Republic Day: ఏ మేరే వతన్ కే లోగో గీతాన్ని ఎవరు రాశారు?
గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా జనవరి 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్‌లో ఈసారి మహాత్మ గాంధీజీకి ఇష్టమైన ‘అబిడ్ విత్ మీ’ పాటని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా 2022 ఏడాది దేశీ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
అబిడ్ విత్ మీ స్థానంలో..
అబిడ్ విత్ మీ పాట స్థానంలో ప్రముఖ దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్ కే లోగో’ను వాయించనున్నారు. 1962 ఇండో–చైనా యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ కవి ప్రదీప్ ఈ గీతాన్ని రాశారు. దేశ భద్రత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ ఈ గీతాన్ని ఆలపిస్తారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్‌ను నిర్వహిస్తారు.
హెన్రీ ఫాన్రిస్ లైట్ రచన..
‘అబిడ్ విత్ మీ’ని 1847లో స్కాటిష్ ఆంగ్లికన్ కవి హెన్రీ ఫాన్రిస్ లైట్ రాశారు. 1950 నుంచి బీటింగ్ రిట్రీట్ వేడుకలో దీన్ని వాయిస్తున్నారు. తాజాగా దీన్ని విరమిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.
25 శకటాలు..
2022 ఏడాది గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 16 కవాతు బృందాలు, 17 మిలటరీ బాండ్లు, వివిధ రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 25 శకటాలు రిపబ్లిక్ డే పెరేడ్‌లో పాల్గొంటాయని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
చదవండి: నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జనవరి 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్‌లో ఈసారి మహాత్మ గాంధీజీకి ఇష్టమైన ‘అబిడ్ విత్ మీ’ పాటని తొలగించాలని నిర్ణయం
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 2022 ఏడాది దేశీ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్