం, డిజిటలీకరణ లక్ష్యాలు సాధించడం వంటి వాటికి ఈ ఒప్పందం సహకరిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎందుకు : సమాచార లభ్యతను పెంచడంతో పాటు, డిజిటల్ సేవలను విస్తరించేందుకు
ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 15న విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లుగా నియమితులై బాధ్యతల్లో చేరుతున్న సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. నవరత్నాలే కాకుండా మేనిఫెస్టోలోని ఇతర పథకాల అమలు కూడా వలంటీర్ల ద్వారానే జరుగుతుందని సీఎం చెప్పారు. వలంటీర్లే ప్రభుత్వ స్వరం లాంటివారన్నారు.
వలంటీర్ల ద్వారా బియ్యం డోర్ డెలివరీ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలవుతుందని సీఎం చెప్పారు. దీన్ని క్రమంగా విస్తరించి ఏప్రిల్ కల్లా ప్రతి జిల్లాలో బియ్యం డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలు అందజేసే ఉద్దేశంతో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవ స్థ ప్రారంభం
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలు అందజేసేందుకు
ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు అదనంగా మరో రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆగస్టు 8న ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రాంతాల్లో గిరిజన గ్రామాలే అధికంగా ఉన్నందున వారి జీవనోపాధి దెబ్బతినడంతో అదనంగా సాయాన్ని ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన సాయం వివరాలు...
- పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు అదనంగా రూ.5 వేల చొప్పున సాయం.
- కూలిన ఇళ్లు, పంట నష్టానికి నిబంధనల ప్రకారం పరిహారంతోపాటు అదనంగా ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం.
- ముంపు గ్రామాల్లో వెంటనే నిత్యావసర సరుకుల పంపిణీ.
- పంటలు కోల్పోయిన రైతులకు పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు.
- పోలవరం కోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన వారికి కూడా పరిహారం, ఉచితంగా విత్తనాల సరఫరా.
ఏమిటి : ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఏపీలో మహిళా మిత్ర సేవలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8న ‘మహిళా మిత్ర’ సేవలను శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో మహిళా మిత్ర ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అవగాహన సదస్సులోనూ మంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేధింపులకు గురవుతున్న మహిళలు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారన్నారు. అలాంటి వారు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకరిద్దరు ‘మహిళా మిత్ర’ పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఎలాంటి సైబర్ సమస్యలున్నా 9121211100కు వాట్సాప్ చేయాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళా మిత్ర సేవలు ప్రారంభం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు
హైదరాబాద్‌లో పటాన్‌చెరు సమీపంలో ఎలక్ట్రికల్ గూడ్‌స తయారీ సంస్థ గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు ఏర్పాటుచేయనుంది. ఈ ప్రతిపాదిత ప్లాంటుకు వచ్చే మూడేళ్లలో రూ.125 కోట్లు వెచ్చించనున్నట్లు గోల్డ్‌మెడల్ డెరైక్టర్ కిషన్ జైన్ ఆగస్టు 8న తెలిపారు. ఏటా 12 లక్షల ఫ్యాన్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటుని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ గూడ్‌స పరిశ్రమలో గోల్డ్‌మెడల్‌కు 15-18 శాతం వాటా ఉందన్నారు. ఇప్పటికే గోల్డ్‌మెడల్ సంస్థకు విజయవాడ, ముంబై, రాజస్థాన్‌లో ఫ్యాక్టరీలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : గోల్డ్‌మెడల్ డెరైక్టర్ కిషన్ జైన్
ఎక్కడ : హైదరాబాద్
కియా తొలి కారు సెల్టోస్ ఆవిష్కరణ
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తాజాగా భారత్‌లో తమ తొలి కారు ’సెల్టోస్’ను ఆవిష్కరించింది. అనంతపురంలోని కియా ప్లాంటులో ఆగస్టు 8న జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ రోజా, భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంగ్-కిల్, కియా మోటార్స్ ఇండియా ఎండీ కూక్ హున్ షిమ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెల్టోస్ కారును ఆవిష్కరించారు.
