PM Modi launches: తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్సే్ఛంజ్‌ను ప్రారంభం
భారత్‌లో తొలి బులియన్ ఎక్సే్ఛంజ్.. 'ఇండియా ఇంటర్నేషన్ బులియన్ ఎక్సే్ఛంజ్'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్‌లోని గిఫ్ట్‌సిటీలో దీన్ని ఏర్పాటు చేశారు. 2020 కేంద్ర బడ్జెట్‌లో దీని ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసింది. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఇప్పటికే ఎక్సే్ఛంజ్‌లో వర్తకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలాగే బంగారం, వెండిని నిల్వ చేయడానికి కావాల్సిన మౌలిక వసతులనూ ఏర్పాటు చేశారు. నాణేలు, బిళ్లలు, కడ్డీల రూపంలో ఉండే అత్యంత స్వచ్ఛతతో కూడిన బంగారం, వెండిని బులియన్ గా వ్యవహరిస్తారు. సంస్థాగత మదుపర్లు, కేంద్ర బ్యాంకులు వీటిని నిల్వ చేస్తుంటాయి. కొనుగోలు, అమ్మకందారులు బంగారం, వెండితోపాటు సంబంధిత డెరివేటివ్‌ల వర్తకం చేయడానికి ఉపయోగించే వేదికే బులియన్ ఎక్సే్ఛంజ్. స్టాక్‌మార్కెట్లను సెబీ నియంత్రిస్తున్నట్లుగానే.. తాజాగా భారత్‌లో ఏర్పాటు చేసిన ఈ ఐఐఆగీ.. 'ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌సెంటర్స్ అథారిటీ నియంత్రణలో ఉంటుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP