Sabarimala Temple : తెరుచుకున్న శబరిమలై ఆలయం
Sakshi Education
అయ్యప్ప భక్తుల కోసం కేరళలోని శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. మాలధారుల సందర్శనార్థం నవంబర్ 16న (బుధవారం) ఆలయాన్ని తెరిచారు.
కరోనా నిబంధనలేవీ లేకపోవడంతో ఈ ఏడాది భక్తలు సంఖ్య 40 నుంచి 50 శాతం పెరగవచ్చునని అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా కరోనా భయాలు ఉండడంతో రోజుకి 30 వేల మంది భక్తులకి మాత్రమే దర్శనానికి అనుమతినిచ్చారు. ఈ ఏడాది అలాంటి ఆంక్షలేవీ లేవని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్ తెలిపారు. భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
Published date : 17 Nov 2022 04:34PM