536 ఎకరాల్లో ప్లాంటు ..
అనంతపురం జిల్లా పెనుగొండలో సుమారు 536 ఎకరాల్లో కియా ప్లాంటు ఏర్పాటైంది. వార్షికంగా దీని ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల కార్లు కాగా, భవిష్యత్‌లో 7 లక్షల యూనిట్లకు కియా పెంచుకోనుంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారుచేసేలా ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. 2019 ఏడాది జనవరిలో కియా మోటార్స్ ట్రయల్ ఉత్పత్తి ప్రారంభించింది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఈ ప్లాంటులో వినియోగిస్తోంది.
విదేశాలకు ఇక్కణ్నుంచే ఎగుమతులు..
సెల్టోస్ కారును ఇక్కణ్నుంచే దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు కియా మోటార్స్ ఎగుమతి చేయనుంది. భారత్‌లో కియా మోటార్స్ దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. ఇందులో 1.1 బిలియన్ డాలర్లు అనంతపురం ప్లాంటుపైనే ఇన్వెస్ట్ చేసింది. దీనితో 11,000 మందికి ఉపాధి లభిస్తుందని కియా తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కియా తొలి కారు సెల్టోస్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : పెనుగొండ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎంతో తమిళనాడు మంత్రుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్‌పీ వేలుమణి, మంత్రి జయకుమార్, ముఖ్య కార్యదర్శి మనివాసన్ భేటీ అయ్యారు. అమరావతిలో ఆగస్టు 9న జరిగిన ఈ సమావేశంలో తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని, అందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్‌కు తమిళనాడు మంత్రలు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ చెన్నై తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్‌పీ వేలుమణి, మంత్రి జయకుమార్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని
ఆదివాసీ ఉత్సవంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న విశాఖపట్నం జిల్లా అరకు లోయలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల భివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. రూ.66 కోట్లను కేటాయించి ఆదివాసుల కోసం పాడేరులో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 2019-20 బడ్జెట్‌లో రూ.4,988 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి గిరిజన పోస్టుమెట్రిక్ విద్యార్థికి భోజనం, వసతి కోసం ఏటా రూ.20 వేల చొప్పున అందించేందుకు రూ.132.11 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆదివాసీ ఉత్సవంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి
ఎక్కడ : అరకు, విశాఖట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
టీఐఎఫ్‌ఆర్‌లో ఎక్స్‌ట్రీమ్ సెంటర్ ఏర్పాటు
హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్)లో ఎక్స్‌ట్రీమ్ ఫొటోనిక్ ఇన్నోవేషన్ సెంటర్(ఎపిక్)ను ఏర్పాటుచేయనున్నారు. టీఐఎఫ్‌ఆర్, యూకేకు చెందిన రూథర్‌ఫర్డ్ అప్పిలేట్ లేబొరేటరీ-సెంట్రల్ లేజర్ ఫెసిలిటీ(సీఎల్‌ఎఫ్) సంయుక్తంగా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు ఆగస్టు 9న రెండు సంస్థలు అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎక్స్‌ట్రీమ్ ఫొటోనిక్ ఇన్నోవేషన్ సెంటర్(ఎపిక్) ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : టీఐఎఫ్‌ఆర్, రూథర్‌ఫర్డ్ అప్పిలేట్ లేబొరేటరీ
ఎక్కడ : టీఐఎఫ్‌ఆర్, హైదరాబాద్
ఒకే దేశం-ఒకే కార్డు విధానం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే దేశం-ఒకే కార్డు విధానం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని రేషన్ దుకాణంలో ఆగస్టు 9న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఢిల్లీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తి జాతీయ పోర్టబిలిటీ విధానం ద్వారా తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సమక్షంలో ఐదు కిలోల బియ్యాన్ని తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒకే దేశం-ఒకే కార్డు విధానం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఔట్‌రీచ్ సదస్సులో ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆగస్టు 9న నిర్వహించిన దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధుల (డిప్లొమాటిక్ ఔట్‌రీచ్) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో నిర్వహించిన ఈ సదస్సులో 25 దేశాల నుంచి 50 మందికి ప్రతినిధులు హాజరయ్యారు. అందులో 16 దేశాల రాయబారులు ఉన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విదేశీ ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో అయాన్ ఆర్‌అండ్‌డీ సెంటర్
