ఫిబ్రవరి 2017 జాతీయం
Sakshi Education
దేశంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం ఆవిష్కరణ
దేశంలోనేఅతిపెద్ద శివుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో ఫిబ్రవరి 24న ఆవిష్కరించారు. 112 అడుగుల ఎత్తై ఆది యోగి విగ్రహాన్ని ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆదియోగ అనే పుస్తకాన్ని విడుదల చేసిన మోదీ ప్రపంచమంతా కోరుకునే శాంతి యోగాతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఆ రాష్ర్ట సీఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు.
తీర నిఘా ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
తీర ప్రాంతాలపై నిఘా పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ పరికరాల కొనుగోలు మండలి (డీఏసీ) ఫిబ్రవరి 21న అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.800 కోట్లను వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లో 38 రాడార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
జాతీయ పార్కుల్లో బీబీసీ ఎంట్రీపై నిషేధం
భారతదేశంలోని జాతీయ పార్కుల్లోకి బీబీసీ, అందులో పనిచేసే జర్నలిస్ట్ జస్టిన్ రౌలత ప్రవేశంపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఫిబ్రవరి 27న జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌సీటీఏ) నిర్ణయం తీసుకుంది. అసోంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్క్‌లో భారత్ చేపడుతున్న జంతువుల రక్షణ చర్యలను ప్రశ్నిస్తూ బీబీసీ తీసిన డాక్యుమెంటరీ అత్యంత దారుణంగా ఉండటంతో ఎన్‌సీటీఏ ఈ చర్యలు తీసుకుంది.
సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 40 వేల మెగావాట్లు
దేశంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2020 నాటికి 40 వేల మెగావాట్లకు చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ ప్రతిపాదనలకు ఫిబ్రవరి 22న ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఒక్కోటి 500 మెగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్కులను రూ.8,100 కోట్లతో దేశంలోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2016 డిసెంబర్ 31 నాటికి భారత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9,012 మెగావాట్లు.
అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు ఆవిష్కరణ
ఫస్ట్‌క్లాస్ సౌకర్యాలతో కూడిన అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలుని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఫిబ్రవరి 22న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రిజర్వేషన్ అవసరం లేని ఈ రైలులో మెత్తని సీట్లు, అల్యూమినియం ప్యానల్స్, ఎల్‌ఈడి లైట్లు, బయో టాయిలెట్లు వంటి సౌకర్యాలు కల్పించారు. మొదటి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ముంబై-టాటానగర్ మధ్య సేవలు అందిస్తుంది.త్వరలో ఎర్నాకుళం-హౌరా మధ్య మరో అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు.
సిమి చీఫ్ సఫ్దార్ హుస్సేన్ కు జీవితఖైదు
దేశ ద్రోహం కేసులో నిషేధిత సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) సంస్థ చీఫ్ సఫ్దార్ హుస్సేన్ నగోరి సహా మరో పది మంది కార్యకర్తలకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ఫిబ్రవరి 27న న్యాయమూర్తి బి.కె.పలోడా తీర్పు వెలువరించారు. నిందితుల అభ్యర్థన మేరకు వీడియో కాన్ఫరెన్‌స ద్వారా కోర్టు తీర్పు వివరాలను వారికి తెలియజేశారు. మత విద్వేషాలను ప్రోత్సహించడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2008లో నిందితులపై దేశ ద్రోహం కేసు నమోదైంది.
అంటువ్యాధుల నివారణకు కొత్త చట్టాన్ని రూపొందించిన కేంద్రం
బయో టైజం సహా ప్రమాదకరమైన అంటువ్యాధుల నివారణకు ప్రజారోగ్య (అంటువ్యాధులు, బయోటైజం, విపత్తు నిర్మూలన, నియంత్రణ, నిర్వహణ)బిల్లు-2017కు రూపకల్పన చేసింది. దీనిపై అభిప్రాయాలను తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ముసాయిదాను పంపింది. 120 ఏళ్ల క్రితం ఏర్పాటైన అంటువ్యాధుల చట్టం- 1897 స్థానంలో ఈ కొత్త బిల్లుని కేంద్రం తీసుకురానుంది.
