Skip to main content

62nd SIAM Annual Convention: పర్యావరణ అనుకూల పరిష్కారాలు కావాలి.. ఆటో రంగానికి ప్రధాని మోదీ సూచన

పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, దేశ స్వావలంబనకు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహన ఆవిష్కరణలపై ఆటోమొబైల్‌ పరిశ్రమ దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
PM Modi to virtually launch global initiative 'LiFE Movement
PM Modi to virtually launch global initiative 'LiFE Movement

ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) 62వ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. 

Also read: Quiz of The Day (September 16, 2022): ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

దీన్ని సియామ్‌ ప్రెసిడెంట్‌ కెనిచి అయుకవ చదవి వినిపించారు. ప్రతి రంగంలోనూ స్వావలంబన సాధించాల్సిన అమృత కాల అవకాశం మన ముందుందని పేర్కొంటూ, అందుకు ఆటోమొబైల్‌ రంగం కూడా అతీతం కాదన్నారు. ఉపాధి కల్పన, దేశ సమగ్ర ఆర్థికాభివృద్ధిలో ఆటోమొబైల్‌ పరిశ్రమ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఆటోమొబైల్‌ రంగానికి భవిష్యత్తు బ్లూప్రింట్‌ను అభివృద్ధి చేసే విషయంలో పరిశ్రమ నిపుణులు, తయారీదారులు, విధానకర్తలు వార్షిక సదస్సులో భాగంగా చర్చలు నిర్వహించాలని సూచించారు. వాహన తయారీలో నాలుగో అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించడంలో పరిశ్రమ పాత్రను మెచ్చుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, ఆటోమొబైల్‌ పరిశ్రమ సాధించిన ఈ విజయాలు దేశ ఆర్థిక పునరుజ్జీవానికి తోడ్పడినట్టు చెప్పారు. తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. మానవాభివృద్ధిలో రవాణా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ వృద్ధికి నాణ్యమైన, సౌకర్యమైన రవాణా కీలకమన్నారు.  

Also read: Population Decline: జనాభా తగ్గుదల ఆందోళనకరం... ప్రపంచ దేశాల ముందు కొత్త సవాళ్లు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 16 Sep 2022 05:48PM

Photo Stories