నీరు, పర్యావరణ నిర్వహణ సేవలందిస్తున్న అయాన్ ఎక్స్‌చేంజ్ హైదరాబాద్‌లోని పటాన్‌చెరు వద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌అండ్‌డీ సెంటర్) నెలకొల్పింది. 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది. కెమికల్స్, రెసిన్స్ తదితర వ్యాపారాలతోపాటు నూతన ఉత్పా దనల అభివృద్ధిలో ఈ సెంటర్ తోడ్పాటు అందిస్తుందని అయాన్ ఎక్స్‌చేంజ్ సీఎండీ రాజేష్ శర్మ ఆగస్టు 9న తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసర్చ్ (డీఎస్‌ఐఆర్) నుంచి ఆర్‌అండ్‌డీ కేంద్రానికి ధ్రువీకరణ ఉందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : అయాన్ ఎక్స్‌చేంజ్
ఎక్కడ : పటాన్‌చెరు, హైదరాబాద్
ఏపీ గవర్నర్‌తో శ్రీలంక హైకమిషనర్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను ఆగస్టు 11న అమరావతిలోని రాజ్‌భవన్‌లో శ్రీలంక హైకమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశిష్ట బౌద్ధ పుణ్యక్షేత్రాల గురించి గవర్నర్ వివరించారు. శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ మధ్య పర్యాటక రంగాభివృద్ధికి సహకరించాల్సిందిగా గవర్నర్ కోరారు. భారత్‌తో వ్యాపారం చేసే సార్క్ దేశాల్లో శ్రీలంక అతి పెద్ద దేశమని.. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ఫెర్నాండో గవర్నర్‌కు వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ భేటీ
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : శ్రీలంక హైకమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో
ఎక్కడ : రాజ్‌భవన్, అమరావతి, ఆంధ్రప్రదేశ్
పట్టిసీమ ప్రాజెక్టును ఆపేయండి : ఎన్జీటీ
గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగస్టు 13న ఆదేశించింది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఆయా ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని స్పష్టం చేసింది. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, త్రినాథ్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను ఆపేయాలని ఆదేశం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)
నవరత్నాల అమలుకు హెల్ప్‌లైన్ నంబర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ పథకం అమలులో భాగంగా ఫిర్యాదులు, స్పందనలు తెలుసుకునేందుకు వీలుగా నాలుగు అంకెలు గల హెల్ప్‌లైన్ నంబర్ 1902ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఆగస్టు 13న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించింది. అలాగే అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని సర్వీసు ప్రొవైడర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కార్యాలయ పర్యవేక్షణలో నడిచే ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నవరత్నాల అమలుకు హెల్ప్‌లైన్ నంబర్ 1902
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి సదుపాయాలతో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆగస్టు 13న సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 2019, డిసెంబర్ 21 నుంచి క్యూ ఆర్ కోడ్‌తో కూడిన హెల్త్‌కార్డును ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు కింద కంటి పరీక్షలు ప్రారంభించాలని ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి
కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆగస్టు 1న జరిగిన ఈ భేటీలో ప్రధానంగా నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. నదీ జలాల విషయంలో తాము ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి ముమ్మాటికీ సమంజసమైనది, సరైనదని అభిప్రాయపడ్డారు. మరోవైపు తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కూడా జగన్ కలుసుకున్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరు చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడి
ఎక్కడ : ప్రగతి భవన్, హైదరాబాద్
ఎందుకు : జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు
హైదరాబాద్ వర్సిటీకి ఎమినెన్స్ హోదా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహా దేశంలోని ఐదు వర్సిటీలకు ఎమినెన్స్ హోదా ప్రకటించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సిఫారసు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఢిల్లీ వర్సిటీ, బీహెచ్‌యూ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఆగస్టు 2న యూజీసీ ఎంపవర్డ్ ఎక్స్‌పర్ట్ కమిటీ(ఈఈసీ) నిర్ణయం తీసుకుంది.