దేశంలో తొలి హెలిపోర్టు ప్రారంభం
దక్షిణాసియాలోనే తొలిసారిగా ఢిల్లీలో నెలకొల్పిన ఇంటిగ్రేటెడ్ హెలిపోర్టు (హెలికాప్టర్లు నిలిపే స్థలం) అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఈ హెలిపోర్టును కేంద్ర పౌర విమాన మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. దీన్ని పవన్ హాన్స్ లిమిటెడ్ సంస్థ రూ.100 కోట్లతో 25 ఎకరాల్లో నిర్మించింది. 16 హెలికాప్టర్ల సామర్థ్యంతో 150 మంది ప్రయాణికులకు సేవలందించేలా ఇందులో సౌకర్యాలు ఉన్నాయి.
రాజ్యాంగ ధర్మాసనానికి తలాక్ పిటిషన్లు
ముస్లిం సంప్రదాయాలైన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదలీ చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. వీటిపై ఫిబ్రవరి 16న విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ల విచారణకు విస్తృత ధర్మాసనం అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటు కానున్న రాజ్యాంగ ధర్మాసనం కేసులను మార్చి 30న విచారించనుంది.
సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
వాతావరణ మార్పులతో పర్యావరణానికి కలిగే ముప్పుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రదర్శన ప్రారంభమైంది. ఫిబ్రవరి 17న న్యూఢిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధ్దన్ జెండా ఊపి రైలుని ప్రారంభించారు. 7 నెలల పాటు దేశవ్యాప్తంగా తిరగనున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలు 68 స్టేషన్లలో ప్రదర్శన ఇవ్వనుంది. ఇందులో మొత్తం 16 బోగీల్లో ఉన్నాయి. ఒక్కో బోగీలో పర్యావరణానికి సంబంధించిన ఒక్కో అంశాన్ని ప్రదర్శనగా ఏర్పాటు చేశారు.
వైద్య కళాశాలల్లో ఈ-శవాలకు కేంద్రం అనుమతి
శరీర ధర్మశాస్త్రం గురించి వైద్య విద్యార్థులకు వివరించడానికి ప్రస్తుతం వాడుతున్న భౌతిక కాయాలకు బదులుగా ఎలక్ట్రానిక్ శవాలు ఉపయోగించనున్నారు. ఈ మేరకు తెలంగాణలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సిమ్యులేటరీ ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
సిమ్యులేటరీ విధానంలో మానవ భౌతికకాయం తరహాలోనే సృష్టించిన ఎలక్ట్రానిక్ శవం ఉంటుంది. ఇందులో గుండె, నరాలు, మెదడు, ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సల కోసం ఒక ప్రోగ్రామ్ తయారై ఉంటుంది. పరీక్ష చేసేటప్పుడు రక్తస్రావం జరుగుతున్నట్టు, గుండె కొట్టుకుంటున్నట్టు, ఊపిరితిత్తుల్లో శ్వాసప్రక్రియ జరుగుతున్నట్లు ఏర్పాట్లు ఉండటంతో దీని ద్వారా నిజమైన శవాన్ని పరీక్షించిన అనుభూతి కలుగుతుంది.
క్రియాశీలకంగా మారిన బారెన్ అగ్నిపర్వతం
దాదాపు 150 సంవత్సరాలుగా నిద్రాణ స్థితిలో ఉన్న ‘బ్యారెన్ ఐలాండ్’ అగ్నిపర్వతం తాజాగా క్రియాశీలకంగా మారి లావాను వెదజల్లుతుంది. ఈ మేరకు గోవాలోని జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్‌ఐఓ) శాస్త్రవేత్తల బృందం ఫిబ్రవరి 18న తెలిపింది. మనదేశంలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం ఇదొక్కటే.
అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో ఉన్న ఈ అగ్ని పర్వతం నుంచి 1991 నుంచి అప్పుడప్పుడు లావా, బూడిద వచ్చేవి. 2017 జనవరి 23న దీనిని పరీక్షించిన శాస్త్రవేత్తల బృందం అగ్నిపర్వత క్రియాశీలతను ద్రువీకరించారు.
ముగిసిన ఏరో ఇండియా-2017 ప్రదర్శన
బెంగళూరు యలహంక ఎయిర్‌బేస్‌లో ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఏరో ఇండియా-2017 అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ఫిబ్రవరి 18న ముగిసింది.
