Covid-19 Vaccines: దేశంలో విక్రయానికి అనుమతి పొందిన వ్యాక్సిన్లు?
భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ జనవరి 27న షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఈ రెండు టీకాలు ఇకపై సాధారణ మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
2021, జనవరిలో అత్యవసర వినియోగానికి..
2021, జనవరిలో భారత ప్రభుత్వం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. అయితే బహిరంగ మార్కెట్‌లో విక్రాయానికి అనుమతించాలంటూ కోవాగ్జిన్ అభివృద్ది చేసిన భారత్ బయోటెక్, కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ సంస్థలు.. 2021, అక్టోబర్ 25న డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ, షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది.
చదవండి: చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ పురస్కారాన్ని పొందిన తొలి గుర్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు పొందిన వ్యాక్సిన్లు
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : కోవాగ్జిన్, కోవిషీల్డ్
ఎక్కడ : దేశంలో..
ఎందుకు : కోవిడ్–19 నియంత్రణ కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్