ఎమినెన్స్ హోదా పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం నిధులను వెచ్చించేందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ సంస్థలకై తే ప్రభుత్వాల నుంచి నిధులు అందనప్పటికీ స్పెషల్ కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీగా మరింత అటానమీ లభిస్తుంది.
అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏటా ఆగస్టు 6న ప్రభుత్వ కార్యాలయాల్లో జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆగస్టు 3న ఆదేశాలు పంపింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
హడేరాలో ఏపీ సీఎం జగన్
ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 4న హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్ (ఉప్పు నీటి నుంచి ఉప్పును తొలగించే ప్రక్రియ) ప్లాంటును సందర్శించారు. ఈ సందర్భంగా సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా తయారు చేసే ప్రక్రియపై ముఖ్యమంత్రికి ప్లాంటు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట టెల్ అవీవ్‌లోని భారతీయ మిషన్ ఉప అధిపతి షెరింగ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్ ప్లాంటు సందర్శన
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : హడేరా, ఇజ్రాయెల్
విశాఖలో ఐ అండ్ సి సెంటర్
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో ఇన్‌స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ సెంటర్) ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కేంద్రప్రభుత్వానికి ఆగస్టు 4న ప్రతిపాదన పంపింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఈ సెంటరును మంజూరు చేసింది. ఇప్పటికే ఐ అండ్ సీ సెంటరు నిర్మాణాన్ని ఏపీలో చేపట్టేందుకు రూ.16.5 కోట్లు కేటాయించాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్‌టీహెచ్) కేంద్రానికి సిఫారసు చేసింది. దీని నిర్మాణానికి స్థలం చూపిస్తే ఏర్పాటుకు అయ్యే వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఐ అండ్ సీ సెంటర్ ఏర్పాటైతే డ్రైవింగ్ పరీక్షలు అన్నీ ఆటోమేషన్ విధానంలోనే జరుగుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ సెంటర్) ఏర్పాటుకు ప్రతిపాదన
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ
ఎక్కడ : గంభీరం గ్రామం, ఆనందపురం మండలం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఏపీ గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత లభించింది. ఈ మేరకు ఆగస్టు 5న కేంద్ర మానవ వనరుల శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు వర్సిటీల ఏర్పాటుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఈ రెండు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలో కేంద్ర విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత
ఎప్పుడు : ఆగస్టు 5
ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆగస్టు 6న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని మోదీని జగన్ కోరారు. ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లుగా ఏపీ ఎదుర్కొన్న పరిస్థితులు, తమ ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలను మోదీకి జగన్ వివరించారు.
ప్రధాని కార్యాలయ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేందర్ మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ పి.కె.మిశ్రాను కలసి ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం ఇటీవల చట్టం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌గా చల్లా మధుసూదన్ రెడ్డి ఆగస్టు 7న ఆ సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి
కేంద్రమంత్రులతో సీఎం జగన్ సమావేశం
ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు ఆగస్టు 7న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడులను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమై రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు. మొదటగా హోమంత్రి అమిత్ షాను జగన్ కలిసారు. హామీలను నెరవేర్చాలని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలవాలని ఆయనను అభ్యర్థించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ జగన్ భేటీ అయ్యారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు భారీ కార్యక్రమాలను చేపట్టామని మంత్రికి ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఆయా కార్యక్రమాలకు సాయం చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు భర్తీతోపాటు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రహదారుల నిర్మాణం, నిర్వహణకు చేయూతనివ్వాలని, అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి పూర్తిస్థాయిలో కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని నితిన్ గడ్కరీని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 23 Aug 2019 12:53PM