ఏరో ఇండియా తదుపరి ప్రదర్శన 2019లో గోవాలో జరగనుంది. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలు 1996 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి బెంగళూరులో జరుగుతున్నాయి. వైమానిక రంగంలో గణనీయ ప్రగతిని సాధించిన కర్ణాటక ఈ రంగంలోని హార్డ్‌వేర్ ఎగుమతుల్లో 65 శాతం వాటా కలిగి ఉంది.
భారత్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ
ప్రపంచపు తొలి ఇంటర్ పోర్టబుల్ పేమెంట్ యాక్సప్టెన్సీ సొల్యూషన్ ‘భారత్‌క్యూఆర్ కోడ్’ (QR-Qucik Response) ను ఫిబ్రవరి 20న కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీని ద్వారా రిటైల్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మరింత సులభతరం కానున్నాయి. ఈ విధానంలో ఐడీ, ఫోన్ నెంబర్ వంటివి అవసరం లేకుండానే వ్యాపారులు ఒక క్యూఆర్ కోడ్‌తో లావాదేవీలు నిర్వహించవచ్చు. వినియోగదారులు ఆ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ విధానం ఆండ్రాయిడ్ ఫోన్లలోనే పనిచేస్తుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI, మాస్టర్‌కార్డ్, వీసా సంస్థలు సంయుక్తంగా భారత్ క్యూఆర్ కోడ్‌ను అభివృద్ధి చేశాయి. దీన్ని అమలు చేసేందుకు 15 బ్యాంకులు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
హైకోర్టు జడ్జికి ధిక్కార నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
దేశంలోనే తొలిసారిగా కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 8న కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఫిబ్రవరి 13న న్యాయమూర్తి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆయన స్వాధీనంలో ఉన్న అన్ని న్యాయపరమైన, పరిపాలనాపరమైన ఫైళ్లను కోల్‌కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందజేయాలని నిర్దేశించింది.
జస్టిస్ కర్ణన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా పలువురు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు సీజేఐ, ప్రధాని, ఇతరులకు లేఖలు రాశారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది.
విదేశాల్లో రూ.16,000 కోట్ల నల్లధనం గుర్తింపు
హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఎస్‌బీసీ), ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే)లు ఇచ్చిన జాబితాలపై విచారణ జరిపి భారతీయులు విదేశాల్లో దాచిన రూ.16,200 కోట్ల నల్లడబ్బును గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లలో హెచ్‌ఎస్‌బీసీకి చెందిన విదేశీ శాఖల్లో భారతీయులు దాచిన రూ.8,200 కోట్ల నల్లడబ్బును పన్ను పరిధిలోకి తెచ్చినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 7న రాజ్యసభకు తెలిపారు. మరో రూ.8,000 కోట్లను రుణంగా తీసుకున్నట్లు గుర్తించామన్నారు. భారతీయులు దాచిన నల్లడబ్బుపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదన్నారు.
కంబాళ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
కర్ణాటకలో సంప్రదాయ దున్నపోతుల పందెం (కంబాళ), ఎడ్ల పందేలకు చట్టబద్ధ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకి ఆ రాష్ట్ర శాసనసభ ఫిబ్రవరి 13న ఆమోదిం తెలిపింది. 1960నాటి జంతుహింస నిరోధక చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి.
స్టెంట్ల ధరలను 85 శాతం తగ్గించిన కేంద్రం
గుండె శస్త్ర చికిత్సలో ఎంతో కీలకమైన కరోనరీ స్టెంట్ల ధరల్ని 85 శాతం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 14న ప్రకటన చేసిన ప్రభుత్వం ధరల తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో బేర్ మెటల్ స్టెంట్(BMS) రూ. 7,260.. డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్(DES) రూ.29,600 లకు లభించనున్నాయి.
ఇప్పటివరకు BMS ధర గరిష్టంగా రూ. 45 వేలు ఉండగా, DES రూ. 1.21 లక్షల వరకూ ఉండేది. ధరల తగ్గింపుతో గుండె సంబంధిత చికిత్సలపై దేశవ్యాప్తంగా ఏటా రూ.4,450 కోట్ల మేర భారం తగ్గుతుంది.
థియేటర్లలో జాతీయగీతంపై స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు
సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు గౌరవ సూచకంగా ఎప్పుడు నిలబడలన్నదానిపై సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది. ఈ అంశంలో పలు సందర్భాల్లో ఎదురవుతున్న గందరగోళానికి తెరదించుతూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమితల ధర్మాసనం ఫిబ్రవరి 14న వివరణ ఇచ్చింది.
సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడాలని సినిమా కథ, న్యూస్‌రీల్, డాక్యుమెంటరీల్లో భాగంగా వచ్చే జాతీయ గీతానికి లేచి నిలబడాల్సిన అవసరం లేదని చెప్పింది.
బాంబు దాడులు భారత్‌లోనే అధికం
2016లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన బాంబు దాడుల్లో ఎక్కువ పేలుళ్లు భారత్‌లోనే జరిగినట్లు నేషనల్ బాంబ్ డేటా సెంటర్(NBDC) వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 14న నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం గతేడాది భారత్‌లో 406 బాంబు దాడుల జరగ్గా 221 దాడులతో ఇరాక్ జాబితాలో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌లో 161, అఫ్గానిస్తాన్‌లో 132 దాడులతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. యుద్ధ సమయంలో ఇరాక్, అఫ్గాన్ దేశాలపై జరిగిన బాంబు దాడుల కంటే గతేడాది భారత్‌లో జరిగిన దాడులే అధికం.
తల్లిదండ్రులను పట్టించుకోకుంటే వేతనాల్లో కోతే!
పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై చర్య తీసుకోవాలని అసోం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వయసుపైబడిన తల్లిదండ్రుల బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో నుంచి కొంత మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందించనుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా ఫిబ్రవరి 7న ఈ ప్రకటన చేశారు. దీన్ని 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి అమలుచేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగి తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని.. లేకుంటే ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకుంటుందన్నారు.
డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ ద్వారా 6 కోట్ల మంది గ్రామీణులకు డిజిటల్ అక్షరాస్యతను అందించే కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 8న ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,351.38 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీన్ని 2019 మార్చి నాటికి పూర్తిచేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం కింద 2017-18లో 2.75 కోట్ల మందికి, 2018-19లో 3 కోట్ల మందికి డిజిటల్ అక్షరాస్యతను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మొబైల్ ఫోన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం, డిజిటల్ వ్యాలెట్, మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత చెల్లింపులపై అవగాహన కల్పిస్తారు.
నగదు రూప లావాదేవీలపై కేంద్రం కొరడా
రూ.3 లక్షలు లేదా అంతకుమించిన లావాదేవీలను నగదు రూపంలో చేస్తే అంతే మొత్తాన్ని (100 శాతం) జరిమానాగా విధించనున్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా ఫిబ్రవరి 5న తెలిపారు. నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించిన నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో చేర్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంగా తెలిపారు.
ఎంపీ, మాజీ మంత్రి అహ్మద్ మృతి
పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి ఇ.అహ్మద్ (78) ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలోని మరణించారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. కేరళకు చెందిన ఐయూఎంఎల్ నేత.. అహ్మద్ యూపీఏ ప్రభుత్వంలో వివిధ శాఖల సహాయ మంత్రిగా, గల్ఫ్ దేశాల్లో భారత అనధికార రాయబారిగా సేవలందించారు.
పంజాబ్, గోవాలో రికార్డు స్థాయి పోలింగ్
ఫిబ్రవరి 4న గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పంజాబ్‌లో 75 శాతం, గోవాలో 83 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఓటేయని వారికి ప్రశ్నించే అధికారం లేదు: సుప్రీంకోర్టు
ఓటేయని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 5న ఓ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా అక్రమ కట్టడాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీకి చెందిన వాయిస్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థకు చెందిన సామాజిక కార్యకర్త ధనేష్ తాను ఇంత వరకు ఒక్కసారి కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదని సుప్రీం కోర్టుకు చెప్పాడు. దీంతో జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ సామాజిక కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సహారా ఆస్తుల జప్తునకు సుప్రీం కోర్టు ఆదేశం
సహారా సంస్థకు చెందిన రూ.39 వేల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మహారాష్ట్ర పుణెలోని ఆంబే వాలీలో రూ.39 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని ఫిబ్రవరి 6న తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 20 లోపల ఎటువంటి వివాదాల్లేని ఆస్తుల జాబితాను అందించాలని సహారా గ్రూప్‌ను ఆదేశించింది. 2016 అక్టోబర్ 31 నాటికి సహారా గ్రూప్ ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.47,669 కోట్లు.

Published date : 11 Feb 2017 10:27AM